ఒక్కో కరోనా బాధితుడికి ఖర్చు ఎంతో తెలుసా…!

Published by
Srinivas Manem

కరోనతో అల్లాడుతున్నాం. రాష్ట్రం, దేశంలో ఆదాయం దెబ్బతింది. ఆర్ధిక లావాదేవీలు నిలిచిపోయాయి. ఆకలి పెరిగింది. లాక్ డౌన్ వలన జీవనం స్తంభించింది…! ఇన్నాళ్లు ఇవి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం… కానీ కరోనా కోసం బాధితులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా… ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ దీని కోసం, ఒక బాధితుడి కోసం ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేస్తున్నాయో తెలుసా…? అక్షరాలా రూ. మూడున్నర లక్షలు. అవును ఒక కరోనా సోకినా వ్యక్తికి రూ. మూడున్నర లక్షల ఖర్చుతో నయం చేసి ఇళ్లకు పంపిస్తున్నాయి మన ప్రభుత్వాలు. ఆ లెక్క ఏమిటో చూడండి…!

దశల వారీగా ఇలా…!

ఒక్కో క‌రోనా బాధితుడు ఆస్ప‌త్రిలో చేరిన మొద‌లుకుని కోలుకుని ఇంటికి చేరే వ‌ర‌కు మొత్తం ఖర్చు సర్కారుదే. క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్టడి చేసేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. రోగుల‌ను ఆరోగ్యంగా తిరిగి ఇళ్ల‌కు పంప‌డానికి ఖ‌ర్చుకు ఏ మాత్రం వెనుకాడ‌టం లేదు. ఎందుకంటే ఇది ప్రాణాంతక వైరస్. నిర్లక్ష్యం చేస్తే వందలాది మందికి సోకుతుంది. నిర్ధారణ పరీక్ష మొదలు కోలుకొని డిశ్చార్జి అయ్యేవరకు ఒక్కో వ్యక్తికి రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతున్నట్టు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏఏ ప‌రీక్ష‌కు ఎంతెంత ఖ‌ర్చు అవుతుందో కూడా వైద్య నిపుణులు వివ‌రిస్తున్నారు. ఒక కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.4,500 అవుతుంద‌ని తేల్చారు.  పాజిటివ్‌ కేసులకు చికిత్స అనంతరం మరో రెండుసార్లు నిర్ధారణ పరీక్షలు చేస్తారన్నారు. ఇలా ఒక్కొక్కరికీ రూ.13,500 చొప్పున కేవ‌లం నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌కే అవుతుంద‌ని వెల్ల‌డించారు. అనుమానితులను అంబులెన్స్‌లోనే ఆస్ప‌త్రికి తీసుకొచ్చి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అనంత‌రం డిశ్చార్జి చేసిన వ్య‌క్తిని   ప్రభుత్వమే వాహనం ఏర్పాటు చేసి ఇంటికి పంపుతుంది. అంటే ఒక్కో రోగి రవాణా ఖర్చు రూ.4 వేలకు పైమాటే. పాజిటివ్‌ వ్యక్తులకు కోలుకొనే వరకు కనీసం 80 వరకు పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లు ఉపయోగిస్తారు. ఈ కిట్లను ఒక్కసారి వాడితే తిరిగి వినియోగించే అవకాశం లేదు.

కిట్లుకే తడిసిమోపెడు…!

ఒక్కో కిట్‌ ధర రూ.2,500 వరకు ఉంటుంది. ఒక్కో వ్యక్తికి పీపీఈ కిట్ల కోసం రూ.2 లక్షలు ఖర్చు వ‌స్తుంది. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న వారి విష‌యంలో ఈ ఖ‌ర్చు మ‌రింత పెరుగుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ల‌కు ఎక్కువ మొత్తంలో పీపీఈ కిట్లు మార్చాల్సి ఉంటుంది. అలాగే కొవిడ్‌ సోకినవారిలో రోగనిరోధకశక్తి పెంచేందుకు, వారికి యాంటీ బయాటిక్‌, యాంటీ వైరల్‌ మందులు, ఫ్లూయిడ్స్‌, ఇతర మందులు అందించేందుకు రూ.50 వేలు అవుతున్నదని అంచనా.

ఆహారానికి అదనం…!

ఉదాహ‌ర‌ణ‌కు గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నవారి విష‌యానికి వ‌స్తే… ప్రత్యేక మెనూతో  పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. బాధితుల్లో రోగనిరోధకశక్తిని పెంచేలా ప్రతిరోజు ఉదయం అల్పాహారం, రెండుసార్లు భోజనం, డ్రైఫ్రూట్స్‌, పాలు, బ్రెడ్‌, నాలుగు వాటర్‌ బాటిళ్లు అందజేస్తున్నారు. ఇందుక‌య్యే ఖ‌ర్చు రూ.55 వేలు. ఇంత‌టితో అయిపోలేదు. రోగుల‌కు అవ‌స‌ర‌మైన స‌బ్బులు, శానిటైజ‌ర్‌,  ప్రత్యేక డ్రెస్‌ వంటివి ఇస్తారు. వీటి కోసం రూ.27 వేలు ఖర్చొస్తోంది. సాధారణంగా 14 రోజుల్లో క‌రోనా రోగి కోలుకొని డిశ్చార్జి అవుతారు. ఒక‌వేళ‌ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం 21 రోజుల వరకు చికిత్స పొందుతున్నారు.  క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుని తిరిగి మామూలు మ‌నిషి కావాలంటే ఇంత పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది.

 

This post was last modified on May 4, 2020 4:11 pm

Srinivas Manem

Share
Published by
Srinivas Manem

Recent Posts

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

Mamagaru: గంగ అనుకుని ఫోన్ ఎత్తుతాడు గంగాధర్. సార్ ఇక్కడ వైన్స్ నుంచి ఫోన్ చేస్తున్నా మీరు ఎలక్ట్రిక్ పనిచేస్తారు… Read More

May 4, 2024

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

Brahmamudi: స్వప్న తన డాక్యుమెంట్స్ ఎవరు కాజేశారో తెలుసుకోవాలని వాళ్ళ అమ్మతో కలిసి మంచి ప్లాన్ చేస్తుంది. కనకం అమ్మోరు… Read More

May 4, 2024

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

Naga Panchami: మోక్ష తన తల్లి వైదేహి పంచమిని ప్రేమగా చూసుకుంటున్నట్లుగా కలగంటాడు ఇదంతా నిజంగా జరిగితే ఎంత బాగుంటుందో… Read More

May 4, 2024

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

Nuvvu Nenu Prema: కృష్ణ భారీ నుండి అరవిందను కాపాడి ఇంటికి తీసుకువస్తారు రాజ్ విక్కీ ఇద్దరు. అప్పుడే ఇంట్లో… Read More

May 4, 2024

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

Krishna Mukunda Murari: కృష్ణ ప్రెగ్నెంట్ అనుకొని, భవానీ దేవి కృష్ణ కి చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది నేను… Read More

May 4, 2024

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More

May 3, 2024

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More

May 3, 2024

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More

May 3, 2024

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

Madhuranagarilo May 3 2024 Episode 353:  రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More

May 3, 2024

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More

May 3, 2024

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More

May 3, 2024

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More

May 3, 2024