YSRCP: టీడీపీలో నిబద్దతతో పని చేసిన తనను చంద్రబాబు అవమానించి బయటకు పంపితే సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. ఇవేళ ఉదయం టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు .. మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పిసాదరంగా ఆహ్వానించారు.
అనంతరం గొల్లపల్లి సూర్యారావు మీడియాతో మాట్లాడుతూ .. నిబద్దతో పని చేసిన తనను టీడీపీ దారుణంగా అవమానించిందని అన్నారు. చంద్రబాబు, లోకేష్ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఉంటే ఉండు..పోతే పో అన్నట్లుగా చూశారన్నారు. అధికారం కోసం చంద్రబాబు మౌనమునిగా మారారని, లోకేష్ దుర్మార్ఘపు రీతిలో పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. జగన్ నాయకత్వంలో వైసీపీ కోసం శాయశక్తల పని చేస్తానని చెప్పారు.
సూర్యారావుతో పాటు పి గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ కూడా వైసీపీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు.అంతకు ముందు చంద్రబాబుకు సూర్యరావు రాజీనామాతో పాటు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. పొత్తులో భాగంగా రాజోలు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో సూర్యారావు మనస్థాపానికి గురైయ్యారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గొల్లపల్లి సూర్యారావు 2004లో కాంగ్రెస్ పార్టీ నుండి తొలి సారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ కేబినెట్ లో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో రాజోలు నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో త్రిముఖ పోరులో వైసీపీ అభ్యర్ధి పై జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాద్ విజయం సాధించగా, సూర్యారావు మూడో స్థానంలో నిలిచారు.
Hyderabad: ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ యాప్ బారిన పడిన ఇంజనీరింగ్ విద్యార్ధి ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More