Karthikadeepam: కార్తీక్ కోసం దీప హైరానా… గతం గుర్తుకు వచ్చిందని కార్తీక్ దీపకు చెబుతాడా..???

Published by
Deepak Rajula

Karthikadeepam October 13 today episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1482ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 14న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. గత ఎపిసోడ్ లో కార్తీక్ కు గతం గుర్తుకు వస్తుంది.. రేపు డిశ్చార్జ్ అయి వెళ్లిపోవచ్చు అని డాక్టర్ చెబుతాడు.

గతాన్ని తలుచుకుంటూ బాధ పడుతున్న కార్తీక్ :

Karthika Deepam

ఇక కార్తీక్ గతంలో జరిగిన విషయాలు అన్ని తెలుసుకుని దీపను తలుచుకుని బాధ పడతాడు. నా వల్ల పాపం దీప ఎన్ని బాధలు అనుభవించిందో అని మనసులోనే క్రుంగి పోతాడు.అసలు వారణాసికి నువ్వు బతికి ఉన్నావని తెలియకపోతే ఇక్కడ ఏమి చేస్తున్నాడు. మమ్మీ, డాడీ, పిల్లలు ఏమి అయ్యారు..? ఆరోజు ఆక్సిడెంట్ లో నువ్వు కూడా నాతోనే ఉన్నావ్ కదా. మరి నేను ఎలా ఆ మోనితకు చిక్కాను అని బాధపడుతూ ఇదంతా జరగడానికి ఆ మోనితే కారణం అంటూ అనుకుంటాడు..

మోనిత ఏడుపు నిజమేనా?

Monitha tension about karthik

సీన్ కట్ చేస్తే మోనిత కార్తీక్ ఫోటో దగ్గర నిలబడి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. నన్ను ఎలా వదిలి వెళ్లిపోవాలని అనిపించింది కార్తీక్ అంటూ ఏడుస్తుంది.మోనిత ఏడుపు విని బోటిక్ లో ఉన్నవాళ్లు అయ్యో మేడం ఏసుస్తున్నారే అంటూ ఓదార్చడానికి మోనిత దగ్గరకు వెళ్ళబోతుంటే అందులో ఒకావిడ ఆగండి మేడం నిజంగానే ఏడుస్తుందో లేకపోతే ఎవరికన్నా వినిపించాలని ఏడుస్తుందో మనకి ఎందుకు వచ్చిన గోల అని అనడంతో అందరు మోనితను చూస్తూ గుమ్మం దగ్గరే ఆగిపోతారు.ఇక సౌర్య మాత్రం మోనిత గురించే ఆలోచిస్తుంది.ఎందుకు మోనిత ఆంటీ అబద్దం చెప్పింది… అమ్మ నాన్న బతికే ఉన్నారా అంటూ ఆలోచనలో పడుతుంది.అలాగే నిన్న రాయి పెట్టిన కొట్టిన వ్యక్తి ఎలా ఉన్నారో ఏంటో అని బాధ పడుతుంది.

కార్తీక్ కోసం దీప ఆవేదన :

Deepa crying

మళ్ళీ సీన్ దీప దగ్గర ఓపెన్ అవుతుంది. డాక్టర్ బాబు కనిపించడం లేదు అని దీప ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ అన్నయ్య, వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా దీపను ఓదార్చుతూ ఉంటారు. ఆ మోనిత ఏదో చేసి ఉంటుందని దాని సంగతి తెలుస్తా అంటూ ఉంటుంది.అదే సమయానికి దుర్గ వచ్చి దీపమ్మ కార్తీక్ సార్ ఎక్కడ ఉన్నారో ఆ మౌనిత కూడా తెలియదు.కార్తీక్ సార్ కనిపించడం లేదని రాత్రి నుంచి ఏడుస్తూనే ఉంది అని దుర్గ చెప్తాడు. ఆ మౌనితను నమ్మటానికి వీల్లేదు దుర్గా అని దీప అంటుంది.దీప ఎవరు ఏమి చెప్పినా వినకుండా డాక్టర్ బాబును నేనే వెతుకుంటా అని చెప్పి బయటకు హడావుడిగా వస్తుంది.

గతం గుర్తుకువచ్చిందని కార్తీక్ దీపకు చెబుతాడా..?

Karthik came

ఇంతలో కార్తీక్ ఎదురుపడతాడు.కార్తీక్ ని చూసి దీప సంతోషంగా డాక్టర్ బాబు మీరు క్షేమంగానే ఉన్నారా అని అంటుంది.కార్తీక్ తలకు తగిలిన గాయాన్ని చూసి ఏంటి డాక్టర్ బాబు తలకి పెద్ద గాయం అయింది. ఏమైంది?ఏంటి అని కంగారుపడుతూ ఉంటుంది.ఏం లేదు వంటలక్క ఇప్పుడు బానే ఉన్నాను చిన్న యాక్సిడెంట్ జరిగింది అని చెప్తాడు.ఇక డాక్టర్ అన్నయ్య,దుర్గా వచ్చి ఏంటి కార్తీక్ సార్ ఏమైంది అని అడిగితే ఏం లేదులే దుర్గా చిన్న యాక్సిడెంట్ అని చెప్తాడు.మనసులో మాత్రం దీపా నిన్ను దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడాలని ఉంది అనుకుంటూ ఇప్పుడే నాకు గతం గుర్తొచ్చిందని ఎవరికీ చెప్పను మౌనిత వల్ల నీకు ఎప్పటికైనా ప్రాణాపాయం ఉంటుంది.ఆ మౌనిత సంగతి ఏంటో ముందు తేల్చుకున్న తర్వాతే నీకు నిజం చెప్తాను అని మనసులో అనుకుంటాడు. ఇక దీప వచ్చి డాక్టర్ బాబు రండి కూర్చోండి అని కుర్చీ వేసి మంచినీళ్లు తీసుకొని వచ్చి తాగమని చెప్తుంది.ఇక కార్తీక్ మోనిత వచ్చేసిందా నా కోసం అక్కడే ఉందా అని అంటే రాత్రే వచ్చేసింది అంటాడు దుర్గ.సరే నేను ఇంటికి వెళ్తాను అని కార్తీక్ అంటాడు.వంటలక్కఇంటి దాక తోడు వస్తావా అని అనడంతో దీప కూడా కార్తీక్ కు తోడుగావెళ్తుంది.

మోనితపై సీరియస్ అయిన కార్తీక్ :

Monitha scolds deepa

వీళ్ళు వెళ్లే సరికి మోనిత పోలీసులతో కార్తీక్ ఫోటో పంపాను కాస్త వెతికించండి అంటూ మాట్లాడుతూ ఉంటుంది.ఇంతలో కార్తీక్ వచ్చి ఫోన్ తీసుకుని నేను ఇంటికి వచ్చేసాను అని చెప్తాడు.కార్తీక్ ను చూసిన మోనిత వచ్చేసావా కార్తీక్ నీ కోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా.అయినా అలా ఎలా నన్ను వదిలి వెళ్ళిపోతావ్ కార్తీక్ అంటూ ఏడుస్తుంది.తలపై ఉన్న దెబ్బ చూసి ఏమైంది అని కంగారుగా అడుగుతుంది.చిన్న దెబ్బ తగిలిందిలే అంటాడు.ఇక కార్తీక్ పక్కనే ఉన్న దీపను చూసిన మోనిత నువ్వెంటే ఇక్కడ అంటూ దీపపై మండి పడుతుంది.దీపను తిట్టడం తట్టుకోలేని కార్తీక్ మోనితపై అరుస్తాడు.వంటలక్క ఏమి చేసిందని అరుస్తున్నావ్ అంటాడు.దీపను వెళ్ళమని చెప్తాడు కార్తీక్.. దీప వెళ్ళబోతుంటే వంటలక్కా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు.ఏంటి కార్తీక్ ఆ దీప మీద అంత ఇంట్రెస్ట్ చుపిస్తున్నావ్ అని గోడవ చేస్తుంది. ఇక కార్తీక్ కూడా మోనితపై అరుస్తాడు.

మోనితను ఒక ఆట ఆడుకుంటున్న దుర్గా :

Durga entry

అంతలో దుర్గ వచ్చి కార్తీక్ సార్ ఎక్కడికి వెళ్లిపోయారు అని ఏమి తెలియనట్టు అడుగుతాడు. ఇక మోనిత ఏంట్రా నీకు ఇక్కడ ఏమి పని వెళ్ళిపో అని అరుస్తుంది. ఏంటి మోనిత అలా అంటావ్ రాత్రి నీ బ్యాగ్ నా దగ్గర మర్చిపోయావ్ అది ఇవ్వడానికి వచ్చాను అంటాడు. ఇక కార్తీక్ ఏంటి వనిత నీ బ్యాగ్ అతని దగ్గర మర్చిపోవడం ఏంటి అని అనుమానంగా అంటాడు. ఇక మౌనిత మాత్రం తెల్ల మొఖం వేసి అలానే చూస్తూ ఉంటుంది. నేను చెప్తాను కార్తిక్ సార్ అంటూ రాత్రి మీరు కనిపించకపోయేసరికి మౌనిత నాతో పాటు వచ్చింది అని చెప్తాడు. ఏంటి మోనిత రాత్రి అంతా దుర్గతోనే ఉన్నావా అంటూ కోపంగా చూస్తూ అడుగుతాడు. ఇక మౌనిత మాత్రం ఏమి మాట్లాడాలో తెలియక షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండడంతో aఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో దుర్గా మౌనిత దగ్గరికి వచ్చి నువ్వు రౌడీలను పెట్టి దీపను చంపటానికి చూశావు ఆ విషయం నాకు తెలుసు అయినా మనిద్దరి మధ్య అడ్డుగా ఉన్నది ఈ దీప కాదు కదా కార్తీక్ కదా అంటే నువ్వు కార్తీక్ సార్ ని చంపడానికి రౌడీలను పంపావ అనడంతో మోనిత షాక్ అవుతుంది.

This post was last modified on October 14, 2022 3:12 pm

Deepak Rajula

Recent Posts

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక‌రు. ప్రముఖ వ్యాపార‌వేత్త మ‌రియు… Read More

May 9, 2024

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More

May 9, 2024

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong Backing from Domestic Family Offices and UHNIs

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More

May 9, 2024

Millennials dominate 60% of Investor Base into Fractional Investments: Grip Invest Report

Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More

May 9, 2024

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More

May 9, 2024

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More

May 9, 2024

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

Sai Pallavi: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More

May 9, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More

May 9, 2024

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More

May 9, 2024

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More

May 9, 2024

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More

May 9, 2024

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More

May 9, 2024

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More

May 9, 2024

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024