రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో హీరో ఎవరు… విలన్ ఎవరు… ఇదే ప్రశ్న ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ నుంచి సినీ నటుడు, సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుండగా… టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. దీంతో గెలిచిన వారు హీరో అని… ఓడిన వారు విలన్ అంటున్నారు స్థానికులు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ హవాలో కూడా వైసీపీ ఓడిందంటే అందుకు కారణం… ఆదిరెడ్డి భవాని మాట తీరు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సొంత అక్క కావడం కూడా ఆమెకు కలిసి వచ్చిన అంశం.
అటు వైసీపీలో కూడా ఆదిరెడ్డి భవానికి మంచి పేరు ఉంది. ఎర్రన్నాయుడు కుమార్తె కావడంతో… సీనియర్లకు బాగా సుపరిచితమైన పేరు. అదే సమయంలో భవాని మామ ఆదిరెడ్డి అప్పారావు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా వ్యవహరించారు కూడా. ఆయనకు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యం. ఇవన్నీ ఆదిరెడ్డి వర్గానికి అనుకూలించే అంశాలు. అయితే ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి నియోజకవర్గం పనులన్నీ కూడా భర్త ఆదిరెడ్డి వాసు చూసుకున్నారు.
పైగా రెండేళ్లుగా భవానీ పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు రాజమండ్రి వచ్చి వెళ్లే వారు. అటు ఆదిరెడ్డి అప్పారావు, వాసులపై చిట్‌ఫండ్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు కూడా చేశారు. దాదాపు నెల రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఇదంతా ప్రభుత్వం చేసిన కుట్ర అని అప్పట్లో ప్రచారం చేశారు. ఇది కొంత సానుభూతి కలిగించిందనే చెప్పాలి. అయితే ఆదిరెడ్డి వాసు తీరు వల్ల ఇప్పటికే 15 మంది మాజీ కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేశారు. ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశం. వాసుపై గతంలో రూరల్ నియోజకవర్గం నేతలు కూడా చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారు.
అయితే కింజరాపు అల్లుడు కావడంతో అతనిపై చర్యలు తీసుకోలేదనే మాట వినిపిస్తోంది. ఇటు వైసీపీలో మార్గాని భరత్‌కు ఎదురుగాలి వీస్తోంది. ఐదేళ్లు ఎంపీగా ఉన్న సమయంలో భరత్ చేసింది ఏమీ లేదనేది వాస్తవం. టీడీపీ నేతలపై వ్యాఖ్యలు చేయడం మినహా… నియోజకవర్గం అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదు. పైగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు భరత్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇది భరత్ ఓటమికి ప్రధాన కారణం కూడా. తానోక సినిమా హీరో అని… తను నటించడం మొదలుపెడితే… మిగిలిన హీరోలకు మార్కెట్ ఉండదంటూ భరత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవన్నీ కూడా భరత్ ఓటమికి కారణాలే.
Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More
Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More
రాజకీయాల్లో నేతల ప్రభావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఇది… Read More
Karthika Deepam 2 May 11th 2024 Episode: పారు బంటుని సీక్రెట్ గా కలుస్తూ ఉంటుంది. దీప ఇంట్లో… Read More
Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More
CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More
Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More
Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More
May 11: Daily Horoscope in Telugu మే 11 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More