AP New Cabinet: జగన్ అంటే అంతే..! కొత్త మంత్రులకు ఎవరికి ఎందుకు..!?

Published by
Srinivas Manem

AP New Cabinet: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన రెండవ కేబినెట్ ను ఎవరి ఊహలకు అందని విధంగా నేతలను ఎంపిక చేసుకున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలను ఫేస్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో తన ఎలక్షన్ జట్టును చాలా జాగ్రత్తగా కూర్పు చేసుకున్నారు. అయితే ఆయా నేతలను తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు..వారినే ఎంపిక చేసుకుని మంత్రి పదవులు ఇవ్వడానికి దోహదపడిన కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

AP New Cabinet new ministers

విడతల రజని

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుండి తొలి సారిగా ఎమ్మెల్యే అయ్యారు. తొలి సారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమెకు జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు అనేక కారణాలు దోహదం చేశాయి అని చెప్పవచ్చు. ఉన్నత విద్యావంతురాలు, వాక్ చాతుర్యం ఉంది. బీసీ మహిళ. స్టాఫ్ వేర్ ఉద్యోగం చేస్తూ అమెరికాలో స్థిరపడిన ఆమె తన ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి చిలకలూరిపేట నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికలకు మూడు నెలల ముందు వైసీపీలో చేరారు విడతల రజని. పార్టీ బలానికి తోడు వ్యక్తిగత ఇమేజ్ ఉండటంతో రజని అయితే  చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలుస్తుంది అని వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పడంతో జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు. ఆమెకు రాజకీయ గురువు అయిన టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావుపై విజతల రజని ఘన విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ఆమె సోషల్ మీడియాపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ వైసీపీ శ్రేణులను దగ్గర చేసుకున్నారు. సోషల్ మీడియాకు విపరీతంగా ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఓ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇవన్నీ ఆమెకు మంత్రిపదవి వరించడానికి కారణాలుగా పేర్కొనవచ్చు.

 

Read More: CM YS Jagan: సామాజిక సమతుల్యం .. జగన్ మైండ్ వర్క్ సూపర్..!!

అంబటి రాంబాబు

సీనియర్ నాయకుడు. 1989 లో రేపల్లె నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తొలి సారి ఎమ్మెల్యేగా అడుగు పెట్టారు. అప్పట్లోనే పబ్లిక్ అకౌంట్స్ కమిటి సభ్యుడిగా పని చేశారు. వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి నాటి స్పీకర్ కోడెల శివప్రసాద్ పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. మంచి వాగ్దాటితో ప్రతిపక్షాన్ని వ్యంగ్యంగా, సీరియస్ గా మాట్లాడే సమర్ధత ఆయనకు ఉంది. పార్టీ అధికార ప్రతినిధిగా విపక్షంపై ఎదురుదాడి చేయడంలో వైసీపీలో ముందు వరుసలో ఉండే వారు. అంబటి సమర్థతను గుర్తించిన జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

 

ఆర్కే రోజా

టీడీపీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసినా ఆ పార్టీలో ఎమ్మెల్యే కాలేదు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరిన ఆర్ కే రోజా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు చిత్తూరు జిల్లా నగరి నుండి ఎమ్మెల్యే గా ఎన్నికైయ్యారు. తన వాగ్దాటితో చంద్రబాబు, లోకేష్, టీడీపీని ఘాటుగా విమర్శించే వారు. సీఎం జగన్ పరిపాలనా తీరును పొగడ్తలతో ముంచెత్తేవారు. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా గుర్తింపు పొందారు.గడచిన అసెంబ్లీలో రోజా వాగ్దాటితో అప్పటి అధికార పక్షం టీడీపీపై ఆరోపణలకు, విమర్శలు చేయడంతో ఏకంగా ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. ఆమె పార్టీకి చేసిన సేవలకు గానూ మొదటి దఫానే మంత్రి పదవి వరిస్తుందని అందరూ భావించారు. నాడు సామాజిక సమీకరణలో రోజాను జగన్ పక్కన పెట్టాల్సి వచ్చింది. పార్టీ పట్ల ఆమె డెడికేషన్ యే నేడు మంత్రి పదవి రావడానికి కారణం అయ్యింది అని చెప్పవచ్చు.

ధర్మాన ప్రసాదరావు

సీనియర్ నాయకుడు. గత కాంగ్రెస్ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మంచి వక్తగా పేరుంది. తొలి నుండి టీడీపీ వ్యతిరేక భావజాలంతో శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు చేసిన ఆయనకు బీసీ వర్గాల నేతగా జిల్లాలో మంచి పట్టు ఉంది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రీసెంట్ గా శాసన, న్యాయ వ్యవస్థ పరిధులపై చర్చకు అసెంబ్లీలో ప్రతిపాదించి అనేక విషయాలను ప్రస్తావించి జగన్ మనసును గెలుచుకున్నారు. సీనియర్ నేత అయిన ధర్మాన ప్రసాదరావుకే తొలి సారి మంత్రివర్గంలోనే తీసుుకంటారని అనుకున్నారు. కానీ ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాసుకు జగన్ అవకాశం ఇవ్వడంతో నాడు సాధ్యపడలేదు. ఇప్పుడు ధర్మాన కృష్ణదాసును పక్కన పెట్టి ప్రసాదరావుకు అవకాశం కల్పించారు.

గుడివాడ అమరనాథ్

వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీ లో చురుకైన నాయకుడుగా ఉన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన అమరనాథ్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పని చేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరుంది. మాజీ ఎంపి గుడివాడ గురునాథరావు కుమారుడుగా రాజకీయాల్లోకి వచ్చిన అమరనాథ్ బీటెక్ పట్టభద్రుడు, కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ లో కార్పోరేటర్ గా, విశాఖ జిల్లా ప్రణాళికా సంఘం సభ్యుడుగా బాధ్యతలు నిర్వహించారు. 2011 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ చార్జిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుండి తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. పార్టీలో మొదటి నుండి అంకితభావంతో పని చేసినందున అమరనాథ్ కు జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు భావించవచ్చు.

దాడిశెట్టి రాజా

తూర్పు గోదావరి జిల్లాలో మంచి పట్టు ఉన్న నేతగా పేరుంది. 2010లో వైసీపీలో చేరిన దాడిశెట్టి రాజా 2014, 2019 ఎన్నికల్లో తుని నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీడీపీ లో సీనియర్ నేత అయిన యనమల రామకృష్ణుడు కుటుంబాన్ని వరుసగా ఓడించి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పార్టీలో కీలకంగా పని చేయడంతో పాటు మొదటి నుండి జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఈ కారణాల రీత్యా దాడిశెట్టి రాజాకు జగన్ అవకాశం కల్పించారు.

కారుమూరి నాగేశ్వరరావు

సీనియర్ నాయకుడు. 2014 నుండి పార్టీలో ఉన్నారు. పార్టీ ఆదేశాల మేరకు 2014 ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం తణుకు వదిలిపెట్టి దెందులూరు వెళ్లి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో తణుకు నుండి పోటీ చేసి విజయం సాధించారు. జగన్ కు నమ్మిన బంటుగా ఉండటంతో పాటు బీసీ (యాదవ) సామాజికవర్గ సమీకరణాలు కలిసి రావడంతో ఆయనకు మంత్రివర్గంలోకి జగన్ తీసుకుని ఉండవచ్చు.

జోగి రమేష్

యువజన కాంగ్రెస్ నాయకుడుగా రాజకీయ అరంగ్రేటం చేసిన జోగి రమేష్ తన నియోజకవర్గం మైలవరం కాకుండా పెడన నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచారు. 2012 లో వైసీపీలో చేరి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేసిన జోగి రమేష్ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి కాగిత కృష్ణప్రసాాద్ పై గెలిచారు. చంద్రబాబు, టీడీపీ పై ఘాటు విమర్శించేవారు. మంచి సబ్జెక్ట్ ఉంది. ప్రతిపక్షంపై దూకుడుగా వ్యవహరించే మనస్థత్వం, వైసీపీ పట్ల కంకణబద్దుగా, జగన్ కు విధేయుడుగా పని చేయడంతో పాటు బిసీ (గౌడ) సామాజిక సమీకరణలో అవకాశం దక్కింది అని చెప్పవచ్చు.

రాజన్న దొర

రాజన్న దొర సీనియర్ శాసనసభ్యుడు, విజయనగరం జిల్లా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం సాలూరు నుండి 2009 లో తొలి సారి ఎమ్మెల్యే గా ఎన్నికైన రాజన్న దొర 2014 లో వైసీపీలో చేరారు. ఆ తరువాత వరుసగా 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. విద్యాధికుడైన రాజన్న దొర ఎస్టీ వర్గాల్లో మంచి పట్టు ఉంది. గిరిజన సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ద చూపే రాజన్న దొర అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. పార్టీ పట్ల అంకిత భావంతో పని చేయడం, వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నిక కావడం, సామాజికవర్గ కూర్పు కలిసి రావడంతో జగన్ రాజన్న దొరకు అవకాశం కల్పించినట్లు చెప్పుకోవచ్చు.

ముత్యాలనాయుడు

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం నుండి బూడి ముత్యాలనాయుడు 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యే గా ఎన్నికైయ్యారు. గ్రామ సర్పంచ్ గా, ఎంపీటీసీ, ఎంపిపి, జడ్పీటీసీగా పని చేసిన ముత్యాలనాయుడు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. 2014 వైసీపీ తరపున ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు నాడు అధికార టీడీపీలో చేరినా ముత్యాలనాయుడు పార్టీ పట్ల, జగన్ పట్ల విధేయతతో ఉన్నారు. రెండు సార్లు వరుసగా గెలవడం, నియోజకవర్గంలో గట్టి నాయకుడుగా గుర్తింపు, సామాజిక నేపథ్యంలో కలిసి రావడంతో జగన్ అవకాశం కల్పించారు.

మేరుగ నాగార్జున

ప్రజా ఉద్యమాల ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మేరుగ నాగార్జున విద్యాధికాడు. వైఎస్ఆర్ హయాంలోనే గుంటూరు జిల్లా వేమూరు నుండి పోటీ చేశారు. వైఎస్ఆర్ మరణానంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో 2012లో చేరి ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు. 2019 ఎన్నికల్లో వేమూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచిన నాగార్జున తన వాగ్దాటితో చంద్రబాబుపై, టీడీపీపై గట్టిగా విమర్శలు, ఆరోపణలు చేసే వారు. తొలి నుండి పార్టీకి అంకితభావం, విధేయుత, ప్రజా ఉద్యమ నేపథ్యం, సామాజిక సమీకరణ కలిసి రావడంతో జగన్ మేరుగు నాగార్జునకు అవకాశం కల్పించారు.

కాకాని గోవర్థన్ రెడ్డి

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన కాకాణి గోవర్థన్ రెడ్డి 2006లో జడ్పీటీసీ గా ఎన్నికైయ్యారు. ఆ తరువాత నాటి సీఎం వైఎస్ఆర్ సహకారంతో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ మరణానంతరం వైసీపీలో చేరిన కాకాణి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో సర్వేపల్లి నుండి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు వైసీపీ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు గోవర్థన్ రెడ్డి. తొలి సారి మంత్రి వర్గంలోనే ఆయనకు అవకాశం కల్పిస్తారని భావించారు. కానీ సామాజిక సమీకరణల్లో సాధ్య పడలేదు. పార్టీ పట్ల విధేయత, సీనియారిటీ లను పరిగణలోకి తీసుకుని సారి జగన్ అవకాశం కల్పించారని భావించవచ్చు.

ఉషశ్రీ చరణ్

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన బీసీ (కురుబ) మహిళ ఉషశ్రీ చరణ్ విద్యాధికురాలు. 2012 లో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2012 లో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో 2019 ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత తన దైన శైలిలో దూసుకువెళుతూ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. తొలి సారి ఎమ్మెల్యే అయినా అసెంబ్లీ ఆమె మాటతో అందరి దృష్టిని ఆకర్షించారు. సామాజిక కోణం, ప్రజా సమస్యల పరిష్కారంలో అంకితభావంతో పని చేయడం, పార్టీ పట్ల విధేయత కారణంగా ఆమెకు జగన్ అవకాశం ఇచ్చారు.

 

This post was last modified on April 11, 2022 2:42 pm

Srinivas Manem

Recent Posts

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More

May 10, 2024

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

ఏపీలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ ఆవేశంగా ప్ర‌సంగాలు దంచి కొట్టారు. త‌మ‌ది కాని ప్ర‌భుత్వం.. ఎక్క‌డ ఉన్నా .. ఆయ‌న‌కు, బీజేపీ… Read More

May 10, 2024

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

ఎవ‌రైనా వ్య‌క్తిని అడాప్ట్ చేసుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హ‌ద్దులు.. ప‌ద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More

May 10, 2024

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More

May 10, 2024

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More

May 10, 2024

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 10, 2024

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More

May 9, 2024

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More

May 9, 2024