Krishna Mukunda Murari: కృష్ణ ఉదయాన్నే నిద్ర లేచే సరికి ఇంటి బయట ముగ్గు వేసి ఉంటుంది. నేనే కదా రోజు ముగ్గు వేసేది. ఈరోజు ముగ్గు ఎవరు వేసి ఉంటారు అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది .అప్పుడు ఇంట్లోకి రాగానే నందిని నువ్వేనా ముగ్గు వేసింది అని కృష్ణ అడుగుతుంది. నేను కాదు ఒకవేళ చిన్నమ్మ ఏసిందేమో అయితే ఇప్పుడు ఏమైంది అని కృష్ణ అడుగుతుంది. అంతలో సుమతి అక్కడికి వస్తుంది తనని కూడా కృష్ణ అడుగుతుంది తను కూడా నేను కాదు అని అంటుంది. ఇక్కడ ముగ్గు ఎవరు వేశారు అనేది పెద్ద సమస్య అని మధు అంటుండగా.. ఏంట్రా పొద్దున్నే సమస్య అంటున్నావు. ఏంటి కృష్ణ ముగ్గేసి వచ్చావా ఏంటి సమస్య అని రేవతి అడుగుతుంది. మీరు కూడా ముగ్గు వేయలేదా అత్తయ్య అయితే ఇప్పుడు ముగ్గు ఎవరు వేసి ఉంటారు అని కృష్ణ అనుకుంటుంది.
ఆ ముగ్గు బహుశా ముకుంద వేసి ఉంటుందా అని కృష్ణ అనుకుంటూ ఉండగా అప్పుడు ముకుందా అక్కడికి వచ్చి అందరికీ హారతి తీసుకోమని హారతి ఇస్తుంది నిజంగానే ముకుంద వేసింది ఉంటుందా అని మధు అని అడగగా.. ముకుందా ఎప్పటికీ ముగ్గు వేయదు అని మధు అంటాడు అప్పుడు ఆ ముగ్గు నేనే వేశాను అని ముకుందా అంటుంది. ముకుంద మాట విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. అయినా నువ్వు ఎప్పుడూ ముగ్గు వేయలేదు కదా ముకుందా అని కృష్ణ అడుగుతుంది ఇప్పటివరకు వేయలేదు ఇకనుంచి ఈ పనులన్నింటినీ నేనే చేస్తాను నువ్వు నీ ఎనర్జీ అంతా కూడా మురారి కోసమే దాచుకో ఇక ఇంటి పనుల గురించి నువ్వు ఆలోచించుకో ఆ పనులన్నింటినీ నేను చేసుకుంటా అని ముకుంద అంటుంది. ముకుంద లో వచ్చిన మార్పును చూసి ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు కానీ ముకుంద ఏదో తేడా చేస్తుంది అని మధు అనుకుంటాడు.
ఇంట్లో వాళ్ళందరూ కృష్ణ, మురారి ల శోభనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే అందుకు కావలసిన లిస్ట్ అంతా ప్రిపేర్ చేసే ఇవ్వండి అత్తయ్య నేను తీసుకు వస్తాను అని ముకుందా అంటుంది అప్పుడు భవాని కోపంగా ముకుంద వైపు చూస్తూ రేవతి వాళ్ళ ఇష్టంతో నందు గౌతమ్ కి ఇవ్వు వాళ్ళిద్దరూ తీసుకు వస్తారు జరిగేది శుభకార్యం కదా అని ఇన్ డైరెక్టుగా ముకుందని ఎన్నిసార్లు చేస్తూ మాట్లాడుతుంది భవాని ఆ మాటల్లో ఆంతర్యం అర్థం చేసుకున్న మధు ఒకప్పుడు ముకుందను పెద్ద పెద్దమ్మ చాలా లైక్ చేసింది. ఇప్పుడు తను ముగ్గుందని హేట్ చేస్తుంది నేను కూడా ముకుందను హేట్ చేస్తున్నాను నేను కరెక్టా పెద్దమ్మ కరెక్టా అని మధు ఆలోచిస్తూ ఉంటాడు అంతలో పంతులుగారు రానే వస్తారు శోభనం ముహూర్తం ఇంటి దగ్గరే డిసైడ్ చేసి వచ్చానమ్మా మీకు సమయం వృధా చేయటం ఇష్టం లేదు అని ఆయన చెప్పగానే మధు భలే మంచి పని చేశారు అని మధు అంటారు అప్పుడు భవాని మధువైపు కోపంగా చూస్తుంది. మధు తత్తర పడతాడు. ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకు మంచి ముహుర్తం ఉంది. అది చాలా బాగుంది అని ఆయన చెబుతారు. ఇక అందరూ సంతోషిస్తారు. అయితే సాయంత్రం శోభనం ముహూర్తానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చూడండి అని భవాని అంటుంది. అప్పుడు సుమతి కృష్ణతో కృష్ణ నేను నీకు ముందుగానే చెబుతున్నా.. నాకు పాపే కావాలి అని అంటుంది. అవును నాకు కూడా పాపే కావాలి అది కూడా నీలా తింగరిలా ఉండాలని రేవతి అంటుంది. అప్పుడు శకుంతల నాకు ముకుంద ఒక పాప ఒక బాబు ఇద్దరు కావాలి అని అంటుంది. అప్పుడు చాలు చాలు ఆపండి అని భవాని అంటుంది. నందు, గౌతమ్ మీరిద్దరూ కావలసిన ఏర్పాట్లు చూడండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ముకుంద కృష్ణను నేను అందంగా ముస్తాబు చేస్తాను అని చెప్పి కృష్ణని బ్యూటీ పార్లర్ తీసుకు వెళ్తున్నాను అని ముకుంద చెబుతుంది.
ఇక కృష్ణుని ముకుందా ఓ రెస్టారెంట్ కి తీసుకువెళ్తుంది. ఏంటి ముకుందా? పార్లర్కి తీసుకువెళ్తాను అని అన్నావు కదా మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చావ్ ఏంటి అని ముకుందా నీ కృష్ణ అడుగుతుంది తీసుకువెళ్తాను కృష్ణ అంతకుముందు నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. గతంలో నీతో నేను తప్పుగా ప్రవర్తించాను వాటన్నింటినీ మనసులో పెట్టుకోవద్దు అని ముకుందా చెబుతుంది. అంతేకాకుండా నీ మీద ఎప్పుడైనా దురుసుగా ప్రవర్తించి ఉంటే వాటిని మనసులో పెట్టుకోవద్దు అని చెబుతుంది. అప్పుడు కృష్ణ కూడా ముకుందతో నేను కూడా నీతో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే నువ్వు కూడా వాటన్నింటినీ మనసులో పెట్టుకోవద్దు అని కృష్ణ చెబుతుంది నువ్వు కూడా నీ లైఫ్ ని అందంగా ప్లాన్ చేసుకో ముకుందా అలాగే నీ లైఫ్ ని నేను డిజైన్ చేస్తాను అని కృష్ణ అంటుంది. ముందు నాన దగ్గరికి వెళ్ళాలి. నాన్నతో మాట్లాడిన తర్వాత మిగతా విషయాలన్నీ ఆలోచిస్తాను అని ముకుందా కృష్ణతో అంటుంది. ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని ఇకనుంచి సంతోషంగా ఉందామని పాత విషయాలు మనసులో పెట్టుకోకుండా ఉందామని మాట్లాడుకుంటారు.
మధు కృష్ణ ఎక్కడా అని మురారి అంటాడు. ఒక రేర్ కాంబినేషన్, రెండు విభిన్న ధృవాలు బయటికి వెళ్ళాయి అని మధు అంటాడు. కృష్ణ ని ముకుంద బయటికి తీసుకు వెళ్ళింది అని మధు అంటాడు. అప్పుడు మురారి కంగారు పడతాడు. అప్పుడే ముకుంద కృష్ణని అందంగా ముస్తాబు చేసి తీసుకు వస్తుంది. కృష్ణ హెయిర్ స్టైల్ చూసి మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ముకుంద మా కృష్ణని చాలా అందంగా తయారు చేసి తీసుకువచ్చావు చాలా బాగుంది అని సుమతి అంటుంది. ఇంతకుముందు ఎప్పుడైనా బ్యూటీ పార్లర్ కి వెళ్ళావా కృష్ణ అని గౌతమ్ అడుగుతాడు లేదు అని కృష్ణ అంటుంది. అత్తయ్య ఈ రోజు కర్రీ ఎంటి నేను మీకు హెల్ప్ చేస్తాను అని కృష్ణ అంటుంది. కృష్ణ నువ్వు ఏం హెల్ప్ చేయొద్దు నువ్వు వెళ్లి సాయంత్రం ముహూర్తానికి సిద్ధంగా ఉండు ఈ లోపు ఉన్న సమయం అంతా కూడా మురారితో కలిసి కబుర్లు చెప్పుకో ఇక నువ్వు పైకి వెళ్ళు అని ముకుందా కృష్ణని పైకి పంపిస్తుంది. కృష్ణ సిగ్గుపడుతూ మురారిని చూస్తే అక్కడ నుంచి గదిలోకి వెళ్తుంది.
ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారిలా శోభనానికి అందరూ అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచుతారు. ఒకవైపు మురారిని ఇంట్లో మగవారందరూ రెడీ చేస్తారు. మరోవైపు కృష్ణని ఇంట్లో ఆడవాళ్ళందరూ కలిసి రెడీ చేస్తారు. ఇక కృష్ణుని గదిలోకి పంపిస్తుండగా ముకుంద ఎక్కడ అని కృష్ణ అడుగుతుంది. అప్పుడు ముకుందా ఏడుస్తూ తన గదిలో ఉంటుంది. ఇక ఈ శోభనం జరుగుతుందా లేదంటే పోస్ట్ పోన్ అవ్వడానికి ముకుంద ఏదైనా ప్లాన్ చేసిందా అనేది చూడాలి. ఒకవేళ కృష్ణ మురారిలా శోభనం ఆపడానికి ముకుంద కావాలని ఈ విధంగా కుట్ర చేస్తుందా అనేది చూడాలి.
Karthika Deepam 2 May 9th 2024 Episode: దీప తీయకపోయినప్పటికీ పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా… Read More
Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More