Decoration: దైవిక శక్తులను పాడు చేసి
పెంపుడు జంతువులు గా చెప్పబడినవి కొన్నిటిని మాత్రమే ఇంట్లో పెంచుకోవచ్చు కానీ చేపలు , తాబేలు , పావురాలు , కుందేలు వంటి వాటిని ఇంట్లో అస్సలు పెంచుకోకూడదు . గబ్బిలం లాంటివి అసలు ఇంటిలోకి వచ్చినా కూడా దోషమే.. ఎందుకంటే కొన్ని జీవులకు వాటి జన్మతః వ్యతిరేక శక్తులను విడుదల చేసే గుణం కలిగి ఉంటాయి. వాటి నుండి విడుదలైన నెగెటివ్ వైబ్స్ ఇంటి వాస్తు , దైవిక శక్తులను పాడు చేసి ఇంట్లోఉండేవారికి మానసిక , శారీరక ఇబ్బందులను కలిగిస్తాయి. కొన్ని రకాల జీవులు ఒక్కోసారి ప్రేత ఆత్మలను కూడా మోసుకువస్తుంటాయి అని మన పెద్దలు చెప్పే మాట . వాటివల్ల ఇంటికి కలిగే కీడుకు శాంతి చేసుకునే విధానం లో ఉదకశాంతి , యజ్ఞము , బ్రాహ్మణులకు దానాదులు వంటివి చేసుకోవాలిసినంత గట్టిగా ఉంటుంది వాటి ప్రభావం.
వీటితో పాటు కొన్నిరకాల గవ్వలు , శంఖాలు , నత్తగుల్లలతో తయారు కాబడిన అలంకరణ వస్తవులు , నెమలి కన్నులు , కొన్ని రకాల పక్షుల ఈకలు , జంతువుల కు సంబందించిన వెంట్రుకలు , జంతు చర్మాలు లాంటి వాటిని శల్యాలు అంటారు . వీటన్నింటిలో సహజంగానే వ్యతిరేక శక్తుల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఇంట్లో పెట్టుకోకపోవడం మంచిది. వాస్తు ప్రకారం నెమలి ఈక ని ఇంటిలో పెట్టాలి అంటే వాటిని కొన్ని రోజుల పాటు పూజలో పెట్టి ఆ తర్వాత మాత్రమే ఇంట్లో కావలిసిన ప్రదేశం లో పెట్టుకోవాలి. ఇంట్లో అక్వేరియం పెట్టుకుని అందులో చేపలు , తాబేళ్లు వేసి పెంచుకోవడం అనేది ఈ మధ్యకాలం లో చాలా విపరీతం గా కనిపిస్తుంది. ఇలా పెంచుకోవడానికి రెండు కారణాలు వున్నాయి ఒకటి అలంకరణ కోసం అయితే రెండొవది వాస్తు దోషాలు పోగొట్టుకోవడం కోసం. వాస్తు కోసం అయితే మత్యయంత్రం పెట్టుకుంటే సరిపోతుంది. కానీ అందులో ఉండేది కేవలం చేప బొమ్మ… దానికి బదులుగా నిజమైన చేపలు పెంచుకుంటే ఇంకా మంచికే మంచి జరుగుతుంది అనే ఉద్దేశ్యం తో ఇలా చేస్తుంటారు. మనం ఇక్కడ గమనించవలిసిన విషయం ఏమిటంటే, చేపలు పెట్టేవాళ్ళు కూడా ఇంట్లో చేపల్ని నిల్వ ఉంచరు. ఒకవేళ వుంచవలసి వస్తే ఇంటి బయట కుండీల్లో వేస్తారు. మనం ఇంట్లో అక్వేరియం పెట్టుకుని చేపల్ని పెంచడం వల్ల వాటినుండి వెలువడే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో అందరిపై పడుతుంది. మనిషిలోని ఓజో శక్తి నిపాడుచేస్తుంది . నాడీవ్యవస్థపై ప్రభావంచూపడం వలన రోగ నిరోధక శక్తిని తగ్గేలా చేస్తుంది. ఆ జీవుల నుండి
బయటకు వచ్చే వ్యర్దాలు అదే నీటిలో కలిసిపోయి ఇంట్లో ఉండే ఆక్సిజన్ కూడా కలుషితం చేస్తాయి.
అలాగే ఆ జీవులనుండి వెలువడే చిన్న చిన్న శబ్ద తరంగాల వలన ఇంట్లో వాళ్ళ నరాల బలహీనతలు వస్తాయి.
మనపెద్దలు స్పష్టంగా చెప్పిన పెంపుడు జంతువులలో చేపలు , తాబేళ్లు లేకపోవడానికి ముఖ్య కారణం వాటి ప్రతికూల శక్తులే అని గమనించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి ఇంట్లో అస్సలు పెంచకూడదు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలిసిన విషయం ఏమిటంటే … ఇవన్నీ స్వతంత్రగా బ్రతికే జీవులు కావడం తో బంధించిన పాపం కూడా మనకు చుట్టుకుంటుంది.
This post was last modified on October 24, 2021 9:54 pm
Mamagaru: గంగ గంగాధర్ ని తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టి తనని చూసి బాధపడుతుంది. గంగాధర్ బెడ్ మీద దొర్లుతూ… Read More
Naga Panchami: పంచమి వాటర్ కోసం గదిలో నుండి కిందికి వస్తుంది.ఖరాలి తన మంత్ర శక్తిని జ్వాల జ్వాల శరీరంలోకి… Read More
Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మీ వడ్డీస్తాను మీరు తినండి అమ్మ అని నీలా… Read More
May 5: Daily Horoscope in Telugu మే 5 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More
Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More
Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More
Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More
CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More
Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More
Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More
BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More
Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More
Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More
Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More