బండి సంజయ్ కొత్త బిక్షగాడు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. నాలుగుసార్లు ఓడిపోయావని జాలి తో కనికరించి , కరీంనగర్ ప్రజలు గెలిపించారని తెలిపారు. `సంజయ్…ఇదే నీకు మొదటిది చివరి పదవి. గంగా జమున తహజిబ్ గా ప్రశాంతంగా..ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టకు. సీఎం కేసిఆర్ ను జైల్లో పెట్టే దమ్ముందా నీకు ?! తెలంగాణ ప్రజలు కొడితే నువ్వు మానేరు డ్యాములో పడతవు . నీకు దమ్ముంటే కేంద్రం నుంచి నీళ్ల వాటా తీసుకురా . మిషన్ భగీరథ కు, మిషన్ కాకతీయ కు నిధులు తీసుకురా. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు డబ్బులు తెచ్చావా? నువ్వు ఏమి చేశావో.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమి తెచ్చావో చెప్పగలవా?! లేదంటే నిన్ను కరీంనగర్ ప్రజలే ఉరికిచ్చి కొడతారు. మిమ్మల్ని గెలిపించిన దుబ్బాకలోనే మిమ్మల్ని ఉరికించి కొడతారు “ అని విరుచుకు పడ్డారు.
బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. “కేసీఆర్ గురించి మాట్లాడితే, పెద్ద వాడివి కాలేవు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరని గుర్తు పెట్టుకోండి . కేసీఆర్ మీలాగా అల్లాటప్పా లీడర్ కాదు . తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టీ, చావు నోట్లో తల పెట్టీ, తెలంగాణ తెచ్చారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని అడ్డుపెట్టుకుని మత కలహాలు సృష్టించాలని సూచిస్తున్నావు “ అంటూ ఆరోపించారు.
అయితే, మంత్రి ఎర్రబెల్లి విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బండి సంజయ్ నమ్మినబంటు అనే పేరున్న వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఈ మేరకు ఎర్రబెల్లిపై విరుచుకుపడ్డారు. “ మంత్రి పదవి ఎన్నడు ఊడుతుందో అన్న భయంతో బీజేపీ పై ఎర్రబెల్లి విమర్శలు చేస్తున్నారు. వరంగల్ లో వరదలొచ్చి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ఎక్కడ పోయావ్ ,మంత్రి పదవి కాపాడుకోవడానికి KTR సంకలో పిల్లిలా తిరుగుతున్నావు. పూటకో పార్టీ మార్చే నువ్వు బీజేపీ గురించి బండి సంజయ్ గురించి మాట్లాడే అర్హత లేదు. కేసిఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పదవుల కోసం పార్టీలో చేరిన చరిత్ర నీది. 6 సార్లు ఎమ్మెల్యే గా , ఒకసారి ఎంపి గా గెలిచి వరంగల్ కి ఏం ఒరగబెట్టినవో ఒక్క ముక్కైన చెప్పగలవా…? నాలుగుసార్లు ఒడావు అని సంజయన్నని అనేముందు 6 సార్లు గెలిచి నువ్వు ఒరగబెట్టింది ఏంటో చెప్పు….“ అని మండిపడ్డారు.
ప్రాజెక్టుల DPR పంపనిదే జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదన్న కనీస అవగాహన లేకుండా మంత్రివి ఎలా అయ్యావు ఎర్రబెల్లి అని ప్రశ్నించారు. “MIM ప్రేమలో పడి కారు స్టీరింగ్ ఒవైసీ ల చేతిలో ఉంచి … నిర్మల్ లో హిందువుల ఇళ్లను కాలపెట్టినప్పుడు…15 నిమిషాల సమయం ఇస్తే హిందువులు లేకుండా చేస్తా అన్నప్పుడు … వరంగల్ లో పూజారిని పట్టపగలే దారుణంగా హత్య చేసినప్పుడు ఎక్కడపోయింది నీ సెక్యులరిజం… మీరు చేస్తే సెక్యులరిజం మేము చేస్తే మతతత్వమా….?“ అని ప్రశ్నించారు.
This post was last modified on December 18, 2020 9:03 pm
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More