Today Horoscope డిసెంబర్ 18th శుక్రవారం రాశి ఫలాలు

Published by
Sree matha

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్‌ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, శుక్రవారం, తిథి: చవితి పగలు 2.23 వరకు తదుపరి పంచమి, నక్షత్రం: శ్రవణం రాత్రి 7.04 వరకు  తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రాత్రి 11.10 నుండి 12.48 వరకు, అమృత ఘడియలు: ఉదయం 8.44 నుండి 10.19 వరకు,  రాహుకాలం: ఉదయం 10.49 నుండి పగలు 12.12 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.53 నుండి 9.37 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: పగలు 12.34 నుండి 1.19 వరకు.

మేష రాశి : ఈరోజు దేవాలయ దర్శనం !

ఈరోజు సమస్యల నుంచి బయట పడతారు. ఈరోజు విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు. ఈరోజు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈరోజు పెద్ద వారి సూచనలను పాటిస్తారు. ఈరోజు సమస్యకు తగ్గ పరిష్కారాన్ని  ఆలోచిస్తారు. ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవనం గడుపుతారు. ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి శ్రద్ధ చూపుతారు. ఈరోజు వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన రోజు. గతంలో చేసిన తప్పులను తిరిగి చేయకూడదని నిర్ణయించుకుంటారు. ఈరోజు ఎటువంటి ఇబ్బందులు కష్టాలు వచ్చినా ధైర్యంగా సాహసోపేతంగా ముందుకు రాణిస్తారు. సంగీతం మీద దృష్టిని కేంద్రీకరిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉంటారు. ఈరోజు దేవాలయ దర్శనం చేసుకుంటారు. ఈరోజు ప్రతి పనిని తెలివితేటలతో ప్రణాళికాబద్ధంగా, సమయస్ఫూర్తిగా చేస్తారు. ఈరోజు విజయం సాధిస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన రోజు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించి పోటీపరీక్షల్లో విజయం పొందుతారు

రెమిడీ: ఈరోజు కార్తికేయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి : నిందారోపణలు వచ్చే అవకాశం !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న ఉత్సాహం తగ్గుతుంది. ఈరోజు ఏ విషయానికైనా ఆందోళన పడతారు. ఈరోజు గర్వాన్ని, కోపాన్ని తగ్గించుకోండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఈరోజు మీ మీద నిందారోపణలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు పెద్ద వారి సూచనలను పాటించండి. విద్యార్థుల విద్య మీద శ్రద్ధ వహించండి. ఈరోజు పనులు సకాలంలో పూర్తి అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈరోజు ఎవరితో గొడవలు, తగాదాలు పెట్టుకోకండి. ఈరోజు ఆధ్యాత్మిక తత్వం కలిగి ఉంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి : ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఏ పని కైనా ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈరోజు సంతోషంగా, సరదాగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాలు చేస్తారు. ఈరోజు ప్రతి పనిని చురుగ్గా, హుషారుగా చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా విద్య మీదనే ఏకాగ్రత చూపుతారు. దంపతులు ఇద్దరు మంచి అవగాహనగా ఉంటారు.

రెమిడీ: ఈరోజు మంగళ చండి పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి : ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది !

ఈరోజు మీ మీద వేరే వాళ్ళు చెడు ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు ఖర్చులను తక్కువగా చేయండి. ఈరోజు ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఏ పనినైనా ఓర్పుతో చేసుకోండి. ఈరోజు సోదరులతో సఖ్యత గా ఉండండి. ఈరోజు పెద్ద వారితో వాదోపవాదాలు పెట్టుకోకండి. విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ వహించండి . స్త్రీలు ఈ రోజు ఖర్చు ఎక్కువగా చేస్తారు.

రెమిడీ: ఈరోజు రుణ విమోచన గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి : ఈరోజు కష్టానికి తగ్గ ఫలితం !

ఈరోజు సమయం కలిసి వస్తుంది. ఈరోజు పనులన్నీ నెమ్మదిగా సాగుతాయి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.  ఈరోజు ధన లాభం కలుగుతుంది. ఈరోజు కొత్త ఆభరణాలను, కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు వస్తువులను క్రయవిక్రయాలు చేస్తారు. ఈరోజు ధర్మంగా ఉంటారు. ఈరోజు సన్నిహితులను కలిసే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి మంచి శుభవార్త వింటారు. ఈరోజు మీ లా ఉన్న నీతి నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఈరోజు ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. ఈరోజు పెద్దల నుంచి ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. ఈరోజు నిర్ణయాలను సాహసోపేతంగా తీసుకుంటారు. ఈరోజు స్త్రీలు మంచి ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఈరోజు మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు భ్రమరాంబికాష్టకం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి : ఈరోజు ఇబ్బందిగా ఉంటుంది !

మీరు చేసే పనిని శ్రద్ధ పెట్టి చేయండి. ఈరోజు ఖర్చులు తక్కువగా పెట్టండి. డబ్బులను వృధా చేయకండి. ఈరోజు ఓర్పు, సహనంతో ఉండండి. ఈరోజు ఎదుటి వారితో వాదోపవాదాలు పెట్టుకోకండి. ఈరోజు మీ కోపాన్ని తొందరపాటుతనం ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు పిల్లలతో సహనంగా ఉండండి, వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి. ఈరోజు మీలో ఉన్న మంచితనాన్ని ఇతరులు వాడుకునే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు విద్య మీదనే ఏకాగ్రతను పెట్టండి. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.

రెమిడీ: ఈరోజు దుర్గా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

తులారాశి : ఈరోజు విజయం సాధిస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ధన లాభం కలుగుతుంది. ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. ఈరోజు క్రయవిక్రయాలు చేస్తారు. ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటారు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. ఈరోజు మీకు కావలసిన వారికి, బంధువులకు ధన సహాయం చేసే అవకాశం ఉంది. ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఈరోజు వ్యవహారాలు చేసేటప్పుడు పెద్ద వాళ్ల సలహా తీసుకుంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి అనుకూలమైన రోజు. ఈరోజు విద్య మీద శ్రద్ధ వహించి విజయం సాధిస్తారు. ఈరోజు మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉంటారు.

రెమిడీ: ఈరోజు రుద్ర కవచం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు రుణబాధలు పెరిగే అవకాశం !

ఈరోజు ఆశావాదంతో ఉంటారు. ఈరోజు సమయానికి నిద్ర హారాలు మానకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు అనవసరపు విషయాలకు, అనవసరపు ఖర్చులు ఎక్కువగా చేయకండి. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఎవరితో వాదోపవాదాలు, తగాదాలు పెట్టుకోకండి. ఈరోజు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి. ఈరోజు మీ కోపాన్ని , తొందరపాటున్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు తక్కువగా మాట్లాడండి. ఈరోజు పిల్లలతో సన్నిహితంగా ఉండండి. ఈరోజు రుణబాధలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు సమయాన్ని వృధా చేయకండి. ఈరోజు ఆధ్యాత్మిక చింతనతో ఉండే ప్రయత్నం చేస్తారు. ఈరోజు చెప్పుడు మాటలను వినకండి .స్నేహితులతో చక్కగా ఉండండి. ఈరోజు విద్యార్థుల విద్య మీద శ్రద్ధ వహించండి. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు బంధువులతో సఖ్యత గా ఉండండి.

రెమిడీ: ఈరోజు దత్తాత్రేయ స్వామి పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి : ఈరోజు ఆగిపోయిన పనులు పూర్తి !

ఈరోజు చాలా బాగుంటుంది. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. ఈరోజు తక్కువగా మాట్లాడండి, వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరూ సఖ్యతగా ఉంటారు. ఈరోజు గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు మీలో మంచి మేధాశక్తి, తెలివితేటలు పెరుగుతాయి. ఈరోజు మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఈరోజు అప్పుల బాధలు తీరుతాయి. ఈరోజు ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు సన్నిహితులతో సఖ్యత గా ఉంటారు. ఈరోజు సామాజిక సేవ చేస్తారు. ఈరోజు ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన రోజు. ఈరోజు లాభం కలుగుతుంది.

రెమిడీ: ఈరోజు మంగళాష్టక పారాయణాన్ని చేయండి.

 

మకర రాశి : అత్యవసరమైన పనులు వాయిదా !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు భార్యాభర్తల సఖ్యత గా ఉండేందుకు ప్రయత్నించండి. ఈరోజు చేపట్టిన పనులు ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు పెట్టకండి. ఈరోజు ఓర్పుగా, మనశ్శాంతిగా ఉండండి. ఈరోజు ఎవరితో వాదోపవాదాలు, గొడవలు పడకండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఈరోజు అనవసరపు వస్తువులను తక్కువగా ఖర్చు చేయండి. ఈరోజు బద్ధకం వల్ల అత్యవసరమైన పనులను వాయిదా వేస్తారు. ఈరోజు అనవసరపు విషయాలకు దూరంగా ఉండాలి.

రెమిడీ: ఈరోజు దేవీ దశనామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి : ఈరోజు పనులు సకాలంలో పూర్తి !

ఈరోజు మంచి అనుకూలమైన రోజు. ఈరోజు సంతోషంగా,  ఆనందంగా, హుషారుగా అన్ని పనులను పూర్తి చేస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన రోజు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఈరోజు గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు వాహనయోగం కలిగే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. ఈరోజు అందరితో సఖ్యతగా ఉంటారు. ఈరోజు ఆనందంగా ఉంటారు. ఈరోజు భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. ఈరోజు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు సన్నిహితులతో సఖ్యతగా ఉంటారు. ఈరోజు బంధువుల నుంచి ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశం ఉంది. ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించి పోటీపరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు.

రెమిడీ: ఈరోజు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి : ఈరోజు వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు ఆధ్యాత్మిక  చింతన కలిగి ఉంటారు. ఈరోజు బద్ధకంగా, నిరుత్సాహంగా  ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఇతరులను తొందరగా నమ్మకండి. ఈరోజు ఎవరికీ డబ్బులను ఇవ్వకుండా ఉండటం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉండి. ఈరోజు ఇతరులతో కొన్ని విషయాల్లో రాజీ పడి పని పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఈరోజు ధర్మంగా మాట్లాడడం వల్ల ఇష్టమైనవారు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోండి. ఈరోజు వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్త. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది . విద్యార్థుల విద్య మీద శ్రద్ధ వహించాలి. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త.

రెమిడీ: ఈరోజు శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయనం చేస్కోండి.

 

This post was last modified on December 17, 2020 11:31 pm

Sree matha

Share
Published by
Sree matha

Recent Posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More

May 4, 2024

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More

May 4, 2024

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More

May 4, 2024

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More

May 4, 2024

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు

CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More

May 4, 2024

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More

May 4, 2024

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More

May 4, 2024

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More

May 4, 2024

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More

May 4, 2024

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218:  స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More

May 4, 2024

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More

May 4, 2024

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

Guppedanta Manasu May 4 2024 Episode 1066: రాజివ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్ర కు ఫోన్ చేస్తాడు… Read More

May 4, 2024

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

The Boys OTT: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు విన్నింగ్ అండ్ సూపర్ హిట్ డ్రామా సిరీస్ అయిన ది బాయ్స్… Read More

May 4, 2024

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

Jagadhatri May 4 2024 Episode 222:  నీతో గొడవ పడే టైం ఓపిక రెండు నాకు లేవు సురేష్… Read More

May 4, 2024

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Laapata Ladies OTT First Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకురాలిగా… Read More

May 4, 2024