కోబ్ చనిపోతాడని అతనికి ఎలా తెలుసు?

Published by
Mahesh

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

రెండు దశాబ్దాల పాటు క్రీడాలోకాన్ని తన అసమాన ప్రతిభతో కట్టిపడేసిన బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్‌ బ్రయంట్‌ ఇక లేడనే వార్త యావత్‌ ప్రపంచాన్ని కలిచివేసింది. అయితే, కోబ్‌ బ్రయంట్‌ మరణవార్తను ఓ నెటిజన్‌ 2012లోనే ఊహించాడు. ఎనిమిదేళ్ల క్రితమే ఇందుకు సంబంధించిన ఓ పాత ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నోసో అనే పేరుతో ఓ ట్విటర్‌ యూజర్‌.. బాస్కెట్‌బాల్‌ దిగ్గజం హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణిస్తాడని 2012 నవంబర్‌ 14న ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన అతడి ఫాలోవర్లు అప్పట్లో నోసోపై మండిపడ్డారు. అయితే ఇపుడు అది నిజం కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఆ నాటి తన ట్వీట్ కు సోమవారం ఆ నెటిజన్‌ ఏడేళ్ల నాటి తన ట్వీట్‌కు క్షమాపణలు చెప్పాడు. ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు అని చెప్పడం, హెలికాప్టర్ ప్రమాదం అని కూడా చెప్పడంతో అంతా షాక్ గురవుతున్నారు. అయితే, మరి కొందరు ఇదంతా తప్పుడు వ్యవహారం అని కొట్టిపారేస్తున్నారు. ట్వీట్ లో తేదీ మార్చి ఇలా ప్రచారం చేస్తున్నారని మరికొందరు అంటున్నారు.

బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్‌ బీన్‌ బ్రయంట్‌ (41) హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందాడు. కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన ఈ ఘటనలో కోబ్‌, అతడి పదమూడేళ్ల కుమార్తె గియానా సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల 47 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. వాతావరణం అనుకూలించకపోవడంతో కోబ్‌ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ లాస్‌ఏంజెల్స్‌ పశ్చిమ దిశలోని కాలబసాస్‌ ప్రాంతంలో ఓ కొండను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుపోయింది. దీంతో అందులో ఉన్న తొమ్మిది మంది అగ్నికి ఆహుతయ్యారు.

తన 20 ఏళ్ల అద్వితీయ కెరీర్‌కు 2016లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు కోబ్. అమెరికా జాతీయ జట్టు తరఫున రెండు ఒలింపిక్స్‌ స్వర్ణాలు (2008, 2012) సాధించారు. ఐదు సార్లు ఎన్‌బీఏ చాంపియన్‌, రెండుసార్లు ఎన్‌బీఏ ఫైనల్స్‌ అత్యుత్తమ ప్లేయర్‌ అవార్డు, నాలుగు సార్లు ఆల్‌స్టార్‌ మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌, ఎన్‌బీఏ స్కోరింగ్‌ చాంపియన్‌.. ఇలా ఎన్నో ఘనతలను తన పేరిట రాసుకున్నాడు. కోబ్‌ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లీ దాక ప్రపంచంలోని అన్ని దేశాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బ్ర‌యంట్ మృతి ప‌ట్ల నివాళులు వెల్లువెత్తుతున్నాయి. బ్రయంట్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆశిస్తూ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వార్త విని క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కేవలం బాస్కెట్ బాల్ అభిమానులే కాకుండా క్రీడాకారులు, సెలబ్రెటీలు బ్రయింట్ కు నివాళులు అర్పిస్తున్నారు.

This post was last modified on January 28, 2020 12:17 pm

Mahesh

Share
Published by
Mahesh
Tags: 2012 tweet had predicted Bryant's death2012 tweet on NBA legend’s death in helicopter crash8 others die in helicopter crashap latest newsap newsap politicsbasketball icon Kobe BryantBryant died in helicopter crashCalabasasgianna bryantKobe Bryantkobe bryant daughter deadKobe Bryant daughter Gianna die in helicopter crashKobe Bryant dead in helicopter crashkobe bryant dead news updatesKobe Bryant death on social mediaKobe Bryant death tweet viral news updatesKobe Bryant diedKobe Bryant died daughter GiannaKobe Bryant died helicopter crashKobe Bryant familyKobe Bryant helicopter accidentkobe bryant helicopter crash videokobe bryant latest news updateskobe bryant newskobe bryant passes awayKobe Bryant's daughter deadKobe Bryant's death in Californialatest ap politicslatest Kobe Bryant death tweet viral updateslatest kobe bryant killed in helicopter crashlatest newslatest news todaylatest news updates todaylatest politicslatest politics newslatest telugu newslatest telugu news updateslatest viral news Kobe Bryant death tweetLos AngelesNBANBA champion Kobe BryantNBA icon Kobe BryantNBA legendNBA legend Kobe Bryantnews orbitnews orbit teluguNTSB details the final moments of the helicopter before it crashedonline latest newsonline newsonline telugu newsplane crashpolitical newspolitics latest newsPolitics newsTelangana Newstelugu newstelugu news channelstelugu news latest updatestelugu news onlinetelugu online newstelugu varthalutoday news updatestop telugu newstweet from 2012Twitter users shockedviral Kobe Bryant death tweetviral Kobe Bryant related tweet

Recent Posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More

May 9, 2024

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

Sai Pallavi: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More

May 9, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More

May 9, 2024

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More

May 9, 2024

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More

May 9, 2024

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More

May 9, 2024

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More

May 9, 2024

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More

May 9, 2024

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024