Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదారణ పొందిన సీరియల్స్ లో గుప్పెడంత మనసు ఒకటి.
ఈ సీరియల్ లో హీరో రిషి కి తల్లిగా జగతి పాత్రను జ్యోతి రాయ్ పోషించింది. జగతి పాత్ర ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకుంది.
జ్యోతి రాయ్ యాక్టింగ్ కు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అయితే ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో జ్యోతి రాయ్ నటించడం లేదు.
ఈ కన్నడ బ్యూటీకి సొంత గడ్డపై సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. దీంతో గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పకున్న జ్యోతి రాయ్.. కన్నడ సినిమాలతో బిజీ అయ్యింది. వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.
అలాగే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటో షూట్లతో దుమారం రేపుతోంది. గుప్పెడంత మనసు సీరియల్ లో చాలా పద్ధతిగా కనిపిస్తూ జగతి పాత్రకు వన్నె తెచ్చిన జ్యోతి రాయ్.. రియల్ లైఫ్ లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది.
సోషల్ మీడియాలో హీరోయిన్లను మించి పోయేలా అందాలు ఆరబోస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటో షూట్లతో నెటిజన్లకు కు నిద్ర పట్టకుండా చేస్తోంది.
నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ పాతికేల్లా పడుచు పిల్లలా చిట్టి పొట్టు దుస్తులు ధరించి కుర్రాళ్ల గుండెల్లో అగ్గి రాజేస్తోంది.
ప్రస్తుతం జ్యోతి రాయ్ కి సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూస్తే ఎవ్వరైనా టెంప్ట్ అవ్వాల్సిందే.
ఎందుకంటే, అంతలా జ్యోతి రాయ్ తన అందాలతో ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక ఈ అందాల భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఇరవై ఏళ్ల వయసులో ఓ ఇంజనీర్ ని వివాహం చేసుకుంది.
అతని ద్వారా జ్యోతి రాయ్ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన కొన్నేళ్లకు మనస్పర్థల కారణంగా జ్యోతి రాయ్ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది.
అనంతరం యువ దర్శకుడు పూర్వజ్ తో ప్రేమాయణం నడిపించి అతనితో ఏడడుగులు వేసింది. ప్రస్తుతం తన 16 ఏళ్ల కొడుకు మరియు భర్తతో జ్యోతి రాయ్ లైఫ్ లీడ్ చేస్తోంది.