NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

తెలుగుదేశం (టీడీపీ)పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ప్రక్షాళన మీద కాస్త సీరియస్ గానే దృష్టి పెట్టారు. ఈ క్రమంలో భాగంగా ఆయన నియోజకవర్గాల ఇన్ చార్జిలతో నేరుగా మాట్లాడుతున్నారు. ఒన్ టు ఒన్ మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. ఇన్ చార్జిలను పార్టీ కార్యాలయానికి పిలిపించి వారితో బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు ఇన్ చార్జి మీద కార్యకర్తల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది కూడా తీసుకుని కొంత మందికి క్లాస్ పీకుతున్నారు. కొంత మందిని మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో కొన్ని ప్రక్షాళనలు రాబోతున్నాయి. కొంత మంది ఇన్ చార్జిలను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం అందుతోంది. ఎందుకు ఆ అవసరం ఉంది అంటే..?

మందిని సున్నితంగా, మరి కొంత మందికి సీరియస్ గా క్లాస్

ఈ మూడు నెలలు మే, జూన్, జూలై పని తీరు పరిశీలన చేస్తున్నారు. ఈ మూడు నెలల్లో బాదుడే బాదుడు కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. సభ్యత్వాల నమోదు కూడా ప్రతి నియోజకవర్గంలో 20వేలకు పైగా ఉండాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో 3, 4వేల సభ్యత్వాల వరకే ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జి ఇస్తే ఎమ్మెల్యే సీటు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ఎమ్మెల్యే సీటు వచ్చింది కాబట్టి క్యాడర్ అంతా తన కంట్రోల్ లోనే ఉండాలి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది నోరు జారడం, ఏది పడితే అది అనేయడం, నోరు పారేసుకోవడం, అలాగే గ్రూపులను సృష్టించడం ఇవన్నీ ఎక్కువ అయ్యాయి. ఇవన్నీ గమనించిన చంద్రబాబు కొంత మందిని సున్నితంగా మందలిస్తున్నారు. మరి కొంత మందికి సీరియస్ గానే క్లాస్ తీసుకుంటున్నారుట.

 

కొంత మందికి సీట్లు కన్ఫర్మ్

సమీక్షల్లోనే కొంత మందికి సీట్లు కన్ఫర్మ్ చేస్తున్నారుట. ఉదాహరణకు తీసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు. మార్కాపురం ఇన్ చార్జిలతో చంద్రబాబు మాట్లాడారు. మార్కాపురం నారాయణరెడ్డి, సంతనూతలపాడు విజయకుమార్ కు టికెట్ కన్ఫర్మ్ చేశారు. కందుకూరు ఇన్ చార్జి నాగేశ్వరరావును పిలిపించి మాట్లాడుతున్నారు. ఇంత వరకూ ఆయనకు కన్ఫర్మ్ చేయలేదు. కందుకూరు టికెట్ నాగేశ్వరరావుకు ఇస్తారా లేక పోతుల రామారావుకు ఇస్తారా లేదా ఇంకా వేరే ఎవరికైనా ఇస్తారా అనేది డిసైడ్ కాలేదు. కర్నూలు జిల్లాలో చూసుకుంటే ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియకు కన్పర్మ్ చేయలేదు. ఆ పక్కనే ఉన్న డోన్, బనగానపల్లి, ఆలూరు ఇవన్నీ అంతర్గత చర్చల్లో భాగంగా కన్ఫర్మ్ చేశారు. ఆళ్లగడ్డ మాత్రం డిసైడ్ చేయలేదు. అలానే ధర్మవరం ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా,. జిల్లాల వారిగా చంద్రబాబు నేరుగా మాట్లాడుతూ కొందరికి కన్ఫర్మ్ చేస్తున్నారు. కొన్ని హోల్డ్ లో పెడుతున్నారు.

 

40 నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలను మార్చే అవకాశం

టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చల్లో దాదాపుగా 40 నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలను మార్చే అవకాశం ఉందనేది టాక్. వారి స్థానంలో కొత్త వారికి టికెట్ లు ఇవ్వనున్నారు అని చర్చ జరుగుతోంది. దీనిలో భాగంగా పార్టీ ప్రక్షాళన జరుగుతోందని అంటున్నారు. దాదాపు 70 సీట్లు యువతకు ఇస్తామని ఇంతకు ముందే చంద్రబాబు ప్రకటించారు. ఆ దిశగా కొత్త వారిని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది సాధ్యం అవ్వాలంటే ఎవరైతే ఇన్ చార్జిలు సక్రమంగా పని చేయడం లేదో వారిని పక్కన పెట్టి అక్కడ కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి. కొత్త వాళ్లకు ఇస్తే అక్కడి పాత నాయకత్వం అసంతృప్తికి లోను కాకుండా చూసుకోవాలి. ఇవన్నీ పార్టీలో అంతర్గతంగా సమస్యలను సృష్టించేవే. అక్కడి సమస్యలను అధిగమిస్తూ కొత్త వాళ్లను రంగంలోకి తీసుకురావడమే టీడీపీ ముందు ఉన్న పెద్ద టాస్క్.

ఎస్సీ, బీసీ: టీడీపీకి పొలిటికల్ దెబ్బ..! జగన్ వేసిన ఉచ్చు.. టీడీపీకి నష్టం తప్పదా..?

author avatar
Special Bureau

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju