Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్‌కి మూడో పదవి..! ఎలాగైనా మాట నిలబెట్టుకున్న జగన్..! ఈ సారి ఢోకా లేనట్టే – సేఫ్ పదవి..!!

Published by
Srinivas Manem

Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్ పేరు విన్నారు కదా..ఈ పేరు రాష్ట్రంలోని రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా తెలుసు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి రిటైర్ అయ్యాయి. ఆయనతో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ఏ విధమైన బంధం ఉందో కానీ రాష్ట్రంలో ఓ కీలకమైన పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ మేరకు ఆయనకు హామీ ఇచ్చారు. గతంలో రెండు పదవులు జగన్ సర్కార్ ఇచ్చినా న్యాయపరమైన చిక్కుల కారణంగా అ పదవులు మూడునాళ్ల ముచ్చట అయ్యాయి. ఇప్పుడు జగన్ సర్కార్ ఆయనకు మరో పదవి ఇచ్చింది. అది ఎలా అంటే..

Justice Kanagaraj appointed in pd act committee

 

Justice Kanagaraj: పీడీ యాక్ట్ సలహా మండలి సభ్యుడుగా..

ఏపి ప్రభుత్వం తాజాగా పీడీ యాక్ట్ కేసుల పర్యవేక్షణకు ఓ సలహా మండలిని ఏర్పాటు చేసింది. ప్రివెంటివ్ డిటెక్షన్ (పీడీ యాక్ట్) చట్టం 1955లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ లు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తుంటారు. అయితే కలెక్టర్ లు నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసులు పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సలహా మండలిని నియమించింది. అందులో ముగ్గురు విశ్రాంత న్యాయమూర్తులను సభ్యులుగా నియమించింది. ముగ్గురు సభ్యుల్లో ఒకరు జస్టిస్ కనగరాజ్. దీనికి రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ నీలం సంజీవరెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి 1999లో పదవీ విరమణ అయ్యారు. ఆయన వయస్సు ఇప్పుడు 84 ఏళ్లు ఉంటుంది. ఆయన్ను తీసుకువచ్చి ఈ పీడీ యాక్ట్ సలహా మండలికి అధ్యక్షులుగా పదవి ఇచ్చారు. ఇందులో ఇద్దరు కమిటీ సభ్యులుగా ఉండగా ఒకరు జస్టిస్ కనగరాజ్, మరొకరు జస్టిస్ దుర్గాప్రసాద్. కనగరాజ్ వయస్సు 74 సంవత్సరాలు, దుర్గాప్రసాద్ వయస్సు 70 సంవత్సరాలు. వీళ్లు ముగ్గురు హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పని చేసిన అనుభవం ఉంది కాబట్టి పీడీ యాక్ట్ కింద నమోదు చేసిన కేసులను వాళ్లకు ఉన్న అనుభవంతో, న్యాయ నిపుణతతో పరిశీలించి వాళ్లపై కేసు నమోదు కరెక్టా కాదా, వారిపై ఆ కేసు కొనసాగించాలా వద్దా అనేది తేలుస్తారు. ఈ కమిటీ ఏర్పాటు ఉద్దేశం కరేక్టే. సమంజసమే. ఎందుకంటే కలెక్టర్లు ఇష్టానుసారంగా పీడీ యాక్ట్ కేసులు ఓపెన్ చేస్తే వాటిని ఉంచాలా తీసేయాలా అనేది నిర్ణయించేందుకు ఒక కమిటీ ఉంటే మంచిదే. కాకపోతే ఆ కమిటీలో వేసిన సభ్యుల నియామకంపైనే సందేహం. ప్రస్తుతానికి అయితే ఎటువంటి అభ్యంతరాలు ఏమీలేవు. ఎవరైనా దీనిపై పట్టుబట్టి లిటిగేషన్ లేవనెత్తి కోర్టులో పిటిషన్ వేస్తే చెప్పేలేము కానీ ప్రస్తుతానికైతే ఇబ్బందులు లేవు. కమిటీ నియమాలకు అనుగుణంగానే ప్రభుత్వం వీళ్లను నియమించింది.

 

న్యాయపరమైన చిక్కులు రాకపోతే ఈ పదవి సేఫ్

ఇక జస్టిస్ కనగరాజు విషయం అందరికీ తెలుసు. గతంలో ఎస్ఈసీ  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా తొలగించి, రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఆయన స్థానంగా కనగరాజ్ ను నియమించింది. అయితే ఆయన నియామకం హైకోర్టులో, సుప్రీం కోర్టులో నిలవలేదు. దీంతో ఆయన ఎస్ఈసీ పదవి మూనాళ్ల ముచ్చట అయ్యింది. ఆ తరువాత ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైయింట్స్ అధారిటీకి కనగరాజ్ ను చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే ఈ పదవికి 65 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారే చైర్మన్ గా ఉండాలన్న నిబంధన ఉండటంతో ఆ నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో జగన్ సర్కార్ ఆయనకు ఇచ్చిన రెండు పదవులు పోయాయి. ఇప్పుడు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం మూడవ పదవి ఇచ్చింది. ఇది మాత్రం ఆయనకు పూర్తి స్థాయి పదవిగా ఉండవచ్చు, న్యాయపరమైన చిక్కులు ఏమీ రాకపోతే..!

Srinivas Manem

Recent Posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

Devara: RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ "దేవర" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ… Read More

May 6, 2024

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు అని, ఈ  వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యే చేశారని ఆంధ్రప్రదేశ్… Read More

May 6, 2024

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Koratala Siva On Devara: చాలామంది ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న సినిమాలలో దేవరా కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్… Read More

May 6, 2024

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Premalu OTT: ప్రేమలో సినిమా మలయాళ ఇండస్ట్రీని ఏ విధంగా సెట్ చేసిందో మనందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో… Read More

May 6, 2024

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తోనే వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ… Read More

May 6, 2024

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Thalaimai Seyalagam OTT: ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల హడావిడి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాల పేరిట కూడా అనేక… Read More

May 6, 2024

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

The Family Man Season 3: ఈ ఫ్యామిలీ వెబ్ సిరీస్ మూడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి… Read More

May 6, 2024

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Baak OTT Release: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమర్నా మరియు బొద్దుగుమ్మ రాశి కన్నా మరోసారి కలిసి నటించిన సినిమా… Read More

May 6, 2024

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Manjummel Boys OTT Response: మంజుమ్మల్ బాయ్స్ సినిమా థియేటర్లలో ఏ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. మలయాళం… Read More

May 6, 2024

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక… Read More

May 6, 2024

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులపై బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల అనంతపురం ఎస్పీ అన్బురాజన్ ను బదిలీ… Read More

May 6, 2024

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

AP DGP: ఏపీ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమితులైయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం… Read More

May 6, 2024

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

Sreemukhi: తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్స్ లిస్ట్ తీస్తే శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది. బుల్లితెర రాములమ్మ… Read More

May 6, 2024

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Jyothi Roi: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. తెరపై… Read More

May 6, 2024