ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ని పక్కన పెట్టినా… తమ ఆందోళనల విషయంలో మాత్రం కార్మికులు వెనక్కి తగ్గట్లేదు. సమ్మెలో భాగంగా నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఆయన నివాసంలోనే దీక్షకు దిగారు. దీక్షను దృష్టిలో పెట్టుకుని ఉదయమే పోలీసులు అశ్వత్థామరెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. బీఎన్ రెడ్డి నగర్ లో అశ్వత్థామరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆయన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. పూలమాల ధరించి దీక్షను చేపట్టారు. ఆయనతోపాటు పలువురు మహిళలు కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన ఇంటి దగ్గర పోలీసులను భారీగా మోహరించారు.
ప్రభుత్వ చర్చలకు పిలిచే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని ఆర్టీసీ జేఏషీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అర్ధరాత్రి తన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులకు భయభ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. తనను బలవంతంగా అరెస్టు చేసినా దీక్ష ఆగదని తెలిపారు. సీఎం విధానాలతోనే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. మరో మిలియన్ మార్చ్, మరో సాగరహారం కూడా చేపడతామన్నారు. ప్రజలను, కోర్టులను ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. చర్చలతో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. జేఏసీ నేతలను అరెస్టు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని, పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసినా దీక్ష కొనసాగిస్తామని చెప్పారు.
మరోవైపు ఆర్టీసీ జేఏసీ నేతల దీక్ష పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ నెలకొంది. దీక్షకు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా కార్మికులు బస్ రోకో, అన్ని డిపోల ఎదుట ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ పరిధిలోని బస్ డిపోల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇక జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. జేఏసీ నేతలు దీక్షకు దిగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఆర్టీసీ కార్మికులు ఓ మెట్టు దిగడంతో ప్రభుత్వం చర్చలకు తమను ఆహ్వానిస్తుందని జేఏసీ భావించారు. మిగిలిన 25 డిమాండ్లపై చర్చించాలని కోరారు. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలూ ఇవ్వలేదు. ఇదిఇలా ఉంటే.. ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుంది ? అనేది ఉత్కంఠగా మారింది.
This post was last modified on November 16, 2019 1:17 pm
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More