Mamagaru March 27 2024 Episode 171: గంగ నువ్వు ఎక్కడ సరిగ్గా ఉద్యోగం చేయలేదు అందుకే నీకు ఈ జాబ్ ఇవ్వడం లేదు ఏదైనా కంపెనీలో పని చేస్తే టైం సెన్స్ ఉండాలి గంగ నీకు తెలివి ఉంది కానీ పట్టుమని పది రోజులు కూడా జాబ్ చేయకుండా మానేశావ్ అలాంటప్పుడు నీకు జాబ్ ఇవ్వడం కుదరదు ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అతను అంటాడు. నేను ఎందుకు మానేయాల్సి వచ్చిందో చెప్తాను అని గంగ అంటుంది. నీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం గంగ ఇక నువ్వు వెళ్లొచ్చు అనడంతో గంగ అక్కడినుంచి నిరాశతో వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,
పాండురంగ మంచినీళ్ల బాటిల్ కొనుక్కొని అందులో నీళ్లు సగం తాగేసి బాటిల్లో మందు పోస్తాడు. ఎందుకురా ఈ కక్కుర్తి పనులు మంచిగా మందు తాగి వెళ్లొచ్చు కదా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. రేయ్ ఇక్కడే మందు తాగి వెళ్తే ఇంటికి వెళ్ళాక వాసన వస్తుంది కిక్కుపోతుంది అప్పుడు నిద్ర పట్టదు అందుకే ఇంటికి వెళ్లి హాయిగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని మందు తాగితే బాగుంటుంది అని పాండురంగ అంటాడు. ఇంతలో చ0గయ్య వచ్చి పాండురంగ భుజం మీద చెయ్యి వేస్తాడు. ఎవరది అని చూసేసరికి చ0గయ్య నాన్న మీరేంటి ఇక్కడ అని పాండురంగ అంటాడు. రేయ్ నాకు చాలా దాహంగా ఉంది నాలుక పీక్కుపోతుంది మంచినీళ్లు ఇవ్వరా అని చ0గయ్య అంటాడు. నాన్న ఇవి నువ్వు తాగే మంచినీళ్లు కాదు అని పాండురంగ అంటాడు. నాలుక పీకు పోతుంటే నేను తాగేది కాదంటావ్ ఏంట్రా ఏవైనా సరే నేను తాగుతాను అని చ0గయ్య బాటిల్ లాక్కొని మంచినీళ్లు తాగేస్తాడు. నాన్న నేను మంచినీళ్లు తాగేలా చేసావు అని టెన్షన్ పడుతూ ఉంటాడు పాండురంగ. కట్ చేస్తే,
గంగాధర్ బాధతో ఇంటికి వస్తాడు. గంగ వెళ్లి మంచి నీళ్లు తెచ్చి గంగాధరికి ఇస్తుంది. నాకు ఉద్యోగం రాలేదు గంగ నేను ఓడిపోయాను జీవితంలో అని బాధపడతాడు గంగాధర్. ఈ జాబ్ రాకపోతే ఇంకొక జాబ్ వస్తుంది అని గంగ అంటుంది. గంగ నా సంగతి పక్కన పెట్టు నీకు ఉద్యోగం వచ్చిందా నువ్వు బాగా చదువుకున్న దానివి కదా నీకు వస్తుందిలే అని గంగాధర్ అంటాడు. ఇప్పుడే కాదండి వెళ్లాను ఫస్ట్ లెవెల్ అయిపోయింది చూడాలి అని గంగ అంటుంది. గంగ సోషల్ మీడియాలో కరెంటు పని చేస్తాము డబ్బులు న్యాయంగా తీసుకుంటామని రాసి పెడుతుంది. నీ పిచ్చి గాని అలా పెడితే నాకు జాబ్ ఇస్తారు గంగ అని గంగాధర్ అంటాడు.చూస్తూ ఉండండి నీకు ఒక గంటలోనే ఉద్యోగం వస్తుంది అని గంగ అంటుంది. నువ్వు ఓడిపోతావ్ అని గంగాధర్ అంటాడు.
వస్తుంది చూడండి అని గంగ అనడంతో అయితే పందెం కాస్తవ నేను ఓడిపోతే రెండు ముద్దులు పెడతాను అని గంగాధర్ అంటాడు. బాగానే ఉంది కానీ నీకు కచ్చితంగా వస్తుంది చూడండి మీరు ఓడిపోతారు అని గంగ అంటుంది. ఇంతలో అంజమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ నేను తర్వాత ఫోన్ చేస్తాను అని గంగ ఫోన్ కట్ చేస్తుంది. చూడండి ఇప్పుడొచ్చే కాల్ మీదే అని గంగ అంటుంది. గంగ నాకెవరు ఇస్తారు ఉద్యోగం నేను వేస్ట్ ఫెలోని కదా అని గంగాధర్ అంటాడు. చూడండి ఇప్పుడు మీకు వచ్చే కాల్ అదే అని గంగ అంటూ ఉండగానే ఒక ఫోన్ వస్తుంది. ఇది ఆ ఫోన్ మీరు స్పీకర్ పెట్టి మాట్లాడండి అని గంగ అనడంతో గంగాధర్ స్పీకర్ ఆన్ చేస్తాడు. నమస్కారమండి మీ ఇంట్లో బొద్దింకలు ఉన్న నాకు వెంటనే ఫోన్ చేయండి మందు ఇస్తాను అని అతను అంటాడు. అది విని గంగాధర్ నవ్వి గంగ ఇక నాకు ఉద్యోగం రాదు నువ్వు ఓడిపోయావు అని గంగాధర్ అంటాడు. కట్ చేస్తే,
మంచినీళ్లు అనుకొని మందు తాగిన చంగయ్య తూలుతూ ఉండగా ఇంటికి తీసుకువస్తాడు పాండురంగ. పాండు నా చెప్పులేవిరా అని చ0గయ్య అంటాడు. నాన్న నీ బ్యాగు నాకిచ్చి చెప్పులో సంకలో పెట్టుకున్నావు చూడు అని పాండురంగ అంటాడు. చెప్పులు ఎవరైనా కాళ్లకు వేసుకుంటారు కానీ చంకలో పెట్టుకుంటారా అని చ0గయ్య చెప్పులు కాళ్లకు వేసుకుంటాడు. పాండురంగ చంగయ్య ని తీసుకువెళ్లి ఇంట్లో కూర్చో పెడతాడు. ఏమైందండీ మీకు అలా ఉన్నారు అని దేవామా అడుగుతుంది. నాకేమైంది దేవమ్మ నేను బాగానే ఉన్నాను అని చంగయ్య అంటాడు. రేయ్ పాండు నాన్న ఏమైనా మందు తాగాడా అలా మాట్లాడుతున్నాడు అని సుధాకర్ అంటాడు. ఏవండీ మీరు మందు తాగినప్పుడు ఎలా మాట్లాడుతారో అచ్చం మామగారు అలాగే మాట్లాడుతున్నాడు అని శ్రీలక్ష్మి అంటుంది. కనిపెట్టే సేవ నేను కొనుక్కున్న మందు మంచినీళ్లు అనుకుని నాన్న తాగేసాడు అని పాండురంగ అంటాడు.
ఈ అవకాశాన్ని వాడుకోవాలి అని శ్రీలక్ష్మి అనుకుంటుంది. మామగారు పండుగ వస్తుంది కదా పిండి వంటలు చేయాలి స్వీట్లు చేయాలి లీస్టు రాశాను డబ్బులు ఇవ్వండి 3000 అవుతాయి అని అంటుంది శ్రీలక్ష్మి. అవును కదా అని చ0గయ్య జోబులో నుంచి డబ్బులు తీసి శ్రీలక్ష్మి కి ఇస్తాడు. శ్రీ లక్ష్మీ డబ్బులు తీసుకొని లెక్కపెట్టి ఇదేంటి మామగారు నేను పండుగ కోసం రాసిచ్చిన సామానికి 3000 అవుతాయి మీరు 1300 ఇచ్చారేంటి అని అంటుంది శ్రీలక్ష్మి. నువ్వు రాసిచ్చిన లిస్టు 3000 అవుతాయి కానీ అందులో పనికిరాని కొన్ని ఉన్నాయి అవి తీసేసి 1300 ఇచ్చాను అని చ0గయ్య అంటాడు. మామగారు మీరు ఈ పరిస్థితుల్లో కూడా లెక్కలు బాగా చేస్తున్నారే అని శ్రీలక్ష్మి అంటుంది. ఈ చంగయ్య అంటే ఏమనుకున్నావమ్మా లెక్కలు ఎలా ఉన్నా చేస్తాడు అని అంటాడు. అందరూ షాక్ అవుతారు..
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More