NewsOrbit
5th ఎస్టేట్

ఆ రెండు కులాల పెళ్ళంటా..! రాధాకృష్ణ పంతులట…!

రాష్ట్రంలో ఓ కొత్త కులం రాబోతుంది…! రెండు ప్రధాన కులాలు కలిపి ఓ కులంగా అవతరించబోతున్నాయి…! ఆ కులానికి ప్రధాన కర్త, కర్మ, క్రియ… సర్వమూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండనున్నారు. గౌరవ అధ్యక్షుడి హోదాలో మాజీ సీఎం చంద్రబాబు ఉండనున్నారు…! నమ్మశక్యంగా లేదా…? నిజమని నమ్మరా…? అయితే ఆంధ్రజ్యోతిలో వారి కొత్త పలుకు చూడండి. ఆ కొత్త కులమేమిటో… ఆ రెండు ఏమిటో తెలుస్తుంది. అదే పనిగా… రాధాకృష్ణ అంతరార్ధం బోధపడుతుంది.

కొత్త ఫార్ములా రాత..!

కులాల మధ్య అంతరాన్ని తగ్గించేది కలం. పేద, పెద్ద అంతరం నిర్ములించలేది కలం. అది సమాజానికి బలం, బలగం. పొలంలో హలంలా… సమాజంలో కలం పాత్ర గొప్పది… ఇవన్నీ ఒకప్పుడు మాత్రమే…! ఇప్పుడు కులమే కలంగా మారి రాష్ట్రంలో రోడ్డుపై దొర్లుతుంది. విద్వేషాలను పెంచుతుంది. రోడ్డుకి చేరుస్తుంది. ప్రశాంతతని పోగొడుతుంది. ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతుంది. ప్రస్తుతం దీనిలో సింహ భాగం మాత్రం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అవును వారం వారం కొత్త పలుకు పేరిట కొత్త విషయాలను చెబుతున్నాననే వంకతో తనలోని అతి జ్ఞానాన్ని వాడుతుంటారు ఆయన. అసందర్భంగా.., అకారణంగా.., అనవసరంగా.., అనర్ధకంగా కలం మధ్యలోకి కులాన్ని తీసుకువచ్చి కల్పిస్తుంటారు ఊహాలన్ని వర్తలుగా రాస్తుంటారు. ఈ వారం కూడా అదే చెత్త పలుకు… ఓ కొత్త ఫార్ములాతో వచ్చింది. “అయ్యా జగనూ… నీ పథకాలు బాగున్నాయోయ్…”అంటూ బిస్కెట్లు వేస్తూనే ఓ సామాజిక వర్గాన్ని పక్కన పెడుతున్నాడని లేనిపోని ఒక ఊహాజనిత రాసుకొచ్చాడు.

అవసరం లేని వింత వాదన…!

కాపులు జగన్ కు దూరమవుతున్నారట. కాపులు కమ్మలకు దగ్గర అవుతున్నారట. జగమ్ కాపులను టార్గెట్ చేస్తున్నారట. కమ్మ సామాజికవర్గం లాగానే.., కాపులను కూడా దూరం చేసుకోడానికి జగన్ సిద్ధంగా ఉన్నారట… ఇదీ రాధాకృష్ణ వింత వాదన. నిజంగా ఆ పరిస్థితి ఉందా? జగన్ కాపులను దూరం చేసుకున్న దాఖలాలు ఉన్నాయా??కాపులను దూరం చేసే సాహసం జగన్ చేస్తున్నారా?? నిజం చెప్పుకోవాలంటే ఇవి అసలు చర్చనీయాంశాలే కాదు. అసలు ఏ ఒక్క కాపు నాయకుడిలో కూడా ఆ చర్చ, ఆ భావన లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి జగన్ సీఎం అయిన తర్వాత కాపు వర్గాన్ని దూరం పెట్టేలా ఒక్క అధికార, అనధికార నిర్ణయం తీసుకోలేదు. వీటికి సంబంధించి ఒక్క అడుగు, ఒక్క మాట, ఒక్క చేత ఏది కూడా జగన్ తరఫున రాలేదు. కానీ లేని చర్యలను చేసినట్టు చూపించి రాధాకృష్ణ రాసుకోవడంలోనే ఉంది మతలబు అంతా. దీన్ని ఉసిగొల్పడం అంటారు. అదే ప్రస్తుతం చేస్తున్నది.

ఊహకొచ్చింది.. ఉసిగొల్పేలా…!

గడిచిన పది నెలల్లో జగన్ కాపులను దూరం చేస్తున్నారు అనడానికి ఒక్క ఆధారమైన ఉందా…? రాజకీయపరమైన వ్యాఖ్య రాధాకృష్ణ చూపించగలరా?? పోనీ పది నెలల్లో జగన్ ప్రవేశపెట్టిన ఏ పథకాలు లోనూ ఇది ఇది కాపులకు వర్తించదు.., కమ్మలకు వర్తించదు అని చెప్పలేదు. పదవుల పంపిణీ లో కూడా కాపు సామాజిక వర్గానికి జగన్ చేసిన అన్యాయం ఏమి కనిపించట్లేదు. కానీ కమ్మ వర్గానికి వ్యతిరేకంగా జగన్ ఉన్నమాట ఒకరకంగా అంగీకారయోగ్యం. కానీ కమ్మ- కాపు ఒకే గాటన కట్టి వాళ్ళిద్దరు ఒకటి అవుతున్నట్టు వాళ్ళిద్దరినీ రాధాకృష్ణ పెళ్లి చేసే పని పెట్టుకున్నట్టు రాసుకొచ్చారు.

బాబు ఓటమికి కొత్త భాష్యం…!

ఇదే కొత్త పలుకులో… చంద్రబాబు నాడు అసలు రాజకీయమే చేయలేదట. మొత్తం పరిపాలన మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టారట…! మరి అమరావతిలో కొన్న భూములు, జిల్లాలో కాంట్రాక్టులు అన్నీ రాజకీయ ప్రయోజనాలను ఇవ్వకపోతే అభివృద్ధిని కాంక్షించే ఇచ్చారా..? ఒక సామాజిక, రాజకీయ ప్రయోజనాలకు చంద్రబాబు నాడు పని చేసారు కాబట్టి జనంలో చులకనయ్యారు.., ప్రత్యర్ధికి అదనపు బలం ఇచ్చారు. నిజానికి జగన్ కి భారీ విజయం వెనుక కారణాల్లో.. అతని సహజ బలంతో పాటూ చంద్రబాబు చేసిన తప్పులే జగన్ కి వరమయ్యాయి. అంతే తప్ప రాధాకృష్ణ చెప్పినట్టు చంద్రబాబు రాజకీయం చేయని కారణంగానే ఓడిపోలేదు.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment