NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క అల్లరి నరేష్ మాత్రమే. అటువంటి అల్లరి నరేష్ నుంచి ఇటీవల వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాల్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, బాలీవుడ్ కమెడియన్ జానీ లివర్ కూతురు జామీ లివర్, హర్ష చెముడు, హరితేజ, రవి కిషోర్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల‌ను పోషించారు.

చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ 2024 మే 3న విడుదలైన ఆ ఒక్కటి అడక్కు సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్ర‌మ స్పందన లభించింది. ఆ ఒక్కటి అడక్కు టైటిల్ పెట్టి, అల్లరి నరేష్ ని హీరోగా పెడితే నాన్ స్టాప్ కామెడీ ఉంటుందని సినీ ప్రియులంతా భావించారు. థియేటర్స్ లో హాయిగా రెండు గంటల పాటు నవ్వుకోవచ్చని అనుకున్నారు. కానీ వారి ఆశలపై డైరెక్టర్ నీళ్లు జల్లేశాడు‌.

కామెడీ ట్రాక్ బలహీనంగా ఉండటం ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది. సినిమాలో చాలా భాగం సీరియస్ పాయింట్ తోనే వెళుతుంది. అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు ఉన్నా.. వాటిలో ఆకట్టుకున్నవి మాత్రం వేళ్ళ‌ పై లెక్క పెట్టవచ్చు. అయితే పెళ్లికాని మిడిల్ ఏజ్ పర్సన్ ఫ్రస్టేషన్‌ను మరియు మాట్రిమోనీ పేరుతో జరిగే మోసాలను మాత్రం దర్శకుడు బాగానే ప్రజెంట్ చేశాడు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మరోసారి తన యాక్టింగ్ తో అందర్నీ ఇంప్రెస్ చేసింది. అల్లరి నరేష్ పక్కన పర్ఫెక్ట్ గా సెట్ అయింది.

అయితే టాక్ అనుకూలంగా లేకపోవడం వల్ల ఆ ఒక్కటి అడక్కు సినిమాకు కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లెక్క బయటకు వచ్చింది. విడుద‌లైన 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 9 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున ఆ ఒక్క‌టి అడ‌క్కు చిత్రం.. వరల్డ్ వైడ్ గా రూ. 10 లక్షల రేంజ్ లో షేర్ ని, రూ. 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

ఫ‌స్ట్ వీక్ మొత్తం క‌లెక్ష‌న్స్ ను గ‌మ‌నిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.26 కోట్ల షేర్‌, రూ. 4.80 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయి. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 2.60 కోట్ల షేర్‌, రూ. 5.85 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను ఈ సినిమా తొలి వారంలో రాబ‌ట్టింది. ఆ ఒక్క‌టి అడ‌క్కు సినిమా రూ. 4.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. అయితే ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌మ‌యానికి రూ. 2.60 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇంకా రూ. 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే అల్ల‌రి న‌రేష్ హిట్ కొట్టిన‌ట్లే అవుతుంది.

 

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?