Kalki 2898 AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “కల్కి 2898 AD” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత హైబడ్జెట్ సినిమాగా చిత్రీకరణ జరుపుకుంటుంది. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ టెక్నాలజీ తోనే సినిమా చిత్రీకరణ జరుపుకుంటూ ఉంది. అక్కడ కొన్ని వందల కోట్లు విలువ చేస్తే కెమెరాలను అద్దెకు తీసుకొచ్చి…”కల్కి 2898 AD” సినిమా షూటింగ్ చేయటం జరిగింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటానీ, కమలహాసన్ లాంటి భారీ కాస్టింగ్ ఈ సినిమాలో ఉంది.
ఈ సినిమా జనవరి 24వ తారీఖు విడుదల చేస్తున్నట్లు మొదటి అధికారిక తేదీ ప్రకటన చేయడం జరిగింది. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఇప్పుడు కొత్త తేదీ ప్రకటన సంక్రాంతి కానుకగా చేశారు. సమ్మర్ కానుకగా మే 9 వ తారీకు “కల్కి 2898 AD” సినిమా విడుదలవుతున్నట్లు తెలిపారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50వ సినిమాగా “కల్కి 2898 AD” చిత్రీకరణ జరుపుకుంటుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో గతంలో ఇదే తేదీన మహానటి, జగదేకవీరుడు సినిమాలు విడుదలయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. దీంతో అదే సెంటిమెంట్ తేదీ ఖరారు చేశారు. వాస్తవానికి ప్రభాస్ హీరోగా మొదటి సినిమా ఈశ్వర్ వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే తెరకెక్కాల్సింది.
కానీ కొన్ని కారణాలవల్ల ప్రభాస్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ సినిమా మిస్ చేసుకోవడం జరిగింది. ఈసారి మాత్రం అవకాశం రావడంతో గ్లోబల్ స్థాయిలో “కల్కి 2898 AD” సినిమా నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అత్యంత హైబడ్జెట్ సినిమాగా.. ఈ సినిమాని నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు. గత కొంతకాలం నుండి వరుస పరాజయాలతో సతమతమైన ప్రభాస్ “సలార్” సినిమాతో హిట్ అందుకోవటం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 22వ తారీకు సలార్ విడుదల అయింది. విడుదలైన అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More