జగన్ మాస్టర్ మైండ్ దెబ్బ .. లోకేష్ మరో సేఫ్ ప్లేస్ వెతుక్కోవాల్సిందే(గా)..?

Published by
sharma somaraju

ముఖ్యమంత్రి కుమారుడుగా, మంత్రిగా అధికారాన్ని అనుభవిస్తూ కూడా గత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలిలో టీడీపీలోని అతిరథ మహారధులు కూడా ఓటమి పాలైయ్యారు. వారిలో నారా లోకేష్ కూడా చేరిపోయారు. అయితే ఓటమితో మనోధైర్యం కోల్పోకుండా నారా లోకేష్ మళ్లీ మంగళగిరి నియోజకవర్గం పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయడం కోసం తరచు నియోజకవర్గంలో పర్యటిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుండే పోటీ చేసి గెలిచి పార్టీ అధినేత చంద్రబాబు కు గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు నారా లోకేష్.

nara lokesh ys jagan-

 

వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గం టీడీపీకి మొదటి నుండి వీక్. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983,85 ఎన్నికల్లో మాత్రమే టీడీప అభ్యర్ధి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విజయం సాధించారు.  ఆ తర్వాత 1989 నుండి జరిగిన ఎన్నికల్లో ఒక సారి సీపీఎం, నాలుగు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు వైసీపీ గెలిచింది. అయితే 2014 ఎన్నికల్లోనూ మాత్రమే వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. ఈ కారణంతో నారా లోకేష్ రాజధాని పరిధిలోని మంగళగిరిని ఎంచుకుని 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. 5,300 ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడంతో ఆ ప్రభావంతో మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకతతో ఈజీగా గెలవవచ్చని లోకేష్ భావించి 2024లోనూ ఇక్కడ నుండి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.

nara lokesh ys jagan

 

అయితే లోకేష్ ను రెండో సారి కూడా ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీ రకరకాల వ్యూహాలను పదును పెట్టింది. అమరావతిలో తమ పట్టును నిలబెట్టుకోవడానికి, లోకేష్ ను ఓడించి మనసికంగా దెబ్బతీయడానికి జగన్మోహనరెడ్డి ద్విముఖ వ్యూహాన్ని రచించినట్లు కనబడుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన గంజి చిరంజీవిని వైసీపీలోకి చేర్చుకుని జగన్ నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్దేశించే సామాజికవర్గం చేనేత ఓటర్లు. ఈ సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేత మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అవసరమైతే నారా లోకేష్ ను ఓడించేందుకు మరో బలమైన అభ్యర్ధిని రంగంలోకి దింపడానికి వైసీపీ యోచన చేస్తుందని కూడా వార్తలు వినబడ్డాయి.

 

అంతే కాకుండా మూడు రాజధానుల కాన్సెప్ట్ ప్రభావంతో రాజధాని ప్రాంతంలో  జరుగుతున్న మైనస్ ఓట్లకు ప్రత్యామ్నాయంగా ఆర్ – 5 జోన్ లో 50 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది జగన్ సర్కార్. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన 50 వేల కుటుంబాలకు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. వీరంతా మంగళగిరి నియోజకవర్గ ఓటర్లుగా త్వరలో మార్చే ప్రక్రియను కూడా అధికార పార్టీ చేపడుతుంది. దీంతో ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు చొప్పున వేసుకున్నా లక్షకుపైగా ఓట్లు వైసీపీ ఖాతాలో పడినట్లే భావించాల్సి ఉంటుంది.

Chandra Babu

 

ఈ పరిణామాల క్రమంలో లోకేష్ ఇక్కడ ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదనే మాట ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది. వైసీపీకి మాత్రం గెలుపు నల్లేరుపై నడకే అని చెప్పవచ్చు. అందుకే లోకేష్ కు ఆ పార్టీ ప్రత్యామ్నాయ నియోజకవర్గాలను ఎంపిక చేసి ఉంచిందని అంటున్నారు. అందులో భాగంగా గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, విశాఖ టౌన్ లేదా రూరల్ లో గానీ, అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గాలను పార్టీ నేతలు పరిశీలించి ఓకే చేశారని భావిస్తున్నారు. మంగళగిరిలో పోటీ చేసి రిస్క్ తీసుకోవడం కంటే ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకుంటే బాగుంటుంది అని పార్టీ లోని సీనియర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారుట. సీనియర్ ల అభిప్రాయాన్ని చంద్రబాబు ఏకీభవిస్తున్నా లోకేష్ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

హస్తినలో బిజీబిజీగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ..ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ

This post was last modified on May 30, 2023 1:06 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

Jagadhatri April 27 2024 Episode 216: కేదార్ భయపడిపోయి జగదాత్రి చెయ్యి తన నెత్తి నుంచి తీసేస్తాడు. ఎందుకు… Read More

April 27, 2024

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  ఎలుక ఉందని భయపడిపోయిన స్వర పరిగెత్తుకొచ్చి అభి పక్కన బెడ్… Read More

April 27, 2024

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

Naga Panchami: గరుడ రాజు తన గరుడ శక్తిని ఖరాలికి ఆవాహన చేస్తాడు. కరాలి ధన్యోస్మి గరుడ రాజా అంటుంది.… Read More

April 27, 2024

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

Mamagaru: అవును వదిన ఇక్కడ ఉంటున్నామనే కానీ తింటే తినబుద్ది అవదు పడుకుంటే పడకో బుద్ధి కాదు అక్కడ ఉంటే… Read More

April 27, 2024

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

Nuvvu Nenu Prema 2024 Episode 608:  పద్మావతి గురించి విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వచ్చిన ఆర్య రేపు… Read More

April 27, 2024

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

April 27: Daily Horoscope in Telugu ఏప్రిల్ 27 – చైత్ర మాసం – శనివారం - రోజు… Read More

April 27, 2024

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప 2' మూవీ తెరకెక్కుతోంది. 2021లో వచ్చిన… Read More

April 26, 2024

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

Lok sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన… Read More

April 26, 2024

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం… Read More

April 26, 2024

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

JD Lakshminarayana: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.… Read More

April 26, 2024

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Breaking: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమను… Read More

April 26, 2024

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

Phone Tapping Case: తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితుల (మాజీ పోలీస్ అధికారులు)… Read More

April 26, 2024

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

Guppedanta Manasu April 26 2024 Episode 1060:  qదత్తత కార్యక్రమానికి వెళ్లాలి అని చెప్పాను కదా మరి ఇంకా… Read More

April 26, 2024