Geethanjali Malli Vachindi OTT: హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 2014లో వచ్చిన గీతాంజలి సూపర్ హిట్ అవడంతో పదేళ్ల తర్వాత సీక్వెల్ రూపొందించారు మేకర్స్. హీరోయిన్ అంజలి ప్రధాన పాత్ర పోషించిన గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈ మూవీకు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ మాత్రం రా బట్ట లేక పోయింది. ఇక ఇప్పుడు గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఓటిటిలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది.
మే 10వ తేదీన ఈ సినిమా ప్రాయం వీడియో ఓటిటిలో స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తుంది. దీంతో థియేటర్లలో రిలీజ్ అయిన నెలలో పే మే 10న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో రావడం దాదాపు ఖరారు అయింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీకి శివ తోర్లపాటి దర్శకత్వం వహించారు. భాను భోగవరపు, కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను శివ దొరక ఎక్కించారు. అంజలితో పాటు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య, సునీల్, ఆలీ, రవిశంకర్ కీలక పాత్రలు పోషించారు.
ఇక గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా గీతాంజలి కి 50వ మూవీ కావడం కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమా కోసం టీం బాగా ప్రమోషన్స్ని చేపట్టింది. టీజర్ అండ్ ట్రైలర్ ఆకట్టుకోవడంతో మంచి హైప్స్ ఏర్పడ్డాయి కూడా. అయితే ఈ చిత్రానికి మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. కామెడీ పండిన స్టోరీలో కొత్తదనం లేకపోవడం వలన అభిమానులు దీనిని ఇష్టపడలేదు. దీంతో కలెక్షన్స్ పరంగా కూడా నిరాశపరిచింది. ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా సుజిత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించారు.
సినిమా షూటింగ్ కోసం ఓ మహల్ లోకి అడుగుపెట్టిన వారికి ఎదురయ్యే పరిస్థితులు చుట్టూ గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ రూపొందింది. దర్శకుడిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీను అలియాస్ శ్రీనివాస రెడ్డి తన స్నేహితుడు అయాన్ (సత్య) తో కలిసి మూవీ తీసేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే అవంతరాలు ఎదురవుతున్నాయి. ఆ తరుణంలో విష్ణు (రాహుల్) ఈ చిత్రానికి నిర్మాతగా ఉంటానని కాల్ చేశాడు. అతనకు సంగీత్ మహల్ ఉందని ఈ మూవీ షూటింగ్ ఆ మహల్లోనే చేయాలని విష్ణు పట్టు బట్టాడు. ఈ మూవీకి అంజలి నీ హీరోయిన్ గా తీసుకుంటారు. సంగీత్ మహల్ లోనే షూటింగ్ చేస్తారు. ఆ మహల్లో శ్రీను, అయా న్ మరియు అంజలికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో ఈ మూవీలో స్పష్టంగా చూపించారు.