సీఎం జగన్ చేతికి రాజధాని తుది నివేదిక!

Published by
Mahesh

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్ రావు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్ ని కలిసి నివేదికను సమర్పించారు. రిపోర్టులోని ముఖ్యమైన అంశాలను సీఎం జగన్‌కు వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కమిటీ పర్యటించింది. ప్రజలు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈనెల 27న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. అదే రోజు కేబినెట్‌లో ఆమోదించిన తర్వాత ఈ నివేదికలోని అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయనుందని సమాచారం.

రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్ రావు అధ్యక్షతన నిపుణుల కమిటీని జగన్ సర్కారు సెప్టెంబర్ 13న ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అక్టోబర్ మూడో వారం నుంచి పని ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడంతోపాటు మెయిల్ ద్వారా కూడా అభిప్రాయాలను సేకరించింది. జీఎన్ రావు కమిటీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రజాసంఘాలు, మేధావులు, సామాన్య ప్రజలతో చర్చించింది.

నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో ప్రకటించారు. ఈ కమిటీ పూర్తి నివేదిక ఇవ్వకముందే మూడు రాజధానులు ఉండొచ్చంటూ అసెంబ్లీలో జగన్ సంకేతాలు ఇచ్చారు. తాజాగా జీఎన్ రావు కమిటీ పూర్తిస్థాయి నివేదికను సీఎంకు సమర్పించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలో ఈ కమిటీ నివేదికలో పేర్కొంది. జీఎన్ రావు నేతృత్వంలోని ఈ కమిటీలో డాక్టర్ కేటీ రవీంద్రన్, డా.మహవీర్, డా. అంజలికరోల్ మోహన్, డా. ఏవీ సుబ్బారావు, కేబీ అరుణాచలం, విజయమోహన్ సభ్యులుగా ఉన్నారు.

ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చు అంటూ సీఎం జగన్ చేసిన రాజధాని ప్రాంత రైతులను ఆగ్రహానికి గురిచేసిన సంగతి తెలిసిందే. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులంతా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జగన్ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ నివేదికలో ఏం ఉందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.జగన్ చెప్పినట్టే మూడు రాజధానుల ఏర్పాటునే కమిటీ కూడా ప్రతిపాదించిందా..? లేక అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పిందా..? అన్నది వేచి చూడాలి.

 

This post was last modified on December 20, 2019 5:12 pm

Mahesh

Recent Posts

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

Aparichithudu: గత కొంతకాలం నుంచి తెలుగు తమిళ భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో… Read More

May 12, 2024

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి… Read More

May 12, 2024

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక సోమవారం రోజున ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో చివరి రోజు అయిన… Read More

May 12, 2024

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెగా కుటుంబంలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో... అందరు… Read More

May 12, 2024

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాజకీయ నాయకులందరూ ఇండ్లల్లోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్… Read More

May 12, 2024

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయ‌న‌ను ఓడించాల‌నే వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే.… Read More

May 12, 2024

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More

May 12, 2024

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More

May 11, 2024

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More

May 11, 2024

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More

May 11, 2024

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024