నగర పాలక సంస్థగా అమరావతి ప్రాంతం?

Published by
sharma somaraju

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

ఆమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతాంగం పెద్ద ఎత్తున అందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా వైసిపి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రాజధాని అమరావతి ప్రాంతాన్ని నగర పాలక సంస్థగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు లేకుండా పూర్తిగా మున్సిపల్ శాఖ పరిధిలోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా అమరావతి పరిధిలోని గ్రామాలకు ఎన్నికలు నిర్వహించవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది.

రాజధానిని విశాఖకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా ఆ ప్రాంత రైతులు నెల రోజులుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు, యువకులు ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. రైతుల ఆందోళనకు ప్రధాన ప్రతిపక్షం టిడిపితో సహా బిజెపి, జనసేన, వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి.

రాజధాని విశాఖ తరలించడం ఖాయమనీ, ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నారనీ ప్రచారం జరుగుతున్నది. అందుకు అనుగుణంగానే జిఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ గ్రూపు నివేదికలు ఉన్నాయి. ఈ నివేదికలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ కూడా అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణకు అనుకూలంగా నివేదకను సిద్ధం చేస్తున్నది. ఈ నెల 20న జరగనున్న కేబినెట్ భేటీలో హైపవర్ కమిటీ నివేదికపై చర్చించి ఆమోదించనున్నారు. అదే రోజు అసెంబ్లీలో ఈ కమిటీ నివేదికపై చర్చించి రాజధాని, తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతాంగాన్ని శాంతపరిచేందుకు అధికారపక్షం వివిధ మార్గాలపై దృష్టి పెట్టింది.

అందులో భాగంగా రాజధాని పరిధిలో భూములిచ్చిన రైతులకు ఎకరాకు అదనంగా మరో 200 గజాల స్థలం ఇవ్వడం, రాజధాని ప్రాంతాన్ని నగర పాలక సంస్థగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నిర్ణయాలతో రైతులను శాంతపర్చవచ్చని భావిస్తున్నది. రాజధాని తరలించినప్పటికీ ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్న అభిప్రాయాన్ని రైతుల్లో కల్గించాలని ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చింది.

అమరావతి ప్రాంతం రాజధానిగా అయిదేళ్లకుపైగా ఉన్నా ఇప్పటి వరకూ మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థగా గుర్తింపు రాలేదు. ఇంకా గ్రామాలుగానే కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ కూడా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుండి తాజాగా ఎన్నికల సంఘానికి ఎపి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది లేఖ రాశారు. రాజధానిపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజధాని గ్రామాలకు స్థానిక సంస్థల ఎన్నికల నుండి మినహాయించాలని కోరారు.

మరో పక్క రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పోరేషన్‌గా గుర్తించాలనీ, ఇతర మున్సిపాలిటీల్లో విలీనం చేయాలనీ ప్రతిపాదనలు పంపారు. ఎర్రబాలెం, బేతపూడి, నవులూరును మంగళగిరి పురపాలక సంఘంలో కలపాలనీ, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలో కలపాలనీ ప్రతిపాదించారు. మిగిలిన గ్రామాలన్నింటినీ కలిపి అమరావతి కార్పోరేషన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం నిర్ణయం కీలకం కానున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజధాని గ్రామాల రైతులు ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.

 

This post was last modified on January 17, 2020 1:33 pm

sharma somaraju

Recent Posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More

May 3, 2024

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More

May 3, 2024

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More

May 3, 2024

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

Madhuranagarilo May 3 2024 Episode 353:  రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More

May 3, 2024

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More

May 3, 2024

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More

May 3, 2024

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More

May 3, 2024

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు.… Read More

May 3, 2024

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు… Read More

May 3, 2024

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి డైమండ్ బజార్. నెట్ఫ్లిక్స్ లో బుధవారం అనగా… Read More

May 3, 2024

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Neethone Dance: బిగ్బాస్ రన్నర్ గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నట్టు అఖిల్. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్… Read More

May 3, 2024

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

Venkatesh-Roja: అత్యధిక చిత్రాల నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు రెండవ కుమారుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దగ్గుబాటి వెంకటేష్.. చాలా… Read More

May 3, 2024

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Ananya Agarwal: మజిలీ.. 2019లో విడుదలైన సూపర్ హిట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. యువ సామ్రాట్ అక్కినేని… Read More

May 3, 2024