చంద్రబాబు – జగన్ కు మధ్య తేడా ఇదీ .. ఇందుకు ‘దటీజ్ జగన్’ అనాల్సిందే(గా)..!

Published by
sharma somaraju

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు చంద్రబాబు చేయలేని పనిని ఆయన అనుభవం అంత లేని వయసు నాయకుడు జగన్ చేసి చూపించారు. ఇది ఆయన తెగింపునకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ బాబు, మద్దాలి గిరిధర్ రావు  వైసీపీకి జై కొట్టారు. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా వారిపై పార్టీ పరంగా సస్పెన్షన్ వేటు వేయలేదు చంద్రబాబు. దీంతో వారు అసెంబ్లీలో అధికారికంగా టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. వారి నియోజకవర్గాల్లో వైసీపీ సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారు. అయితే వీరిని చంద్రబాబు పార్టీ నుండి సస్పెండ్ చేయలేకపోయారు. అంటే దానికి ఒక కారణం ఉంది.

Chandrababu ys jagan

ప్రతిపక్ష హోదా పోతుందని

ఆ నలుగురిని పార్టీ నుండి చంద్రబాబు సస్పెండ్ చేస్తే వారు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. అధికారికంగా వైసీపీలో చేరే అవకాశం ఏర్పడుతుంది. వారు స్వతంత్ర సభ్యులు అయితే అసెంబ్లీలో టీడీపీ బలం 23 నుండి 19కి పడిపోతుంది. పర్వవసానంగా చంద్రబాబుకు ఉన్న ప్రతిపక్ష నాయకుడి హోదా పోతుంది. దీనికి భయపడే చంద్రబాబు ఆ స్టెప్ తీసుకోలేదని అంటారు. ఇదే విషయాన్ని ఇటీవల వల్లభనేని వంశీ కూడా తెలిపారు. తమను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆయన (చంద్రబాబు) కు ప్రతిపక్ష నాయకుడి హోదా పోతుందని అందుకే సస్పెండ్ చేయడం లేదని అన్నారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని జగన్మోహనరెడ్డి .. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి నిర్మోహమాటంగా ఎటువంటి వివరణ అడగకుండానే సస్పెండ్ చేసేశారు. ఇది నిజంగా డేరింగ్ స్టెప్ అనాల్సిందే. ఎందుకంటే..

mlc elections cross vote ysrcp announced four mlas suspension

ముగ్గురు ఒకే సామాజికవర్గం నేతలు

వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు తన సామాజికవర్గానికే చెందిన వారు కావడంతో పాటు సీనియర్ నేతలు. ఒకరు మాత్రమే జూనియర్ ఎమ్మెల్యే. పార్టీ కట్టుదాటితే ఎంతటి సీనియర్ లు అయినా, బ్లంట్ ఫాలోవర్స్ అయినా ఉపేక్షించేది లేదు అన్న సంకేతం ఇచ్చారు సీఎం జగన్. ప్రస్తుతం పార్టీ బహిష్కరణకు గురైన వారిలో అనం రామనారాయణరెడ్డి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్ హయంలో వివిధ శాఖల మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వీరు నెల్లూరు జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాల్లో పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా క్యాడర్ ఉన్న నాయకులు. వీరి తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయులు. ఆ కారణంగా జగన్మోహనరెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు మద్దుతుగా మేకపాటి చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2012 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా పని చేశారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి 20వేల పైచిలుకు మెజార్టీతోనే విజయం సాధించారు. ఈ ముగ్గురితో పాటు తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఉండవల్లి శ్రీదేవి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఈ చర్యలతో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎటువంటి మొహమాటాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న సంకేతం ఇచ్చినట్లు అయ్యింది. చంద్రబాబుకు, జగన్ కు మధ్య తేడా ఇదీ. నలుగురు ఎమ్మెల్యేలు కట్టుదాటినా పార్టీ పరంగా చంద్రబాబు చర్యలు అయితే తీసుకోలేదు కానీ జగన్మోహనరెడ్డి మాత్రం నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేశారు. అందుకే ఈ విషయంలో ‘దటీజ్ జగన్’ అనాల్సిందేగా..!

MLA Sridevi: ‘జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యింది’

This post was last modified on March 27, 2023 12:26 am

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

Amit Shah: ఏపీ రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టులపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి… Read More

May 5, 2024

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Escape Room 2 Review: సైకలాజికల్ అండ్ సర్వైవల్, మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ లోకి… Read More

May 5, 2024

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Aa Okkati Adakku Box Office Collections: అలానే నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్రం అంచనాలను… Read More

May 5, 2024

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు పడింది. డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని… Read More

May 5, 2024

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Romeo OTT:  రోమియో సినిమా రిలీజ్ కి ముందు మంచి ఏర్పడిన సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. ట్రైలర్ ఎంటర్టైనర్… Read More

May 5, 2024

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు గెలుపు కోసం.. వ్య‌య ప్ర‌యాస‌లకు ఓర్చుతున్నారు. రోజంగా ఎండ‌ను సైతం లెక్క‌చేయ‌కుండా తిరుగుతూనే ఉన్నారు. ప్ర‌జ‌ల‌కు… Read More

May 5, 2024

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఎటు వైపు నిలుస్తారు? ఎలాంటి తీర్పు ఇస్తారు? ఏ పార్టీకి.. ఏ నేత‌కు జై కొడ‌తారు? అంటే… Read More

May 5, 2024

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 64 సీట్లు సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని… Read More

May 5, 2024

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్… Read More

May 5, 2024

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో అధికారం… Read More

May 5, 2024

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Heeramandi OTT: బాలీవుడ్ దగ్గర దర్శకుడు సంజయ్ లీల భన్సాలి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా… Read More

May 5, 2024

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Aha OTT: ఇండియా వ్యాప్తంగా ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్ఫారం అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల… Read More

May 5, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Geethanjali Malli Vachindi OTT: హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ భారీ అంచనాలతో… Read More

May 5, 2024

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

Chandrababu: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు నమోదు చేసింది.… Read More

May 5, 2024