Visakha : గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల వేళ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. టీడీపీ నుండి నేతలు, కార్యకర్తలను వైసీపీ ఆహ్వానిస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు, టీడీపీ నేత కాశీ విశ్వనాధం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు విజయసాయిరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాశీ విశ్వనాధంతో పాటు మరి కొందరు కూడా వైసీపీలో చేరారు.
గంటా అనుచరుడు కాశీ విశ్వనాధం వైసీపీలో చేరికపై జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్ అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినా విజయసాయిరెడ్డి కాశీ విశ్వనాధంను పార్టీలో చేర్చుకోవడంపై మంత్రి అవంతి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయన అలకబూనడం వల్లనే ఈ చేరిక కార్యక్రమానికి గైర్హజరు అయ్యారని వార్తలు వస్తున్నాయి. గతంలో గంటాతో అవంతి శ్రీనివాస్ తో సన్నిహిత సంబంధాలు గత కొంత కాలంగా ఇద్దరి మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. గంటా వైసీపీ చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందుకే గంటా వైసీపీలో చేరికపై చాలా కాలంగా వార్తలు వచ్చినా ఆయన పార్టీలో చేరడం సాధ్యపడలేదు. నేడు గంటా ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాధం చేరికను అవంతి తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అవంతి అలిగి ఈ కార్యక్రమానికి హజరుకాకపోవడం విశాఖలో హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల చాలా మంది ఆకర్షితులు అవుతున్నారనీ, టీడీపీ నుండి ఇంకా వలసలు ఉంటాయని విజయసాయిరెడ్డి అన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీ పట్ల ఆకర్షితులు అవుతున్నారనీ, ఇంతకు ముందు పార్టీలో చేరికపై తను కొన్ని ప్రతిపాదనలు పంపారని విజయసాయిరెడ్డి అన్నారు. దానిపై ఎమ్మెల్యే ముందుకు వస్తే పార్టీ అధినేత జగన్ ఆమోదిస్తే తప్పకుండా పార్టీలో చేర్చుకుంటామన్నారు. విశాఖ మేయర్ అభ్యర్థి ఎవరు అనే దానిపై మాట్లాడుతూ ఎన్నికల అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్ వెల్లడిస్తారని విజయసాయిరెడ్డి తెలిపారు.
తన చేరికను మంత్రి అవంతి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదని కాశీ విశ్వనాధం అన్నారు. తనకు అవంతితో వ్యక్తిగత విబేధాలు ఏమీ లేవన్నారు. తాను మంత్రిని కలిసి ఆశీస్సులు తీసుకుంటాానని పేర్కొన్నారు. పార్టీలో కలిసి పని చేస్తానన్నారు.
This post was last modified on March 3, 2021 2:03 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More