5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Share

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా నిన్న సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ఆ తరువాత జరిగిన సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గత ప్రసంగాల్లో ఎప్పుడూ మాట్లాడని మాటలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి పార్టీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.అవే ఇప్పుడు జనసేన సిద్ధాంతాలు, మూలాల్లోకి వెళ్లి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తొంది. నిజానికి ఆయన మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమైనవే. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

వాళ్లందరూ పార్టీని విలీనం చేయించి పదవులు అనుభవించారు

చిరంజీవి, ప్రజా రాజ్యం పార్టీ అనే మాట చెప్పకుండానే “మా అన్నయ్య గారు 2009 ఎన్నికల్లో పార్టీ పెట్టారు. చాలా మంది ఓట్లు వేశారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్లు, ఇటీవల మాజీలు అయిన మంత్రులు కూడా మా అన్నగారి పార్టీలో ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్లందరి రాజకీయ భవిష్యత్తు మా అన్నగారితోనే మొదలు అయ్యింది. వాళ్లే దగ్గర ఉండి ఒక జాతీయ పార్టీలో విలీనం చేయించారు. వాళ్లందరూ దగ్గర ఉండి పార్టీని విలీనం చేయించి పదవులు అనుభవించారు. కానీ అదే పార్టీ ఇప్పటి వరకూ ఉండి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవి. రాష్ట్రం ఈ విధంగా ఉండేది కాదు” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నూటికి నూరు శాతం చాలా మంది ఈ వ్యాఖ్యలను ఏకీభవిస్తారు. ప్రజారాజ్యం పార్టీ 2019 ఎన్నికల్లో ఉండి ఉంటే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం వేరేలా ఉండేది. చిరంజీవి తొందరపడి పార్టీని విలీనం చేశారు. పార్టీని తొందరపడి విలీనం చేసి తన రాజకీయ జీవితాన్ని తానే సమాధి కట్టేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీకి అప్పట్లోనే 70లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. నాడు 19 స్థానాలు వచ్చాయంటే ఆయన కాస్త వెయిట్ చేసి ఉంటే తరువాతి ఎన్నికల్లో 50వరకూ పెరిగేవేమో..! రాష్ట్రం విడిపోయింది కాబట్టి 2014 ఎన్నికల్లో మంచి సీట్లు రావడంతో పాటు 2019 ఎన్నికల నాటికి మరింత పెరిగే అవకాశం ఉండేదేమో..! నిజంగా ప్రజారాజ్యం పార్టీ ఇప్పటి వరకూ ఉండి ఉంటే రాజకీయ పరిస్థితుల్లో మార్పు ఉండేది.

అందరినీ చేతులు కట్టుకుని నిల్చునేలా చేస్తున్నారు

ఇదే సందర్బంలో చిరంజీవి గురించి మరొక కామెంట్ కూడా చేశారు పవన్ కళ్యాణ్.సీఎం జగన్ పార్టీలో చిన్న యువకుడి దగ్గర నుండి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న నటులను కూడా తన దగ్గర చేతులు కట్టుకుని నమస్కారం పెట్టించుకుంటున్నారు అని తన అన్నను ఉద్దేశించే వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆన్ లైన్ టికెటింగ్ సమస్య వచ్చినప్పుడు చిరంజీవి పదేపదే జగన్మోహనరెడ్డిని కలిశారు. కలిసిన ప్రతి సారీ చేతులెత్తి నమస్కరించే వారు. ఆ సమయంలో జగన్మోహనరెడ్డి తిరిగి నమస్కరించలేదు అని సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది. ఆ పాయింట్ ను ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. మీ అధికారంతో చిన్న స్థాయి వ్యక్తుల నుండి సెలబ్రెటీలు, ప్రముఖుల వరకూ అందరినీ చేతులు కట్టుకుని నిల్చునేలా చేస్తున్నారంటూ జగన్ ను విమర్శించారు పవన్ కళ్యాణ్. చిరంజీవి పార్టీని విలీనం చేయడం, జగన్మోహనరెడ్డి వద్ద చేతులు జోడించి నిల్చోవడం పవన్ కళ్యాణ్ కు నచ్చలేదు. అందుకే ఆ విషయాలపై పవన్ మాట్లాడారు. ఇద్దరు సొంత అన్నదమ్ములైనా ఇద్దరి భావజాలాలు, సిద్ధాంతాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి పరోక్షంగా తన అన్నయ్య చేసిన తప్పులను ప్రస్తావించారు.

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?


Share

Related posts

Today Gold Rate: తటస్థంగా బంగారం.. పైపైకి కదిలిన వెండి.. నేటి రేట్లు ఇలా..!!

bharani jella

బాబు ప్రేమ నిజమైతే ఏపీ మంత్రి సేఫ్!

CMR

మాస్క్ పెట్టకుంటే భారీ జరిమానా.. మీ ఇష్టం!

Teja