NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

Mamagaru Today Episode May 4 2024 Episode 202 highlights

Mamagaru: గంగ గంగాధర్ ని తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టి తనని చూసి బాధపడుతుంది. గంగాధర్ బెడ్ మీద దొర్లుతూ గంగ గంగ నేను తాగలేదు వాలే తాపించారు అంటూ కలవరిస్తాడు. కట్ చేస్తే,చంగయ్య కోపంగా లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. మంచినీళ్లు తీసుకురమ్మంటారా అని దేవమ్మ అడుగుతుంది. కాస్త విషం కూడా తీసుకురా తాగి చచ్చిపోతాను అని చంగయ్య అంటాడు.అదేంటండి అలా మాట్లాడతారు ఏమైంది అని దేవమ్మ అడుగుతుంది. ఏముంది దేవమ్మ గంగాధర్ తాగి రోడ్లమీద దొర్లుతున్నాడు ఆ గంగ కూడా వాడి పక్కనే ఉంది వాడిని ఇలా బ్రష్టు పట్టించింది అంత ఆ గంగ వల్లే ఇలా జరిగింది అని చంగయ్య అంటాడు.అదేంటండి అలా మాట్లాడతారు గంగేంచేసింది అయినా తాగిపడ  కొడుకుని పలకరించకుండా అలా ఎలా వచ్చేసారండి అని దేవమ్మ అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ దేవమ్మ ఏలా తాగావురా గంగాధర్ ఎందుకు తాగావ్ రా అని మజ్జిగ ఇచ్చి మంచి నీళ్లు ఇచ్చి  మాట్లాడి రమ్మంటావా అని చంగయ్య అంటాడు. ఎందుకండీ వాణ్ణి ఎప్పుడు అపార్థం చేసుకుంటారు అని దేవమ్మ అంటుంది. నోరు ముయ్ దేవమ్మ నేను అపార్థం చేసుకోవడం ఏంటి ఆ గంగ వల్లే ఇలా జరిగింది ఇంకెప్పుడు వాడి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు అంటూ చంగయ్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode May 4 2024 Episode 202 highlights
Mamagaru Today Episode May 4 2024 Episode 202 highlights

గంగాధర్ దొర్లుతూ గంగ గంగ ని కలవరిస్తూ ఉంటాడు. గంగాధర్ వాంతి చేసుకోబోతుండగా గంగ దోసిడి పట్టి పారబోసి మంచినీళ్లు తెచ్చి తాగిపిస్తుంది. ఇంతలో పాండురంగ శ్రీ లక్ష్మీ వచ్చి ఏంటి గంగ ఇలా జరిగింది అని అంటారు. గంగాధర్ ఎందుకురా గంగని ఇలా బాధ పెడుతున్నావ్ లేరా అని పాండురంగ మజ్జిగ తాపిచ్చి మొహం కడిగి పడుకోబెడతాడు. గంగ వాడు ఎప్పుడూ ఇలా తాగలేదు వాడిలా తాగి పడిపొవడం ఏంటి అని పాండురంగ అంటాడు. గంగ ఏడవకు ఏం కాదులే అని శ్రీలక్ష్మి అంటుంది. గంగ ఏం కాదులే వాన్ని చూస్తూ ఉండు అంటూ పాండురంగ శ్రీ లక్ష్మీ వెళ్ళిపోతారు.

Mamagaru Today Episode May 4 2024 Episode 202 highlights
Mamagaru Today Episode May 4 2024 Episode 202 highlights

ఇంతలో దేవమ్మ గంగాధర్ కి ఫోన్ చేస్తుంది, అత్తయ్య ఫోన్ చేస్తుంది అని గంగ ఫోన్ ఎత్తి మాట్లాడుతుంది.గంగ గంగాధరికి ఏమైంది అమ్మ వాడు తాగి రోడ్లమీద దొర్లుతున్నాడు అని దేవమ్మ అంటుంది. గంగ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఏడుస్తుంది. ఏమైంది గంగ ఏమి మాట్లాడవేంటి వాడు నువ్వు ఏమైనా గొడవ పడ్డారా గంగాధర్ కి ఒకసారి ఇవ్వమ్మా మాట్లాడతాను అని దేవమ్మ అంటుంది.ఆయన మాట్లాడే పరిస్థితిలో లేడు అత్తయ్య నేను తర్వాత ఫోన్ చేస్తాను అని గంగ ఫోన్ కట్ చేస్తుంది.ఏమైంది గంగ ఎందుకు ఫోన్ కట్ చేసింది వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని దేవమ్మ టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode May 4 2024 Episode 202 highlights
Mamagaru Today Episode May 4 2024 Episode 202 highlights

సుధాకర్ గంగాధర్ పరిస్థితి ఏంట్రా అలా ఉంది అని దేవమ్మ అంటుంది. వాడికేమైందో నాకేం తెలుసమ్మా అని సుధాకర్ అంటాడు. వాడు ఈ పరిస్థితికి వస్తాడని నేను అనుకోలేదు రా వాడిని అలాగే వదిలేస్తావ్ ఏంట్రా అని దేవమ్మ అంటుంది. నాన్న సంగతి నీకు తెలిసిందే కదా అమ్మ అని సుధాకర్ అంటాడు. అదేంట్రా అలా అంటావ్ వాడిని వదిలేసినట్టేనా వాడు ఏం చేసినా వాడి చెల్లెలి కోసమే చేశాడు కదరా నువ్వు సిరికి సంబంధం తీసుకొచ్చావు అది మంచి సంబంధం కాదని తెలిసిపోయింది అప్పుడు మీ నాన్నగారు నీ తప్పేమీ లేదని క్షమించేశారు అలాగే గంగాధర్ విషయంలో కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నార్రా వాడిని కూడా క్షమిస్తే అందరం కలిసి ఇక్కడే ఉంటాం కదా అని దేవమ్మ అంటుంది.

Mamagaru Today Episode May 4 2024 Episode 202 highlights
Mamagaru Today Episode May 4 2024 Episode 202 highlights

గంగాధర్ నాన్న ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నాడని బయటికి వెళ్లి పోయాడు కొన్నాళ్ళకి పాండురంగ శ్రీలక్ష్మి కూడా వెళ్లిపోయారు శ్రీ లక్ష్మి పాండురంగా ఉద్యోగం చేస్తూ వాళ్ళ సంపాదనతో వాళ్లు సంతోషంగా  బతుకుతున్నారు నేనేమో నాన్న చెప్పిన మాట విని ఈ ఇంటి పెద్ద కొడుకుగా మీతోటే ఉండి అన్ని బాధ్యతలు చూసుకుంటున్నాను  వాళ్ళు లాగా నేను కూడా బయటికి వెళ్తే వసంత లాయర్ జాబ్ చేస్తుంది నేను జాబ్ చేస్తూ మేము పిల్లలు సంతోషంగా ఉండే వాళ్ళం  అని సుధాకర్ అంటాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది వాడికి నువ్వు అన్నయ్య కదా నీకు బాధ్యత లేదా అని దేవమ్మ అంటుంది. అమ్మ అన్నయ్యగా నాకు బాధ్యత వాడి మీద ప్రేమ ఉంది కానీ నాన్న మాట కాదని నేను అక్కడికి వెళ్లి వాడితో మాట్లాడలేనమ్మ నాన్న ఏం చెప్తే నేను అదే చేస్తాను నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అని సుధాకర్ వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode May 4 2024 Episode 202 highlights
Mamagaru Today Episode May 4 2024 Episode 202 highlights

గంగ ఏడుస్తూ గంగాధర్ ఎప్పుడు లేస్తాడాని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ సార్ ఫోన్ చేసి గంగ గంట సేపు అని వెళ్లావు ఇంకా రాలేదు అని వాళ్ళ హెచ్ఎం సార్ అంటాడు.  సార్ అని గంగ ఇబ్బంది పడుతుంది. నువ్వేం చెప్పకు గంగ అర్జెంటు మీటింగ్ ఉంది నువ్వు త్వరగా వచ్చెయ్ అని వాళ్ళ సార్ అనడంతో గంగ మొహం కడుక్కొని ఆఫీస్ కి బయలుదేరుతుంది..

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu