NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ఎనిమిది నుంచి 10 ఎంపీ సీట్లు గెలవాలనే ఉద్దేశంతో గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు దూసుకు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత… వెంటనే చేరుకున్న కేసీఆర్… మళ్లీ పార్టీని బలంగా తయారు చేసేందుకు సిద్ధమయ్యారు.

ఆ దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు. బస్సు యాత్రలు, రోడ్ షోలు నిర్వహిస్తూ జనాలకు దగ్గరవుతున్నారు కేసీఆర్. అయితే ఇలాంటి నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఊహించని షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొదటినుంచి గులాబీ పార్టీ నీడన ఉన్న తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ ఆచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ కండువా కప్పుకుంది. తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు… గులాబీ పార్టీలోనే శంకరమ్మ ఉన్న సంగతి తెలిసిందే.

2014 సంవత్సరంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు కేసీఆర్. అయితే అప్పుడు ఉత్తంకుమార్ రెడ్డి చేతిలో శంకరమ్మ ఓడిపోయింది. ఇక మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కెసిఆర్ నాన్చుడు ధోరణి ప్రదర్శించారు. అయితే కెసిఆర్ వ్యవహారం నచ్చక… తాజాగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు శంకరమ్మ. శ్రీకాంతాచారిలాంటి వెయ్యి మంది కాళి మాంసపు ముద్దలుగా మారి ఉడుకుతుంటే చూసి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని… ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు శంకరమ్మ.

అయితే గులాబీ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఇలాంటి ఉద్యమ అమరవీరుడి తల్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం కేసిఆర్ కు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. తెలంగాణ అమరవీరులకు అలాగే తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ న్యాయం చేయడం లేదని మెసేజ్ జనాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు శంకరమ్మ ను పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అదే అంశాన్ని తెరపైకి తీసుకురాబోతుంది. అందుకే కాపు కాసి… శంకరమ్మ ను పార్టీలోకి తీసుకున్నారు.

అయితే గద్దర్ విషయంలో మోసం చేసినట్లే శంకరమ్మను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కూడా కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు గద్దర్ పేరును ఆయన కుటుంబాన్ని రేవంత్ రెడ్డి బాగానే వాడుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ గద్దర్ కూతురికి ఇవ్వకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ఇచ్చి దారుణంగా మోసం చేశారు రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు అవసరం తీరాక శంకరమ్మ కూడా రేవంత్ రెడ్డి అలాగే చేస్తారని కొంతమంది చెబుతున్నారు.

ఏది ఏమైనా రాజకీయ పార్టీలకు అవసరాలు తప్ప మనుషులు అవసరం ఉండదని ఈ అంశాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాలను గుర్తు పెట్టుకొని… ఈ నాయకుడైన ఉండాలి. గులాబీ పార్టీలో దక్కని ప్రాధాన్యత…శంకరమ్మ కు కాంగ్రెస్ పార్టీలో ఆయన దక్కాలని కొంతమంది ఉద్యమకారులు కోరుకుంటున్నారు.

Related posts

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ .. నైరుతి వచ్చేసింది

sharma somaraju

ఏపీ పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ సుప్రీం చెంతకు..

sharma somaraju

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు: సీఈవో మీనా

sharma somaraju

దేవినేని వార‌సుడికి ఎగ్జిట్‌ సెగ‌.. ఇలా జ‌రిగిందేంటి..?

రాజ‌కీయాల్లో వెలిగి.. మేనేజ్‌మెంట్‌లో ఓడారు..!

ఆరా మ‌స్తాన్ చెప్పింది నిజ‌మైతే.. చంద్ర‌బాబుదే విజ‌యం..!

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

BRS: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకున్న బీఆర్ఎస్

sharma somaraju

వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ..  అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ నివాళి

sharma somaraju

MLC Election: పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

sharma somaraju

బీఆర్ఎస్ ఫ్యూచ‌ర్‌లో ఏం క‌న‌ప‌డుతోందంటే…?

ఏపీ ఎగ్జిట్ పోల్స్‌… ఈ ఒక్క‌టి మాత్రం నిజం…!