శాండ్ పోర్టల్ హ్యాక్ వెనుక ఎవరున్నారు ?

Published by
Mahesh

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఏపీలో ఇసుక వెబ్‌సైట్‌ను బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ హ్యాక్ చేసిందని.. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించిందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బ్లూ ఫ్రాగ్‌ ఆఫీసులో తనిఖీలు చేసిన సీఐడీ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. అయితే, ప్రభుత్వ ఇసుక వెబ్‌సైట్‌ను హ్యాక్ వ్యవహారం వెనుక టీడీపీ హస్తం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది.

ఏపీలో పారదర్శకంగా ఇసుక పంపిణీ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన మనశాండ్ పోర్టల్ హ్యాక్ చేసి, కృతిమ కొరత సృష్టించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ఇసుక సరఫరాకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసినట్టు విశాఖ నగరంలోని బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీ సంస్థపై ఫిర్యాదులు రావడంతో సీఐడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సర్వర్‌ని హ్యాక్ చేసి కోడ్ ద్వారా ఇసుక అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. కంపెనీ సర్వర్లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంత ఇసుకను బ్లాక్ చేశారు? ఎవరికి ఆర్థిక ప్రయోజనాలు అందాయి? ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లింది? అనే దానిపై ఆరా తీస్తోంది. నిజానికి ఇసుక డంపింగ్ యార్డుల్లో ఉన్నప్పటికీ వెబ్ సైట్లలో మాత్రం అవి కనిపించట్లేదు. దీంతో కావాలని కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు తేల్చారు. బ్లూ ఫ్రాగ్ సంస్థ గతంలో కూడా డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కొంది.

ఏపీలో కొత్త ఇసుక విధానానాన్ని అమల్లోకి తెచ్చిన సీఎం జగన్.. మన శాండ్ పోర్టల్ ప్రారంభించారు. దాని ద్వారా ప్రజలు ఆన్‌లైన్‌లో ఇసుక కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. అందుకోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను రూపొందించారు. ఆ పోర్టల్‌ను బ్లా ఫ్రాగ్స్ సంస్థే నిర్వహిస్తోంది. ఐతే సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులు సైట్‌ను హ్యాక్ చేసి అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీని వెనక ఎవరున్నారని తేల్చే పనిలో ఉంది సీఐడీ.

టీడీపీ హయాంలో ఇసుక సరఫరాకు సంబంధించి మన శాండ్‌ పేరుతో యాప్‌ను బ్లూ ఫ్రాగ్‌ సంస్థ నిర్వహించేది. సరిగ్గా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేశారనే ఆరోపణలపై బ్లూ ఫ్రాగ్‌పై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. ఇదిఇలా ఉంటే ఏపీలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడేలా మాజీ సీఎం చంద్రబాబు కుట్ర పన్నారని వైసీపీ ఆరోపించింది. తనకు ఎంతో సన్నిహితంగా ఉన్న విశాఖ బ్లూ ఫ్రాగ్ కంపెనీతో ఇసుక సరఫరాకు సంబంధించిన ప్రభుత్వ వైబ్ సైట్ ను హ్యాక్ చేయించారని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. ఇసుక అందుబాటులో వస్తున్న సమయంలో కావాలని వెబ్ సైట్ ను హ్యాక్ చేయించి కొరత ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.

మరోవైపు బ్లూ ఫ్రాగ్ సంస్థ నారా లోకేశ్ సన్నిహితుడి కుటుంబీకులకు చెందినదని ఆరోపణలు వినిపించాయి. అయితే, ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో శాండ్ పోర్టల్ హ్యాక్ వెనుక ఎవరున్నారనే దిశగా సీఐడీ దర్యాప్తు చేస్తోంది.

This post was last modified on November 15, 2019 10:42 am

Mahesh

Recent Posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More

May 8, 2024

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More

May 8, 2024

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More

May 8, 2024

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More

May 8, 2024

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More

May 8, 2024

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More

May 8, 2024

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More

May 8, 2024

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More

May 8, 2024

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

వైసీపీ అగ్ర‌ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కోట‌రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. పుంగ‌నూరు స‌హా.. పీలేరు,… Read More

May 8, 2024

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

మెగా కుటుంబంలో భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం.. ఆయ‌న పోటీ చేస్తున్న ఉమ్మ‌డి తూర్పు… Read More

May 8, 2024