ఆలుమగలు శృంగారంలో మునిగితేలుతున్నపుడు ఉద్రేకాలు తారస్థాయికి వెళ్లడం సహజం. ఈ స్థితికి చేరినపుడు కూడా అందరూ మృదువుగా ఉంటారని అనుకోనక్కర లేదు. చాలామంది భాగస్వామితో కాస్త మొరటుగా వ్యవహరించడం కద్దు. అలా మొరటుగా ప్రేమించినపుడు ఎదుటివారి శరీరంపై కొన్ని గుర్తులు మిగిలిపోతాయి…లవ్ బైట్స్. చర్మం కమిలిపోయి ఆ గుర్తు కొన్ని రోజుల పాటు ఉండిపోతుంది.
చాలా ఎక్కువ వత్తిడితో చుంబించినపుడు, దంతాలతో అధరాలతో కొరికినపుడు ఈ లవ్ బైట్స్ ఏర్పడతాయి. అక్కడ చర్మం కింద సూక్ష్మ రక్తనాళాలు పగిలి రక్తం బయటకురావడమే లవ్ బైట్. నిజానికి ఇవి కూడా గాయాలే. వైద్య పరిభాషలో వీటిని హికీస్ అంటారు. హికీస్ శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. అయితే మెడపై ఏర్పడినవే కాస్త ఎక్కువ ఇబ్బంది పెడతాయి.
రాత్రి పడకగది ఏకాంతంలో క్రీడించినపుడు తెలియదు కానీ ఈ హికీస్తో ఉదయం ఇంట్లో అందరి కంటా పడడం ఇబ్బందిగానే ఉంటుంది. వీటిని ఏం చేయగలం? వాటిని తక్షణం పోగొట్టడం కుదరదు కానీ కొన్ని వంటింటి చిట్కాలతో తీవ్రత తగ్గించవచ్చు.
హికీస్ ఏర్పడిన చోట ఐస్ ప్యాక్‌తో కాపడం పెట్టాలి. చర్మంపై ఐస్‌ను నేరుగా తాకించకూడదు. 15- 20 నిముషాల సేపు ఐస్ ప్యాక్‌తో కాపడం పెట్టాలి. మరీ వాపు కనబడి నెప్పిగా ఉంటే ఐబూఫ్రొఫెన్ లాంటి టాబ్లెట్ వాడవచ్చు.
ఆర్నికా మొక్క నుండి తయారయ్యే ఈ ఔషధాన్ని నెప్పులు, వాపులు, గాయాలకు మందుగా వాడడం ఎప్పటినుంచో ఉంది. హోమియోలో ఈ ఔషధం వాడకం ఎక్కువ. ఇది లేపనం రూపంలో గుళికల రూపంలో దొరుకుతుంది. 20 శాతం ఆర్నికా జెల్ కానీ, ఆయింట్మెంట్ కానీ తీసుకుని అక్కడ రాస్తే ఫలితం ఉంటుంది.
రక్తం గడ్డకట్టిన సందర్భాలలో, గాయాలు మానడంలో విటమిన్ కె పాత్ర ఎంతైనా ఉంటుంది. విటమిన్ కె లోపం చాలా అరుదయినప్పటికీ అలాంటి లోపం ఉంటే గాయాల ప్రమాదం పెరగడం, వాటి నుంచి రక్తం కారడం అంత త్వరగా ఆగకపోవడం జరుగుతుంది. హికీస్ ట్రీట్మెంట్కు కూడా విటమిన్ కె వాడవచ్చు. విటమిన్ కె ఆయింట్మెంట్ అక్కడ పూసినందువల్ల కాస్త గుణం కనబడుతుంది.
పాలకూర, బ్రోకోలి వంటి ఆకుకూరలు, మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు, సోయాబీన్, కనోలా వంటి వనస్పతి నూనెలు, బ్లూబెర్రీ, ద్రాక్ష, అంజూర వంటి పళ్లలో విటమిన్ కె ఎక్కువగా దొరుకుతుంది.
గాయాలు మానాలన్నా, చర్మం, రక్తనాళాలు, మృదులాస్తి ఆరోగ్యకరంగా ఉండాలన్నా శరీరంలో కొలాజెన్ అనే ప్రొటీన్ కావాలి. ఆ కొలాజెన్ తగినంత తయారుకావాలంటే విటమిన్ సి కావాలి. గాయం అయిన చోట విటమిన్ సి పూస్తే త్వరగా మానుతుందని అంటారు. అయితే దీనిని బలపరిచే శాస్త్రీయ ఆధారాలు లేవు. హికీస్పై రాయాలనుకుంటే విటమిన్ సి క్రీములు దొరుకుతాయి.
సహజసిద్ధంగా కావాలంటే నిమ్మ జాతి పళ్లు, మిరప, మిరియాలు, కివి పళ్లు, బ్రోకోలి, టమోటాలు విటమిన్ సి కావాల్సినంత అందిస్తాయి.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.
EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.… Read More
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈ ఆరడుగుల అందాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన… Read More
Manipur: మణిపూర్ లో మరో సారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు… Read More
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైస్ చిత్రం… Read More
Jagadhatri April 27 2024 Episode 216: కేదార్ భయపడిపోయి జగదాత్రి చెయ్యి తన నెత్తి నుంచి తీసేస్తాడు. ఎందుకు… Read More
Paluke Bangaramayenaa April 27 2024 Episode 213: ఎలుక ఉందని భయపడిపోయిన స్వర పరిగెత్తుకొచ్చి అభి పక్కన బెడ్… Read More
Brahmamudi April 27 2024 Episode 395: దుగ్గిరాల ఇంట్లో రోజుకో రచ్చ జరుగుతూనే ఉంది. నిన్న కావ్య మీడియా… Read More
Naga Panchami: గరుడ రాజు తన గరుడ శక్తిని ఖరాలికి ఆవాహన చేస్తాడు. కరాలి ధన్యోస్మి గరుడ రాజా అంటుంది.… Read More
Mamagaru: అవును వదిన ఇక్కడ ఉంటున్నామనే కానీ తింటే తినబుద్ది అవదు పడుకుంటే పడకో బుద్ధి కాదు అక్కడ ఉంటే… Read More
Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతి గురించి విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వచ్చిన ఆర్య రేపు… Read More
Krishna Mukunda Murari April 27 2024 Episode 456: కృష్ణ హాస్పిటల్ కి వెళ్లి నిజం తెలుసుకోవాలి అని… Read More
April 27: Daily Horoscope in Telugu ఏప్రిల్ 27 – చైత్ర మాసం – శనివారం - రోజు… Read More
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప 2' మూవీ తెరకెక్కుతోంది. 2021లో వచ్చిన… Read More
Lok sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన… Read More
Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం… Read More