Aditya L-1 Launch: సూర్యుడిపై పరిశోధిన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) .. తొలి సారిగా చేపడుతున్న ఆదిత్య ఎల్ -1 ప్రయోగం సక్సెస్ అయ్యింది. పీఎస్ఎల్వీ – సీ 57 వాహన నౌక ఆదిత్య ఎల్ 1 ను మోసుకుంటూ నింగిలోకి దూసుకువెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుండి ఈ ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్ 1 ఉప గ్రహాన్ని మోసుకుని పీఎస్ఎల్వీ సీ 57 వాహన నౌక నింగిలోకి దూసుకువెళ్లింది. అనంతరం పీఎస్ఎల్వీ సలీ 57 నుండి విజయవంతంగా ఆదిత్య ఎల్ 1 విడిపోయిందని ఇస్రో ప్రకటించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగం ఇద కావడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. భూమికి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎల్ 1 పాయింట్ వద్దకు ఆదిత్య ఎల్ 1 వెళ్తొంది. అక్కడ నుండి సూర్యుడిని పరిశీలించనుంది.
ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం నాలుగు నెలల (126 రోజులు) పాటు ప్రయాణించి సూర్యుడి దిశగా లగ్రాంజ్ 1 పాయింట్ కు చేరుకుంటుంది. భూమికి 15 లక్షల కిలో మీటర్ల దూరం నుండి సూర్యుడిని ఉపగ్రహం అధ్యయనం చేస్తుంది. సూర్యుడిపై సౌర తుపానులు, సౌర రేణువులు, దానిపై వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. అదిత్యలో ఏడు పరిశోధన పరికరాలు ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫాటో స్పియర్, క్రోమో స్పియర్, కరోనాను కూడా అధ్యయనం చేయనున్నాయి. ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం 1,475 కిలోల బరువు ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది.
ఇస్రో మైలు రాయిని దాటింది. చంద్రయాన్ – 3 చరిత్రాక్మక విజయంతో జోష్ మీద ఉన్న ఇస్రో సూర్యుడిపై తొలి ప్రయోగం చేపట్టింది. ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో శ్రీహరికోట షార్ లో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇస్రో ఆదిత్య ఎల్ 1 ప్రయోగం సక్సెస్ అయ్యిందనీ, నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ ప్రవేశపెట్టిందనీ, వాహన నౌక నుండి ఉపగ్రహం విడిపోయిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రకటించారు.
YS Jagan: వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More