Karthikadeepam serial today episode review November 30:సౌందర్యకు గన్ గురిపెట్టిన మోనిత..మరోపక్క ప్రాణాపాయ స్థితిలో దీప..!

Published by
Deepak Rajula

Karthikadeepam serial today episode review November 30:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1523వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 30న ప్రసారం కానున్న Karthika Deepam serial,1523వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1523వ ఎపిసోడ్‌లోకి కార్తీకదీపం సీరియల్ అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 30 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

కొడుకు, కోడలు బతికే ఉన్నారని తెలుసుకున్న సౌందర్య :

Soundarya

కార్తీక్, దీప బతికే ఉన్నారని తెలిసి సౌందర్య వాళ్ళు రాజ్యమ్మ ఇంటికి వస్తారు. కానీ ఆమె మాత్రం ఇంద్రుడు గురించి ఏమి తెలియనట్లు మాట్లాడుతుంది. ఇక అందరూ కూడా తీవ్ర నిరాశతో వెనుతిరుగుతారు. ఆనందరావు మాత్రం అసలు మన దీప, కార్తీక్ నిజంగా ప్రాణాలతో లేరేమో? అంటాడు ఆనందరావు అనుమానంగా. ‘ఆ విషయంలో నాకు ఏ అనుమానం లేదండి.. నేను ఇంద్రుడ్ని రాజ్యమ్మ ఇంట్లో కలిసేనాటికే వాళ్లు ఊరు వదిలి పారిపోయారు. అంటే ఎవరికో భయపడి పారిపోయారు. అది కార్తీక్, దీపలే ఎందుకు కాకూడదు?’అంటుంది సౌందర్య చాలా నమ్మకంగా అదే నిజం అయితే బాగుండు అంటాడు ఆనందరావు.నాకు అయితే నమ్మకం ఉంది నాన్నమ్మా అంటుంది హిమ కూడా..సౌర్య ఇంత పంతం పట్టి ఇక్కడే ఉందంటే అమ్మానాన్నలు బతికే ఉన్నారు అంటుంది.

దీపను హాస్పిటల్ కి తీసుకుని వచ్చిన కార్తీక్ :

Deepa, karthik

సీన్ కట్ చేస్తే ఎలాగోలా కార్తీక్ దీపని వెతికి ఆసుపత్రికి తీసుకొస్తాడు. దీప సృహలో ఉండదు. ఆక్సిజన్ పైప్ పెట్టి ట్రీట్మెంట్ అందిస్తూనే ఉంటారు. కార్తీక్ కళ్లనిండా నీళ్లతో తనకి దీపకు పెళ్లి అయిన నాటి నుంచి.. దీప పడిన బాధలు అన్ని తలుచుకుని బాధపడతాడు.నీకు ఏదైనా అయితే నేను ఎలా బతకాలి దీపా?’ అంటూ ఎమోషనల్ అవుతాడు.

బోటిక్ అమ్మేసి హైదరాబాద్ వెళ్తున్న మోనిత :

Monitha

మరోపక్క మోనిత.. కార్తీక్, దీపల గురించే ఆలోచిస్తుంది. ‘ఎక్కడికి వెళ్లిపోయారు? ఒకవేళ గతం గుర్తొచ్చి సౌర్యతో కలిపి ముగ్గురూ హైదరాబాద్ వెళ్లిపోయారా? వదిలిపెట్టను వాళ్ళను…నేను హైదరాబాద్ వెళ్తాను. వెతుకుతాను’ అని మనసులో అనుకుంటూ హడావుడిగా బట్టలు సర్థుకుంటుంది మోనిత. వెంటనే శివలతకు కాల్ చేసి శివలతా నేను హైదరాబాద్ వెళ్తున్నాను ఈ బోటిక్ నువ్వే ఎంత ఉంచేసుకో నాకు చాలా చేశావ్ కదా అని అంటుంది.అయినా నేను ఇక్కడికి వచ్చి ఈ బిజినెస్ చేస్తున్నదే కార్తీక్ కోసం.. తనే లేకపోయాక ఈ బిజినెస్‌లు నాకెందుకు? సరే నేను వెళ్తున్నాను నన్ను ప్రశ్నలు వేసి చిరాకు తెప్పించకు అంటుంది.
మోనిత మాటలు విన్న శివలత.. ‘మేడమ్ ఇక్కడే నాలుగురోజలు వెయిట్ చేయండి.. వాళ్లే వచ్చేస్తారు’ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ మోనిత వినిపించుకోదు.

సౌందర్య ఎంట్రీతో షాక్ అయిన మోనిత :

Soundarya entry

బ్యాగ్ తీసుకుని హాల్లోకి రాగానే ఎదురుగా ఉన్న సౌందర్యని చూసి బిత్తరపోతుంది. ఆంటీ మీరా? రండి.. కూర్చోండి అంటూ దొంగ ప్రేమ చూపిస్తుంది.సౌందర్య మాత్రం చాలా కూల్‌గా ఏంటి మోనిత ఎవరితోనే సీరియస్ గా మాట్లాడుతున్నవ్..మొన్ననే నా తల మీద కొట్టి నన్ను చంపాలనుకున్నావ్.. ఇప్పుడు ఎవరిని చంపాలనుకుంటున్నావ్?’ అంటుంది సౌందర్య అలాంటిదేంలేదు ఆంటీ’ అంటుంది మోనిత తడబడుతూ. ‘అసలు నన్ను ఎందుకు తల మీద కొట్టావ్? తాళం పగలగొట్టి లోపలికి వెళ్తే ఏమవుతుంది? ఇంటి లోపల ఏముంది? ఇప్పుడే తేలుస్తా అంటూ ఇల్లంతా వెతుకుతుంది సౌందర్య.
ఎక్కడా ఏం దొరకదు సౌందర్యకి. ఇంతలో మోనిత ఆంటీ ఇక్కడికి వచ్చిందంటే.. దీప వాళ్లు హైదరాబాద్ వెళ్లలేదా? వాళ్లు బతికి ఉన్న విషయం కూడా సౌందర్య ఆంటీకి తెలియదా? అమ్మయ్యా అనుకుని సౌందర్యని వెనక్కి తోసేసి.. గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది.

సౌందర్యకు గన్ గురిపెట్టిన మోనిత :

Monitha

వెనుకే పరుగుతీసిన సౌందర్య ‘తలుపు తియ్యవే’ అంటూ గట్టిగానే అరుస్తుంది. మోనిత తలుపు తీస్తుంది కానీ.. చేతిలో గన్ పట్టుకుని ఎక్కడో దూరంగా నా బతుకు నేను బతుకుతుంటే ఏంటీ మీగోలా?’ అంటూ అరుస్తుంది మోనిత. ‘బతుకా? బతుకు అంటారా దీన్నీ? ఎందుకు బతుకుతున్నావో తెలియదు నీకు అననీ కొడుకుని తీసుకుని ఎన్ని రోజులు అయ్యింది? ఎలా ఉన్నాడు అని ఒక్కసారైనా ఫోన్ చేసి కనుక్కున్నావా?’ అంటుంది సౌందర్య కోపంగా. ‘నా కొడుకుని నాకు తెలియకుండా ఎత్తుకుపోయి.. మళ్లీ ఫోన్ చేయట్లేదు అని అంటున్నారా? అసలు మీ అందరి మీద నేను కిడ్నాప్ కేస్ పెట్టాలి’ అంటూ అరుస్తుంది మోనిత.

సౌందర్యనా మజాకానా..?

Soundarya

మొన్న దెబ్బతోనే సరిపెట్టాను.. ఇప్పుడు కాల్చేస్తాను వెళ్లిపొండి. మీ కొడుకు కోడలు ప్రాణాలతో లేరు కదా? ఇప్పుడు ఎందుకు ఇలా నన్ను వేధిస్తున్నారు? అంటూ అరుస్తుంది మోనిత. దాంతో సౌందర్య మనసులో నిజంగానే దీప కార్తీక్ ప్రాణాలతో లేరు అనుకుంటుందా? ఇప్పుడు దీనికి నిజం తెలిస్తే వాళ్లు ఎక్కడున్నా వెతికి వాళ్ల జీవితాలను నాశనం చేస్తుంది.. తెలియనివ్వకూడదు అని మనసులో అనుకుంటూ తెలివిగా మోనిత చేతిలోంచి గన్ లాక్కుని కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 

 

This post was last modified on November 30, 2022 11:23 am

Deepak Rajula

Recent Posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More

May 3, 2024

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More

May 3, 2024

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More

May 3, 2024

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

Madhuranagarilo May 3 2024 Episode 353:  రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More

May 3, 2024

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More

May 3, 2024

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More

May 3, 2024

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More

May 3, 2024

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు.… Read More

May 3, 2024

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు… Read More

May 3, 2024

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి డైమండ్ బజార్. నెట్ఫ్లిక్స్ లో బుధవారం అనగా… Read More

May 3, 2024

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Neethone Dance: బిగ్బాస్ రన్నర్ గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నట్టు అఖిల్. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్… Read More

May 3, 2024

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

Venkatesh-Roja: అత్యధిక చిత్రాల నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు రెండవ కుమారుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దగ్గుబాటి వెంకటేష్.. చాలా… Read More

May 3, 2024

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Ananya Agarwal: మజిలీ.. 2019లో విడుదలైన సూపర్ హిట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. యువ సామ్రాట్ అక్కినేని… Read More

May 3, 2024