కశ్మీర్ ఊహాగానాల మధ్య క్యాబినెట్ సమావేశం!

Published by
Siva Prasad

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయవర్గాలలో ఊహాగానాలు మొదలయ్యాయి. జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ఏదో ఒకటి చేయబోతున్నదన్న పుకార్ల మధ్య ఈ క్యాబినెట్ మీటింగ్ వార్త వెలువడింది. దానితో ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు ప్రారంభమ్యయాయి.

కొద్ది రోజులుగా జమ్ము కశ్మీర్‌లో కేంద్రం భద్రతాబలగాల మోహరింపు ఎక్కువ చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 35 వేల మంది వరకూ కేంద్ర బలగాల జవాన్లు ఉన్నారు. రెండు రోజుల క్రితం టెరరిస్టుల ముప్పు పొంచిఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు చెప్పాయంటూ అమరనాధ్ యాత్రను అర్ధంతరంగా నిలిపివేసి యాత్రికులను వెనక్కువెళ్లాలిసిందిగా ఆదేశించారు. దీనితో కశ్మీర్ లోయలో పుకార్లు రాజ్యం ఏలడం ప్రారంభమయింది. తనను కలిసిన రాజకీయ పార్టీల ప్రతినిధిబృందాలతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఈ రోజుకు ఏమీ లేదని చెప్పారు తప్ప  పుకార్లను ఖరాఖండీగా కొట్టివేయలేదు.

మరో పక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, రా చీఫ్ సామంత్ గోయల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాలతో సమావేశమయ్యారు.

జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370,  కశ్మీర్‌లో శాశ్వత నివాసులకు ప్రత్యేకహక్కులు కల్పిస్తున్న రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా రాజ్యాంగంలో చేరిన ఆర్టికల్ 35ఎ రద్దు దిశగా మోదీ ప్రభుత్వం పయనిస్తున్నదా అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. ఈ రెండిటినీ బిజెపి బహిరంగంగా వ్యతిరేకిస్తున్నది. ఆర్టికల్ 35ఎ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ ఇటీవల సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలయింది. కోర్టు దానిపై ఈ నెలలోనే విచారణ చేపట్టే అవకాశం ఉంది.

రాజకీయ వర్గాలలో వినబడుతున్న మరో మాట జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడం. బిజెపి ప్రభుత్వం రాష్ట్రాన్ని విడదీసి జమ్ము, లద్దాఖ్, కశ్మీర్ రాష్ట్రాలుగా ఏర్పాటు చేయనున్నదనే మాట కూడా వినబడుతున్నది. అధికార వర్గాల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఊహాగానాలు మరింత విజృంభిస్తున్నాయి. జమ్ము కశ్మీర్‌కు సంబంధించి కేంద్రం ఏదో చేయబోతున్నదన్న మాట మాత్రం బలంగా వినబడుతోంది. అలాంటి తరుణంలో కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుండడం సహజంగానే రకరకాల ఊహాగానాలకు ఆస్కారం ఇస్తోంది.

This post was last modified on August 4, 2019 3:51 pm

Siva Prasad

Recent Posts

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More

May 9, 2024

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More

May 9, 2024

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More

May 9, 2024

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More

May 9, 2024

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More

May 9, 2024

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024