శాసనమండలిలో బలం టీడీపీదే. నిర్మొహమాటంగా చెప్పే సమాధానం ఇది. కానీ… రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయమై తెలుగుదేశం పార్టీ పట్టు వీడడం లేదు.., వైసిపి బెట్టు వీడడం లేదు. ఈ కీలకమైన బిల్లు నాలుగు నెలల వ్యవధిలో మరోసారి శాసన సభ ఆమోదించి శాసనమండలి ముందుకి చర్చకు తెచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకొని ఓ ముగ్గురు ఎమ్మెల్సీల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
మండలిలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత ఉంది చైర్మన్ ఆ పార్టీ వారే. శాసనసభలో జగన్ కి తిరుగులేని ఆధిక్యం ఉంది. కానీ ఈ రెండు సభల్లో శాసన మండలిదే తుది నిర్ణయం. అక్కడ బిల్లు ఆమోదిస్తే ఇక తిరుగులేకుండా చట్టం అయినట్టే. కానీ ప్రతిపక్ష పార్టీకి మండలంలో ఆదిక్యత కారణంగా ప్రభుత్వ కీలక అడుగులకు చిక్కులు వస్తున్నాయి. తాజాగా రాజధాని వికేంద్రీకరణ బిల్లు మరోసారి శాసన మండలి ముందుకు వచ్చింది. దీన్ని అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది అందుకే విప్ కూడా జారీ చేసింది. అంటే తిరుగుబాటు ఎమ్మెల్సీలు అయిన పోతుల సునీత, శివనాథ్ రెడ్డి, శమంతకమనిలు కచ్చితంగా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఓటు వేయాల్సిందే.., లేకపోతే వేటు తప్పదు అంటూ విప్ ఇచ్చేసింది. గతంలోనే మండలిలో తిరస్కరించిన ఈ బిల్లుని ప్రభుత్వం మరోసారి తీసుకువచ్చి ప్రతిష్ఠాత్మకమైన అడుగు వేసింది. టిడిపి మాత్రం విప్ జారీ చేసి.., వారిని అనర్హులుగా ప్రకటించే ముహూర్తం కోసం వేచి చూస్తుంది.
రాజధాని వికేంద్రీకరణ సీఎం జగన్‌కు అత్యంత కీలకమైన బిల్లు. మరోవైపు వికేంద్రీకరణను ఎలాగైనా అడ్డుకొని పంతం నెగ్గించుకోవడానికి అని తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. అందుకే తిరుగుబాటు ఎమ్మెల్సీలకు పదవి పోయినా సరే తమ మాటే వినాల్సింది గా విప్ జారీ చేసింది. గతంలోనే విప్ ధిక్కరించి ఓటింగ్ కు హాజరైన ఎమ్మెల్సీలు ముగ్గురికి పదవీగండం ఏర్పడేలా తెలుగుదేశం పార్టీ అడుగులు వేసింది. పోతుల సునీత, శివనాథ్ రెడ్డి, సమంతకమని ముగ్గురు గురు దేశం పార్టీ నుండి చంద్రబాబు నాయుడు చల్లని చూపుతో ఎమ్మెల్సీ లు గా మారారు నాటి బాబు రాజకీయానికి పావులు గా మరి నేటి జగన్ రాజకీయం కూడా వాళ్లే పావులై…, చక్రం తిప్పారు.
నిజానికి ఎమ్మెల్సీలు ముగ్గురు గతంలోనే అనర్హతకు గురయ్యేలా టిడిపి చర్యలు తీసుకుంది. వీరు ముగ్గురు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీకి తలనొప్పిగా మారిపోయారు. అందుకె వీళ్ళు ముగ్గురు బయట ఉండాలనేది, ఎమ్మెల్సీలుగా అనర్హత వేటు పడాలనేది టిడిపి వ్యహం. అందుకే ఎన్నిసార్లయినా విప్ జారీ చేసి, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఛైర్మన్ కి పిర్యాదు చేసి, విచారణ చేయించి, పక్కన పెట్టాలని చూస్తుంది. గతంలో ఓ సారి ఇదే తీరున జరిగినా… అనర్హత విచారణకు హాజరు కాలేదు. తప్పించుకుని అనుభవిస్తున్నారు. అందుకే పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలపై కత్తి వేలాడుతుంది. అసలు ఎమ్మెల్యేగానే ఓడిన సునీతకు ఎమ్మెల్సిగా అవకాశం ఇచ్చి, హోదా పెంచిన చంద్రబాబుకి చుక్కలు చూపించిన సునీతకు ఇప్పుడు తన చాణక్యత చూపించాలని బాబు యోచన.
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More