ఆర్టీసీ బకాయిలపై పూర్తి నివేదిక ఇవ్వండి!

Published by
Mahesh

హైదరాబాద్: హుజూర్ నగర్ నియోజకవర్గానికి వంద కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి… రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చేందుకు రూ. 47 కోట్లు కేటాయించలేదా అని హైకోర్టు ప్రశ్నించింది. కార్మికుల సమ్మె, బకాయిల చెల్లింపు తదితర అంశాలపై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది. బకాయిల వివరాలను ఈ నెల 31లోపు నివేధించాలని ఆర్టీసీ ఇంఛార్జ్‌ ఎండీని హైకోర్టు ఆదేశించింది. కార్మికులను సమ్మె విరమించాలని ఆదేశించలేమని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. శుక్రవారం(నవంబర్ 1) జరగబోయే విచారణకు ఆర్టీసీ ఫైనాన్స్ సెక్రటరీ, ఎండీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు సూచించింది. జీహెచ్ఎంసీ రూ.335 కోట్లు చెల్లించిందా ? లేదా? అనే విషయాన్ని తెలపాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. ప్రభుత్వం చెల్లించిన రూ.4,253 కోట్లలో రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయా ? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వివరాలు పరిశీలించకుండానే ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి తమకు నివేదిక సమర్పించారని హైకోర్టు ఆక్షేపించింది.

అంతకుముందు కోర్టులో సమ్మెపై ప్రభుత్వం, కార్మిక సంఘాలు మధ్య వాడీవేడీ వాదనలు జరిగాయి. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రూ. 1099 కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నాయని అడ్వకేట్ జనరల్ వాదించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు… కార్మికుల నాలుగు ప్రధాన డిమాండ్లు తీర్చేందుకు అవసరమైన రూ. 47 కోట్లు ఇస్తారా ? ఇవ్వరా ? సూటిగా చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఇందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. అయితే దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి చురకలు వేసింది. హుజూర్ నగర్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ కురిపించిన వరాలను పరోక్షంగా ప్రస్తావించిన హైకోర్టు…’ఒక్క నియోజకవర్గానికి రూ. 100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం… రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చేందుకు రూ. 47 కోట్లు కేటాయించలేదా ?, కేవలం ఒక్క నియోజకవర్గ ప్రజలే ముఖ్యమా?, మొత్తం ఆర్టీసీ బస్సుల సంఖ్య ఎంత? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

బస్సులు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 75 శాతం బస్సులు తిరుగుతున్నాయని కోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అయితే, ఇప్పటికీ మూడో వంతు బస్సులు కూడా తిరగడం లేదని హైకోర్టు మండిపడింది. బస్సులు లేక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటం లేనప్పుడు సెలవులను ఎందుకు పొడిగించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారులు వాస్తవాలను మరుగునపెడుతున్నారని, నిజాలను తెలివిగా దాస్తున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిల్లో ఏపీ 58, తెలంగాణ 42 శాతం చెల్లించాల్సి ఉంటుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. విభజన తర్వాత ఆర్టీసీ ఆస్తుల పంపకం జరగలేదన్నారు. ఆస్తులు పంపకం ఎందుకు జరగలేదని కోర్టు ప్రశ్నించగా… అది కేంద్రం పరిధిలోని అంశమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.

This post was last modified on October 29, 2019 5:19 pm

Mahesh

Recent Posts

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 10, 2024

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More

May 9, 2024

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More

May 9, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More

May 9, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024