హుజూర్‌నగర్ లో ఎవరి జెండా ఎగురుతుంది?

Published by
Mahesh

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో తెరపడనుంది. ఈ ఉపఎన్నికలో గెలుపును అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్ నగర్‌లో ఎలాగైనా ఈసారి గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది.  సిట్టింగ్ స్థానం కాబట్టి ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో ఈ సీటును ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే కనిపిస్తోంది.

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినప్పటి నుంచి అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి నెల రోజులుగా ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం సాగించాయి. తమ కంచుకోటను తిరిగి దక్కించుకుంటామని కాంగ్రెస్ చెబుతుంటే… ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని… నాలుగేళ్లలో చేసి చూపిస్తామని టీఆర్ఎస్ చెబుతోంది. కేటీఆర్ సహాలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే, సీఎం కేసీఆర్ కూడా భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. అయితే, వాతావరణం అనుకూలించక పోవడం, హుజూర్‌నగర్ లో భారీ వర్షం పడటంతో కేసీఆర్ సభ రద్దైంది. దీంతో తొలిసారిగా కేసీఆర్ ప్రచారం లేకుండానే ఈ ఉపఎన్నిక జరగనుంది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఏ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఇతర పార్టీల దగ్గరకు పొత్తుకోసం వెళ్ళింది లేదు. అసెంబ్లీ ఎన్నికల కోసం కానీ, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ గులాబీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. అన్నీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. అయితే, హుజూర్ నగర్ ఉపఎన్నికలో మాత్రం సీపీఐ మద్దుతు కోరింది. అయితే, సీపీఐ మొదట టీఆర్ఎస్ కి మద్దతు ప్రకటించినప్పటికీ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వెనక్కి తీసుకుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ స్థానం నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నల్గొండ ఎంపీగా ఎన్నిక కావడంతో హుజూర్‌నగర్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. బరిలో టీడీపీ, బీజేపీ కూడా ఉన్నప్పటికీ…. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే జరుగుతోంది. అక్టోబర్ 21న పోలింగ్, 24న ఫలితాలు ప్రకటిస్తారు. గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ తగు జాగ్రత్తలు తీసుకుంది. హుజూర్‌నగర్ లో తమ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆర్టీసీ కార్మికుల సమ్మె తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె జురుగుతున్న వేళ… దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందేమోనన్న ఆందోళన టీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. దీంతో హుజూర్‌నగర్ ఉపఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా? హుజూర్‌నగర్ లో కారు దూసుకెళ్తుందా? తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.

Mahesh

Recent Posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

YS Sharmila: వైఎస్ఆర్ ప్రజాదర్భార్ పెట్టి ప్రజల మధ్యే ఉండే వారు..జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్మెంట్ దొరకలేదు..వైఎస్ఆర్ పాలన..జగన్ పాలనకు… Read More

April 28, 2024

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

TDP: సీఎం వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడైన కోడి కత్తి శ్రీను టీడీపీలో చేరాడు. ముమ్మడివరంలో ఆదివారం… Read More

April 28, 2024

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Anand Devarakonda: రౌడీ హీరో అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్… Read More

April 28, 2024

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ సూపర్ హిట్గా నిలిచిన సినిమాలలో పోకిరి కూడా ఒకటి. 2006… Read More

April 28, 2024

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Main Released Movies In OTT: ఏప్రిల్ నెలలో అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చి సందడి చేశాయి. ముఖ్యంగా తెలుగు… Read More

April 28, 2024

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Samantha Movie Poster: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా… Read More

April 28, 2024

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో… Read More

April 28, 2024

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Lineman OTT: ప్రస్తుత కాలంలో ఓటీటీ సినిమాలన్నీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఫాన్స్ కి బిగ్ షాక్… Read More

April 28, 2024

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Agent OTT: కామన్ గా మంచి విజయాలు అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు… Read More

April 28, 2024

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

YSRCP: ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5… Read More

April 28, 2024

Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!

Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్… Read More

April 28, 2024

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర… Read More

April 28, 2024

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి… Read More

April 28, 2024

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.… Read More

April 28, 2024

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Vadinamma: కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న ముద్దుగుమ్మ మహేశ్వరి. ప్రస్తుత కాలంలో ఓ… Read More

April 28, 2024