Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్ కూడా ఒకరు. అందచందాలతో మరియు ఆట తీరుతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది గీతు రాయల్. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. అద్భుతమైన ఆటతీరు కనబర్షి అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ రివ్యూ వర్గా కెరియర్ ప్రారంభించిన ఈ బ్యూటీ సెలబ్రిటీగా మారిపోయింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. గత ఐదు నెలలుగా ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది గీత. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రివ్యూ వర్గ కెరీర్ ను స్టార్ట్ చేసి అనంతరం బిగ్ బాస్ లోకి వెళ్లి మంచి గుర్తింపును సంపాదించుకుంది. జబర్దస్త్ వంటి కార్యక్రమాలతో పాటు అనేక షోస్ లో కనిపించి సందడి చేసింది. అంతేకాకుండా బిగ్‌బాస్ సీజన్ 7 బిగ్‌బాస్ బజ్ షాకు యాంకర్ గా కూడా వ్యవహరించింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ముక్కు సూటిగా ప్రశ్నలు అడుగుతూ వారందరినీ ఓ ఆట ఆడుకుంది ఈ క్యూట్ బ్యూటీ. ముందు ఉన్నది ఎవరు అనేది చూడకుండా తాను అడగాలనుకున్న ప్రశ్నలన్ని అడిగేసేసేది. ఇక ప్రస్తుతం యాంకర్ ధనుష్‌తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పలు విషయాలపై మాట్లాడుతుంది గీతు. అయితే చాలా రోజుల క్రితం ఈ ఛానల్ లో ఓ వీడియో పోస్ట్ చేయగా .. ఈమధ్య అసలు కనిపించడం లేదు. అయితే తాజాగా ధనుష్ ఓ వీడియో పోస్ట్ చేశాడు.
అందులో కీతూ ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పాడు. ముఖ్యంగా ఆమె ప్రస్తుతం డిప్రెషన్ లో ఉందని వెల్లడించాడు. అలాగే ఐదు ఆరు నెలలుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న ఈమె ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని వివరించారు. అంతేకాకుండా నేరుగా ఆమె వరకు వెళ్లి వీడియోని తీసాడు ధనుష్. ఈ క్రమంలోనే గీతూ మాట్లాడుతూ..” నేను బ్యాంకాక్ వెళ్లి అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నాను. అక్కడ అనేక రకాల పదార్థాలను ట్రై చేశాను. ముఖ్యంగా చనిపోయే లోపు అన్ని చూడాలి. ఎంజాయ్ చేయాలని ఉద్దేశం లోనే అలా చేశాను. దానివల్లే నాకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఇది మాత్రమే కాకుండా నేను విజయవాడకు అమ్మవారి దర్శనం కోసం వెళ్లాను కానీ దర్శించుకోలేదు. అదేవిధంగా తిరుచానూరు కు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేసాను.
కేవలం నా వల్లే నాతో వచ్చిన వాళ్లు కూడా అమ్మవారును దర్శించుకోలేకపోయారు. అందువల్ల కూడా నాకు ఇలా ఆరోగ్య సమస్యలు వచ్చాయేమో. కోటి మందిలో ఒకరికి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నాకు వచ్చింది. చిన్న చిన్న ఆసుపత్రులు చుట్టూ తిరిగితే దాని గురించి తేలింది. ఇంతకాలంగా ఈ సమస్యతో ఇబ్బంది పడగా.. తాజాగా ఓ పెద్ద ఆసుపత్రికి వచ్చాను. ఈ ఇన్ఫెక్షన్ బయట పడింది. అలాగే దానికి రెండేళ్లు పాటు కంటిన్యూగా ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు. అందువల్లే నేను పెద్దగా వీడియోస్ చేయలేకపోతున్నా ” అంటూ చెప్పుకొచ్చింది గీతు రాయల్. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!