Corona Vaccine : కరోనా వైరస్ భారతదేశంలో మళ్లీ పుంజుకుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా ఎక్కువ మంది ప్రజల వద్దకు చేర్చే పనిలో కేంద్ర ప్రభుత్వ అధికారులు నిమగ్నమై ఉన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ శాయశక్తులా సహకరిస్తున్నారు. ఇకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన వ్యాక్సిన్లు మార్కెట్లో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ పైన మాత్రం భయాందోళనలు అలాగే కొనసాగుతున్నాయి.
యూరప్ దేశాల్లో ఈ వ్యాక్సిన్ పేరు చెబితే వణికిపోతున్నారు. అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వల్ల ఆస్ట్రియాలో శరీరంలో రక్తం గడ్డ కట్టుకొని ఒక నర్స్ చనిపోయిందని తెలియజేయడంతో ఆ దేశాలు తాత్కాలికంగా వ్యాక్సిన్ పంపిణీ ఆపేశాయి. నిపుణులు అలాంటిది ఏమీ లేదు అని చెప్పినప్పటికీ కొన్ని దేశాలు తిరిగి వ్యాక్సిన్ కొనడానికి సంశయిస్తుంటే… మరికొన్ని మాత్రం నమ్మకంగా పంపిణీ ప్రారంభించాయి.
ఇక మన దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి కోవిషీల్డ్ కాగా మరొకటి కోవ్యాగ్జిన్ టీకా. ఇక్కడ విషయమేమిటంటే… అస్ట్రాజెనెకా ఫార్ములా… భారత్ లో తయారుచేయబడిన వ్యాక్సిన్ల ఫార్ములాలు ఒకటే కావడంతో మన దగ్గర కూడా రక్తం గడ్డ కడుతుంది అని దేశమంతా రూమర్లు వ్యాపించాయి. ఈ వార్త కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది. దీంతో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పరిస్థితి చేయి దాటి పోతుంది అనుకుంటున్న సమయంలో దీనిపై క్లారిటీ ఇచ్చింది. మన కోవిషీల్డ్ సురక్షితమైనదని… ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అసలు ఇప్పటి వరకు భారత్ లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు తలెత్తదని తెలిపారు. జాతీయ స్థాయి ఏఈఎఫ్ ఐ నిపుణుల కమిటీ కూడా ఇది సురక్షితమైనదని తేల్చిందని… నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి కె పాల్ తెలిపారు.
అలాగే ఈ కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్లు బ్రిటన్, బ్రెజిల్ స్ట్రైన్ ల పై కూడా ప్రభావంతంగా పనిచేస్తాయి అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పేర్కొన్నారు.
This post was last modified on March 26, 2021 1:21 pm
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More