Devatha: రామ్మూర్తి రాధ దగ్గరకు వచ్చి అమ్మ రాధా నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు. చెప్పండి ఏంటో అని రాధ అంది. ఈ విషయం నీకు సంబంధించినది.. నీ విషయాలలో నేను కల్పించుకోకూడదు అని నాకు తెలుసు. అలా అని నేను అడగకుండా కూడా ఉండలేను. ఇది కుటుంబ గౌరవానికి సంబంధించింది అందుకే అడగాలని అనుకుంటున్నాను. ఆఫీసర్ బాబు నువ్వు ఇద్దరూ మంచివాళ్ళు. మీ ఇద్దరు గురించి నాకు తెలుసు. ఆఫీసర్ బాబు దేవి కోసం మన ఇంటికి వస్తున్నాడని నాకు తెలుసు. అలాగే మన కుటుంబాలు కూడా కలిసి ఉన్నాయి. అలా అని మీరిద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఏం బాగోలేదు అమ్మ.. మీ ఇద్దరు గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు..
నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేనమ్మ అని రామ్మూర్తి అంటాడు. ఆ బాబు దేవి కోసం వస్తున్నాడని నువ్వు అతనితో చనువుగా ఉండటం ఏం బాగోలేదు అమ్మ అని రామ్మూర్తి అంటాడు. నిన్ను ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోలేనమ్మ. నీ గురించి తప్పుగా మాట్లాడటం అంటే.. ఈ ఇంటి గురించి తప్పుగా మాట్లాడినట్టే కదా అని రామ్మూర్తి అంటాడు. ఇక ఆ మాటలకు రాధ ఉండండి నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఈ విషయాన్ని నేను మీతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఎలా చెప్పాలో అర్థం కాక ఊరుకున్నాను. ఇప్పుడు మీరే ఈ విషయం గురించి మాట్లాడారు కాబట్టి చెబుతున్నాను. ఆఫీసర్ సారు ఎవరో కాదు నా పెనిమిటి అని రాధ చెప్పేస్తుంది. ఏంటమ్మా రాధ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అని రామ్మూర్తి అంటాడు. అవును ఆఫీసర్ సారు నా మెడలో తాళి కట్టిన నా పెనిమిటి అని రాధ అంటుంది.
అంతేకాదు నా పేరు రాధ కాదు రుక్మిణి అని కూడా చెబుతుంది. రుక్మిణి అనే పేరు వినగానే రామ్మూర్తి దేవుడమ్మ వాళ్ళింట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఆ పాపకు పెట్టిన పేరు కూడా ఇదే అని అనుకుంటాడు. కచ్చితంగా రుక్మిణి ఆ ఇంటి కోడలు అని అర్థం చేసుకుంటాడు. ఇంట్లో చెన్నై కోసం నేను వచ్చాను ఇప్పుడు ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమని చంపుకోలేక ఇక్కడ నుంచి వెళ్లలేకపోతున్నాను. అలా అని నేను వెళ్ళకుండా ఉండను. జానకమ్మకి పూర్తిగా నయమైపోయాక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని రుక్మిణి అంటుంది.
అప్పుడే చిన్మయి కూడా వచ్చి అవును తాతయ్య అమ్మ చెప్పేదంతా నిజం అని చెబుతుంది. నా కోసమే అమ్మ ఇంట్లో ఉంది అని చిన్మయి చెప్పింది. నీ పెనిమిటి కళ్ల ఎదురుగా కనిపిస్తున్న కూడా మా కోసం ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే.. నువ్వు నిజంగా దేవతవి అమ్మ అంటూ రుక్మిణిని చూస్తూ దండం పెడతాడు రామ్మూర్తి. ఆఫీసర్ బాబు భార్యవి తెలిసినాక నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండద్దమ్మా వెళ్ళిపో అని రామ్మూర్తి దండం అంటాడు..
దేవి దేవుడమ్మ వాళ్ళింట్లో తెగ సందడి చేస్తూ ఉంటుంది. దేవుడమ్మను రెట్టిస్తూ మాటలు మాట్లాడటం చూసిన సత్య ఎక్కువ దేవిని చూస్తుంటే కోపం వస్తూ ఉంటుంది. కానీ తను ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. దేవి వాళ్ళ నాన్న మంచివాడని ఆదిత్యను చూస్తూ చెబుతుంది. అప్పుడే దేవుడమ్మ నీకు మీ నాన్న కనిపించడం సమస్య అయితే నాకు నా కోడలు కనిపించడం సమస్య అని అంటుంది. అయితే మీ కోడలు ఫోటో ఒకటి నాకు చూపించవా నేను కూడా వెతుకుతాను అని దేవి అంటుంది. సరే అని దేవుడమ్మ అంది. ఆ మాటలకు ఆదిత్య సత్య ఇద్దరు షాక్ అవుతారు. వాళ్ళ అమ్మ రుక్మిణి ఫోటో చూస్తే దేనికి నిజం తెలిసిపోతుంది అని కంగారు పడతాడు. దేవుడమ్మ బయటకు వెళ్తుంటే దేవి కూడా తనతో పాటు బయటకు వెళ్తానని మారాం చేస్తుంది. సరే అని దేవుడమ్మ తనతో పాటు తీసుకువెళ్తుంది.
సత్య మాధవ్ కు ఫోన్ చేస్తుంది. ఆదిత్య రుక్మిణి కలిసి ఉన్న ఫోటోలను పంపించాను కదా వాటిల్లో ఏదో అనుమానం వచ్చి ఫోన్ చేసినట్లు ఉంది అని మాధవ్ మనసులో అనుకుంటాడు. ఏంటి సత్య ఫోన్ చేశావు అని మాధవ్ అడుగుతాడు. దేవి ఏంటి నువ్వు తన తండ్రివి కావు అని చెబుతుంది. ఇదంతా నిజమేనా అని సత్య మాధవ్ ను అడిగేలోపు నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తరువాయి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More
Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More