ఆ రెండు కులాల పెళ్ళంటా..! రాధాకృష్ణ పంతులట…!

Published by
Srinivas Manem

రాష్ట్రంలో ఓ కొత్త కులం రాబోతుంది…! రెండు ప్రధాన కులాలు కలిపి ఓ కులంగా అవతరించబోతున్నాయి…! ఆ కులానికి ప్రధాన కర్త, కర్మ, క్రియ… సర్వమూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండనున్నారు. గౌరవ అధ్యక్షుడి హోదాలో మాజీ సీఎం చంద్రబాబు ఉండనున్నారు…! నమ్మశక్యంగా లేదా…? నిజమని నమ్మరా…? అయితే ఆంధ్రజ్యోతిలో వారి కొత్త పలుకు చూడండి. ఆ కొత్త కులమేమిటో… ఆ రెండు ఏమిటో తెలుస్తుంది. అదే పనిగా… రాధాకృష్ణ అంతరార్ధం బోధపడుతుంది.

కొత్త ఫార్ములా రాత..!

కులాల మధ్య అంతరాన్ని తగ్గించేది కలం. పేద, పెద్ద అంతరం నిర్ములించలేది కలం. అది సమాజానికి బలం, బలగం. పొలంలో హలంలా… సమాజంలో కలం పాత్ర గొప్పది… ఇవన్నీ ఒకప్పుడు మాత్రమే…! ఇప్పుడు కులమే కలంగా మారి రాష్ట్రంలో రోడ్డుపై దొర్లుతుంది. విద్వేషాలను పెంచుతుంది. రోడ్డుకి చేరుస్తుంది. ప్రశాంతతని పోగొడుతుంది. ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతుంది. ప్రస్తుతం దీనిలో సింహ భాగం మాత్రం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అవును వారం వారం కొత్త పలుకు పేరిట కొత్త విషయాలను చెబుతున్నాననే వంకతో తనలోని అతి జ్ఞానాన్ని వాడుతుంటారు ఆయన. అసందర్భంగా.., అకారణంగా.., అనవసరంగా.., అనర్ధకంగా కలం మధ్యలోకి కులాన్ని తీసుకువచ్చి కల్పిస్తుంటారు ఊహాలన్ని వర్తలుగా రాస్తుంటారు. ఈ వారం కూడా అదే చెత్త పలుకు… ఓ కొత్త ఫార్ములాతో వచ్చింది. “అయ్యా జగనూ… నీ పథకాలు బాగున్నాయోయ్…”అంటూ బిస్కెట్లు వేస్తూనే ఓ సామాజిక వర్గాన్ని పక్కన పెడుతున్నాడని లేనిపోని ఒక ఊహాజనిత రాసుకొచ్చాడు.

అవసరం లేని వింత వాదన…!

కాపులు జగన్ కు దూరమవుతున్నారట. కాపులు కమ్మలకు దగ్గర అవుతున్నారట. జగమ్ కాపులను టార్గెట్ చేస్తున్నారట. కమ్మ సామాజికవర్గం లాగానే.., కాపులను కూడా దూరం చేసుకోడానికి జగన్ సిద్ధంగా ఉన్నారట… ఇదీ రాధాకృష్ణ వింత వాదన. నిజంగా ఆ పరిస్థితి ఉందా? జగన్ కాపులను దూరం చేసుకున్న దాఖలాలు ఉన్నాయా??కాపులను దూరం చేసే సాహసం జగన్ చేస్తున్నారా?? నిజం చెప్పుకోవాలంటే ఇవి అసలు చర్చనీయాంశాలే కాదు. అసలు ఏ ఒక్క కాపు నాయకుడిలో కూడా ఆ చర్చ, ఆ భావన లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి జగన్ సీఎం అయిన తర్వాత కాపు వర్గాన్ని దూరం పెట్టేలా ఒక్క అధికార, అనధికార నిర్ణయం తీసుకోలేదు. వీటికి సంబంధించి ఒక్క అడుగు, ఒక్క మాట, ఒక్క చేత ఏది కూడా జగన్ తరఫున రాలేదు. కానీ లేని చర్యలను చేసినట్టు చూపించి రాధాకృష్ణ రాసుకోవడంలోనే ఉంది మతలబు అంతా. దీన్ని ఉసిగొల్పడం అంటారు. అదే ప్రస్తుతం చేస్తున్నది.

ఊహకొచ్చింది.. ఉసిగొల్పేలా…!

గడిచిన పది నెలల్లో జగన్ కాపులను దూరం చేస్తున్నారు అనడానికి ఒక్క ఆధారమైన ఉందా…? రాజకీయపరమైన వ్యాఖ్య రాధాకృష్ణ చూపించగలరా?? పోనీ పది నెలల్లో జగన్ ప్రవేశపెట్టిన ఏ పథకాలు లోనూ ఇది ఇది కాపులకు వర్తించదు.., కమ్మలకు వర్తించదు అని చెప్పలేదు. పదవుల పంపిణీ లో కూడా కాపు సామాజిక వర్గానికి జగన్ చేసిన అన్యాయం ఏమి కనిపించట్లేదు. కానీ కమ్మ వర్గానికి వ్యతిరేకంగా జగన్ ఉన్నమాట ఒకరకంగా అంగీకారయోగ్యం. కానీ కమ్మ- కాపు ఒకే గాటన కట్టి వాళ్ళిద్దరు ఒకటి అవుతున్నట్టు వాళ్ళిద్దరినీ రాధాకృష్ణ పెళ్లి చేసే పని పెట్టుకున్నట్టు రాసుకొచ్చారు.

బాబు ఓటమికి కొత్త భాష్యం…!

ఇదే కొత్త పలుకులో… చంద్రబాబు నాడు అసలు రాజకీయమే చేయలేదట. మొత్తం పరిపాలన మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టారట…! మరి అమరావతిలో కొన్న భూములు, జిల్లాలో కాంట్రాక్టులు అన్నీ రాజకీయ ప్రయోజనాలను ఇవ్వకపోతే అభివృద్ధిని కాంక్షించే ఇచ్చారా..? ఒక సామాజిక, రాజకీయ ప్రయోజనాలకు చంద్రబాబు నాడు పని చేసారు కాబట్టి జనంలో చులకనయ్యారు.., ప్రత్యర్ధికి అదనపు బలం ఇచ్చారు. నిజానికి జగన్ కి భారీ విజయం వెనుక కారణాల్లో.. అతని సహజ బలంతో పాటూ చంద్రబాబు చేసిన తప్పులే జగన్ కి వరమయ్యాయి. అంతే తప్ప రాధాకృష్ణ చెప్పినట్టు చంద్రబాబు రాజకీయం చేయని కారణంగానే ఓడిపోలేదు.

Srinivas Manem

Share
Published by
Srinivas Manem

Recent Posts

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

Puri Jagannadh: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్… Read More

May 27, 2024

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Most Expensive Web Series: ఓటీటీలలో సినిమాలకు పోటీగా అత్యంత భారీ బడ్జెట్ తో అనేక వెబ్ సిరీస్ లు… Read More

May 27, 2024

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Aadujeevitham OTT: ఇటీవలి కాలంలో సూపర్ హిట్ అయినా కొన్ని మర్యాద సినిమాలు ఓటీటీలోకి ఆలస్యంగా వస్తున్నాయి. చాలా రోజుల… Read More

May 27, 2024

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీలలో ‌ ఓజీ మూవీ కూడా ఒకటి. ఈ సినిమా… Read More

May 27, 2024

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్లో రిషి మరియు వసుధార కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ… Read More

May 27, 2024

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ పై తీర్పు రిజర్వ్

YCP MLA Pinnelli: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్… Read More

May 27, 2024

Actress Hema: బెంగళూరు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా .. హజరుకాలేనంటూ లేఖ

Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ వినియోగంపై విచారణకు సినీ నటి హేమ డుమ్మా కొట్టారు. సీసీబీ… Read More

May 27, 2024

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి

Road Accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన యువతి (25) దుర్మరణం చెందారు. మృతురాలిని తెలంగాణకు… Read More

May 27, 2024

Graduate MLC Election 2024: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

Graduate MLC Election 2024: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఖమ్మం – నల్లగొండ –… Read More

May 27, 2024

ఏపీ ఎన్నిక‌లు: ప్ర‌మాదంలో ఎగ్జిట్ పోల్స్ ఎందుకు… ?

విశ్వ‌స‌నీయ‌త‌-న‌మ్మ‌కం అనే రెండు ప‌ట్టాల‌పై ప్ర‌యాణించే ఎగ్జిట్ పోల్స్‌కు.. దేశ‌వ్యాప్తంగా ఎంతో ఆద‌ర ణ ఉంది. కానీ.. ఇటీవ‌ల కాలంలో… Read More

May 27, 2024

Swati Maliwal: కోర్టులోనే కన్నీళ్లపర్యంతమైన రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ .. బిభవ్ కుమార్ బెయిల్ పై తీర్పు రిజర్వు

Swati Maliwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్ పై ఇవేళ హజారీ కోర్టులో… Read More

May 27, 2024

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

Asin's husband Rahul Sharma: వివాహం అనంతరం సినీ పరిశ్రమకు దూరమైన హీరోయిన్ల జాబితాలో అసిన్ ఒకరు. కేరళ రాష్ట్రంలోని… Read More

May 27, 2024

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సినిమా పరిశ్రమలోకి ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త బొమ్మలు హీరోయిన్లుగా అడుగుపెడుతున్నారు. అయితే వారిలో కొందరు… Read More

May 27, 2024