స్టీఫెన్ రవీంద్ర ఫైలు కదుపుతున్న సీఎం జగన్..! కారణం పెద్దదే..!!

Published by
Muraliak

ఏపీలో మళ్లీ స్టీఫెన్ రవీంద్ర పేరు వినిపిస్తోంది. సీఎం జగన్ అధికారం చేపట్టిన వెంటనే ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేయాలని భావించారు. అందుకు వైఎస్ సీఎంగా ఉన్నప్పటి నుంచీ నమ్మకస్థుడిగా ఉన్న స్టీఫెన్ రవీంద్రను ఏపీకి రప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నించారు. కానీ.. నిబంధనలు అడ్డు రావడంతో కుదరలేదు. స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ఐపీఎస్ అధికారి. ఆయన్ను డిప్యుటేషన్ పై ఏపీకి పంపేందుకు తెలంగాణ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చింది. పాలనలో ఏడాదిన్నర పూర్తి చేసుకున్న జగన్.. ఇప్పటివరకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

అమిత్ షాతో కూడా చర్చించారా..?

పాలనలో తనదైన ముద్ర వేస్తున్న సీఎం జగన్ కు ఈమధ్య ఇంటిపోరు ఎక్కువ అవుతోంది. ప్రతిపక్షాలు, దేవాలయాలపై దాడులు, రాష్ట్రంలోని పరిస్థితులు కాస్త ఇబ్బందిగా మారాయని అంటున్నారు. దీంతో ఇంటెలిజెన్స్ పటిష్టతపై దృష్టి సారించారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది నిలిచిపోయిన స్టీఫెన్ రవీంద్ర అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నట్టు సమాచారం. ఇదే విషయమై ఆమధ్య కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో సీఎం ప్రస్తావించారని అంటున్నారు. నిజానికి 20 ఏళ్లు పైబడ్డ సర్వీసు ఉన్న వారిని అంతర్రాష్ట్ర బదిలీ చేసేందుకు నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. ఈ కారణంగానే గత ఏడాది స్టీఫెన్ ను రప్పించాలనుకున్న కుదరలేదు. ఇప్పుడు ఆ నిబంధన సడలింపు కానీ.. వేరే దారి కోసం కానీ సీఎం జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

నాయకుల తీరు, ప్రజల నాడి తెలుసుకునేందుకేనా..

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అంతర్గత కలహాలు పార్టీకి ఇబ్బంది.. జగన్ కు తలనొప్పిగా మారుతున్నాయి. క్యాబినెట్ నిర్ణయాలు కూడా వ్యతిరేక మీడియాకు లీక్ అవుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై కొందరు నాయకులు బహిరంగంగా చేస్తున్న ప్రకటనలు కూడా జగన్ కు ఇబ్బంది చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగాన్ని పటిష్టం చేయాలంటే స్టీఫెన్ రవీంద్రపైనే జగన్ నమ్మకంగా ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు, ప్రజల్లో సంతృప్తి స్థాయి స్టీఫెన్ తో మరింత పకడ్బందీగా, నమ్మకంగా తెలుసుకోవచ్చని సీఎం భావిస్తున్నారట. జనవరిలో రచ్చబండ ప్రారంభం కానుంది. ఈలోపు గానీ.. ఆ వెంటనే కానీ స్టీఫెన్ రవీంద్రను రప్పించుకోవాలని జగన్ పట్టుదలగా ఉన్నట్టు సమాచారం.

This post was last modified on December 9, 2020 2:19 pm

Muraliak

Recent Posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More

May 9, 2024

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

Sai Pallavi: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More

May 9, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More

May 9, 2024

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More

May 9, 2024

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More

May 9, 2024

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More

May 9, 2024

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More

May 9, 2024

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More

May 9, 2024

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024