‘రెండో దశ పోలింగ్ ముగిసింది’

Published by
sarath

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండవ దశ పోలింగ్ గురువారం చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.  కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు జరిగాయి.

రెండవ దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్‌ జరిగింది. ఉదయం ఏడు గంటల నుండిసాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ కొనసాగించారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో గంట ముందుగా నిలుపుదల చేశారు.

కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎనిమిది, అసోం, బిహార్‌, ఒడిశాల్లో ఐదు సీట్ల చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌లలో మూడు సీట్ల చొప్పున, జమ్మూకశ్మీర్‌లో రెండు సీట్లు, మణిపూర్‌, పుదుచ్చేరిల్లో ఒక్కో సీటుకు పోలింగ్‌ జరిగింది.

బెంగాల్‌లో ఉద్రిక్తత:

ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌ నియోజకవర్గ పరిధిలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. దినాజ్‌పూర్‌ జిల్లా చోప్రాలోని డిగిర్‌పూర్ పోలింగ్ స్టేషన్‌లో తమని ఓటు వేయకుండా అడ్డుకున్నారనీ,తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు పోలింగ్‌ బూత్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారనీ స్థానికులు ఆరోపించారు. 34 వ నంబరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.పోలీసులు ఆందోళన కారును వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవటంతో లాఠీ చార్జ్ చేశారు. దీంతో కొందరు పాలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు.

ఇదే రాయ్‌గంజ్ నియోజకవర్గంలో 112 బూత్ వద్ద తృణమూల్ కాంగ్రెస్, బిజెపి వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఈవిఎంలు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే ఇదే నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి మహ్మద్‌ సలీమ్‌ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు.

ఛత్తీస్‌ఘడ్, ఒడిశాలో మావోయిస్టుల ప్రభావం:

ఛత్తీస్‌ఘడ్ లో మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో దౌలికర్క అడవుల్లో మావోయిస్టులు తిరుగుతున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో అటు మావోయిస్టులు ఇటు పోలీసులకు మధ్య దంతెవాడ ప్రాంతంలో హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి.  ఒక మావోయిస్టు కమాండర్, మరో మావోయిస్టు ఈ కాల్పుల్లో మృతి చెందారు. మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు.

ఒడిశాలో కూడా మావోలు ఎన్నికలను బహిష్కరించారు. అయితే ఎన్నికలను అడ్డుకునేందుకు మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. కంధమాల్ అడవి ప్రాంతంలో పోలింగ్ సిబ్బంది లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఆ దాడిలో పోలింగ్ ఏజెంట్ సంజుక్తా దిగల్ చనిపోయారు. కొంతమందికి గాయాలయ్యాయి.

మండ్యలో ఘర్షణలు:

కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జెడిఎస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల గౌడ మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థి, అంబరీశ్ సతీమణి సుమలత మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది.

తమిళనాడులో ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్నిక వాయిదా:

తమిళనాడు కడలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్ కేంద్రంలోని ఈవిఎంలో ఎఎంఎంకె (టిటివి దినకరన్ పార్టీ) అభ్యర్థి కాశీ తంగవేల్ పేరు, గుర్తు పక్కన బటన్ లేదు. దీంతో ఓటు వేయడానికి వెళ్లిన వారు దాన్ని గుర్తించి ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అధికారులు పోలింగ్‌ను వాయిదా వేశారు.

This post was last modified on April 18, 2019 6:19 pm

sarath

Share
Published by
sarath

Recent Posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More

May 10, 2024

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More

May 10, 2024

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More

May 10, 2024

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

ఏపీలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ ఆవేశంగా ప్ర‌సంగాలు దంచి కొట్టారు. త‌మ‌ది కాని ప్ర‌భుత్వం.. ఎక్క‌డ ఉన్నా .. ఆయ‌న‌కు, బీజేపీ… Read More

May 10, 2024

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

ఎవ‌రైనా వ్య‌క్తిని అడాప్ట్ చేసుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హ‌ద్దులు.. ప‌ద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More

May 10, 2024

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More

May 10, 2024

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More

May 10, 2024

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 10, 2024

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024