NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

Jagadhatri Today Episode May 4 2024 Episode 222 highlights

Jagadhatri May 4 2024 Episode 222:  నీతో గొడవ పడే టైం ఓపిక రెండు నాకు లేవు సురేష్ అన్నయ్య కి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడాలి అని జగదాత్రి అంటుంది. సురేష్ జగదాత్రి నీతో మాట్లాడుతుందట కౌశికి నాలుగు మెట్లు దిగివచ్చి జగదాత్రితో ఫోన్ చేయించింది నువ్వు కాస్త బెట్టు చేసినట్టు మాట్లాడు అని దివ్యాంక చెబుతుంది. అలాగే అని సురేష్ ఫోన్ తీసుకుంటాడు. ఏంటి అన్నయ్య వదినతో బంధాన్ని తెంపుకోవాలి అనుకుంటున్నావా ఇంతేనా నువ్వు వదినని అర్థం చేసుకుంది అని జగదాత్రి అంటుంది. కలిసి ఉండలేని బంధం విడిపోక ఏం చేస్తుంది జగదాత్రి కౌశికికి నేనంటే ఇష్టం లేదు అందుకే దూరంగా వెళ్లిపోవాలనుకుంటున్నాను అని సురేష్ అంటాడు.

Jagadhatri Today Episode May 4 2024 Episode 222 highlights
Jagadhatri Today Episode May 4 2024 Episode 222 highlights

కీర్తి కోసమైనా ఒక్కసారి ఆలోచించి ఇంటికి వచ్చి వదినతో మాట్లాడితే అర్థం అవుతుంది ప్లీజ్ అన్నయ్య మీరు ఇంటికి వచ్చేయండి  కూర్చొని మాట్లాడుకుందాం అని జగదాత్రి అంటుంది.అలాగే అని సురేష్ అంటాడు.ఏంటి సురేష్ నువ్వు కాస్త బెట్టు చేయమంటే  వెళ్ళిపోతున్నావ్ అని దివ్యాంక అంటుంది.చూడండి మేడం ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా కూతురు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను అని సురేష్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు కౌశికి సురేష్ మాట్లాడుకుంటే ఇద్దరు ఒకటి అయిపోతారు నేను వేసిన ప్లాన్ అంతా పాడైపోతుంది అని దివ్యాంక ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode May 4 2024 Episode 222 highlights
Jagadhatri Today Episode May 4 2024 Episode 222 highlights

దివ్యాంక సురేష్ దగ్గరికి వస్తుంది ఏంటి మేడం మళ్ళీ మీరు వచ్చారు అని సురేష్ అంటాడు. భయపడకు సురేష్ నీ కూతురు కౌశికి నీకు దగ్గరవుతారు బాధపడకు పద అని దివ్యాంక సురేష్ కలిసి ఇద్దరూ వెళ్తారు. జగదాత్రి కౌశికికి నచ్చ చెబుతుంది. ఇదేంటి వాళ్ళిద్దరూ విడిపోతారు అనుకుంటే ఈ జగదాత్రి వాళ్ళిద్దర్నీ కలిపేలా ఉంది సురేష్ వచ్చి మాట్లాడితే ఇద్దరు ఒకటి అయిపోతారా అని వైజయంతి అనుకుంటుంది.అందరూ సురేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.బావొచ్చాడు అని కేదార్ అంటాడు.తన వెనకాల దివ్యాంక కూడా వచ్చి హాయ్ కౌశికి అని అంటుంది.ఏంటి వదిన తను ఎంతో ప్రేమగా పలకరిస్తే పలకరించవా అని నిషిక అంటుంది.ప్రేమని ఇస్తుంటే తీసుకోరు పైగా వాళ్ల జీవితమేదో మనం లాక్కుంటున్నట్టు మన మీద ఏడుస్తారు కొందరి జీవితాలు అంతే నిషిక ఏం చేస్తాం అని దివ్యాంక అంటుంది. ఏ మాత్రం ఇంటికి సంబంధం లేని వ్యక్తి వదిన గురించి అలా మాట్లాడడం మర్యాదగా లేదు దివ్యాంక అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode May 4 2024 Episode 222 highlights
Jagadhatri Today Episode May 4 2024 Episode 222 highlights

సురేష్ ని చూసి కీర్తి వచ్చి హగ్ చేసుకుంటుంది. కౌశికి కీర్తిని తీసుకొని దూరంగా వెళ్లి నిలబడుతుంది. ఏంటండీ ఇది కూతుర్ని దగ్గరికి రానివ్వదు తన ప్రేమ చూపించదు పెళ్లి చేసుకుంటాం అంటే ఒప్పుకోదు విడాకులు ఇవ్వమంటే మాట్లాడదామని పిలిపించి ఏంటి ఈ పంచాయతీలు అని దివ్యాంక అంటుంది.అన్నయ్య పెళ్లి నాటి ప్రమాణాలు అప్పుడే మరిచిపోయావా వదినని వదిలేయడానికి సిద్ధపడ్డావా కనీసం కీర్తి గురించి ఆలోచించవా అన్నయ్య అని జగదాత్రి అంటుంది. బావ ఒక వారం నీ ప్రేమ ఒక వారం అక్క ప్రేమ పొందడం కీర్తికి ఏం బాగుంటుంది చెప్పు ఇద్దరి ప్రేమ కావాలి మీరిద్దరూ కలిసి ఉంటేనే కదా కీర్తి సంతోషంగా ఉండేది కీర్తి కోసం ఆలోచించండి బావ అని కేదార్ అంటాడు. అంటే ఇప్పుడేంటి సురేష్ ఇప్పుడు కౌశికిని బ్రతిమిలాడాలా అని దివ్యాంక అంటుంది. బంధాలనే దూరం చేసి దాని మీద ఇల్లు కట్టి ఆనందంగా చూసే నీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది బాధ గురించి అని జగదాత్రి అంటుంది. కలిసి ఉండలేనప్పుడు విడిపోవడం మంచిది కదా జగదాత్రి కౌశికి పంతానికి పోతుంది కానీ ఒక్కసారైనా ఆలోచించిందా ఇష్టం లేకుండా కలిసి ఎన్నాళ్ళు ఉంటాం ఈ పేపర్ మీద కలిసి ఉంటే మాత్రం లాభమేంటి అని సురేష్ అంటాడు. ఇది  నువ్వు నిర్ణయం తీసుకునేది కాదు అన్నయ్య ఒకరు చెబితే నువ్వు ఇలా చేసావని మాకు అందరికీ అర్థం అవుతుంది ఒక్కసారి వదిన కళ్ళలోకి చూస్తే ని మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode May 4 2024 Episode 222 highlights
Jagadhatri Today Episode May 4 2024 Episode 222 highlights

ఒకరు ప్రేరేపిస్తే విడిపోవాలనుకునే వ్యక్తితో జీవితకాలం ఉండలేను జగదాత్రి అయినా ఒక్కసారి నమ్మి చేయి పట్టుకున్నందుకే నన్ను నా కూతుర్ని బాధలోకి నెట్టేశాడు మళ్లీ రెండోసారి తన చేయి పట్టుకొని బాధపడలేము ఆ బంధం నాకు అక్కర్లేదు అని కౌశికి అంటుంది. ఏంటి సురేష్ ఆ విడాకుల మీద సంతకం పెట్టమను మన బతుకేదో మనం బతుకుదాం అని దివ్యాంక అంటుంది.ప్లీజ్ బావ ఒక్కసారి అక్కతో మాట్లాడు అని కేదార్ అనడంతో సురేష్ వెళ్లి కౌశికి దగ్గర నిలబడతాడు.చెప్పు కౌశికి ఏం చేద్దాం ప్రేమించి పెళ్లి చేసుకున్న మనం ఇంతటితో జీవితం ముగిసి పోవాల్సిందేనా ఇంతేనా మన జీవితం ఇంతటితో ఆగిపోవాల్సిందేనా నామీద నీకు ప్రేమ లేదా అని సురేష్ అంటాడు. దివ్యాంకని పెళ్లి చేసుకుంటూ మా మీద ప్రేమ ఉన్నట్టు నటించకు సురేష్ అందరి ముందు నన్ను దోషిని చేసి నువ్వు మంచి వాడివి అని నిరూపించుకోవాలనుకోకు ఎన్నిసార్లు వద్దంటున్న వస్తూనే ఉన్నావు నీకెలా ఉందో గాని నువ్వు వస్తున్న కొద్ది నేను వద్దు అనడం నాకు చాలా సిగ్గుగా ఉంది అని కౌశికి అంటుంది.  నువ్వు వద్దంటున్నా నీ దగ్గరికి నేను రావడం నాకు నిజంగానే సిగ్గు లేదు నామీద ఎక్కడో కాస్త ప్రేమ ఉందేమో నేను మాట్లాడితే ఒప్పుకుంటావేమో అని వచ్చాను చూడు అందుకు నాకు సిగ్గు లేదు అయినా వద్దు అంటున్న నేను వస్తున్నానంటున్నావు కదా నా భార్య బిడ్డల్ని దక్కించుకోవడం కోసం పదేపదే వస్తున్నందుకు నాకు నిజంగానే సిగ్గులేదు ఇంతగా వద్దంటున్నావు కదా నాకు కూడా అక్కర్లేదు ఏదో ఒక రోజు తప్పు తెలుసుకుంటుంది కౌశికి అని సురేష్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode May 4 2024 Episode 222 highlights
Jagadhatri Today Episode May 4 2024 Episode 222 highlights

బావ ఒక్కసారి అక్కతో కూర్చొని మాట్లాడు బావ అని కేదార్ అంటాడు. ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్లో కౌశికికి తెలిసే రోజు ముందే ఉంది ఈ ఇంట్లో వాళ్లకి కౌశికి ఒక డబ్బు సంపాదించే మిషన్ ఈ కుటుంబం మీద ప్రేమ పెంచుకున్న కౌశికికి అందరూ దూరమైన రోజు తెలుస్తుంది ప్రేమించేది ఎవరో దూరమయ్యేది ఎవరో అని సురేష్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, కౌశికి సురేష్ విడిపోయారని నలుగురు సంతోషిస్తూ ఉంటారు. జగదాత్రి మాత్రం వాళ్ళని ఎలా కలపాలని ఆలోచిస్తూ ఉంటుంది.

Related posts

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

bharani jella

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N