Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. సినిమాల్లో నటించకపోయినా కూడా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి ఫుల్ ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా సినీ తారల విడాకుల గురించి ముందే చెప్పడంలో వేణు స్వామి స్పెషలిస్ట్. గతంలో నాగచైతన్య, సమంత విడిపోతారని జ్యోతిష్యం చెప్పారు. అనూహ్యంగా వివాహం జరిగిన నాలుగేళ్లకే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ జంట విడిపోవడంతో వేణు స్వామి పేరు మారు మ్రోగిపోయింది. ఆయనకు భారీ క్రేజ్ ఏర్పడింది. అప్పటినుంచి ఆయన ఏది మాట్లాడినా కూడా తెగ ట్రెండ్ అవుతూ ఉంటుంది.
అయితే తాజాగా మెగా ఫ్యామిలీలో మరో విడాకులు ఖాయమంటూ వేణు స్వామి కుండబద్దలు కొట్టారు. మెగా ఫ్యామిలీలో విడాకులు కొత్తేమి కాదు. ఇప్పటికే వారి ఫ్యామిలీలో ఎంతో మంది విడాకులు తీసుకుని మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేశారు. రీసెంట్ టైమ్ లో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మరియు నాగబాబు గారాలపట్టి నిహారిక తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. అయితే భవిష్యత్తులో మెగా ఇంట మరో విడాకులు జరగబోతున్నాయని వేణు స్వామి కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచతలనంగా మారింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విడిపోతారని వేణు స్వామి బలంగా చెబుతున్నారు. `వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జాతకంలో గురుడు, శుక్రుడు నీచంలో ఉన్నారు. పైగా వరుణ్ తేజ్ కి నాగ దోషం, లావణ్య త్రిపాఠికి కుజ దోషం ఉంది. ఇలాంటి దోషాల మధ్య వారికి పెళ్లి జరగడమే ఒక మిరాకిల్. కానీ వారు ఎక్కువకాలం కలిసి ఉండటం చాలా కష్టం. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విడిపోవడానికి వారి ఫ్యామిలీలో ఉన్న లేడీ కారణం అవుతుంది. నేను జాతకం ప్రకారమే ఇది చెబుతాను. వ్యక్తిగతంగా వారితో నాకు ఎలాంటి గొడవలు లేవు` అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు.
దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింల వైరల్ గా మారాయి. మెగా అభిమానులు మరియు పలువురు నెటిజన్లు వేణు స్వామి కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విడాకులు తీసుకుంటారని ముందే చెప్పడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. పాపులరిటీ కోసం ఇతరుల జీవితాల్లో వేలు పెట్టడానికి సిగ్గుగా లేదా అంటూ వేణు స్వామిని ఏకిపారేస్తున్నారు.
కాగా, 2017లో వచ్చిన మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడ్డ వీరి పరిచయం స్నేహంగా ఆపై ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్లు సీక్రెట్ గా లవ్ చేసుకున్న వరుణ్, లావణ్య.. గత ఏడాది నవంబర్ లో పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. ఇటలీలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వివాహం అనంతరం ఈ జంట ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్‌ను చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మెగా కోడలు అయ్యాక కూడా లావణ్య తన యాక్టింగ్ కెరీర్ ను కొనసాగిస్తోంది.
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More