Categories: న్యూస్

సుపరిపాలనపై శ్వేతపత్రం

Published by
sharma somaraju

అమరావతి, డిసెంబర్ 24 : వరుస శ్వేతపత్రాలలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు మంగళవారం రెండవ వైట్‌ పేపర్‌ను విడుదల చేశారు. గుడ్ గవర్నెన్స్‌పై రూపొందించిన ఈ శ్వేతపత్రంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

  • సుపరిపాలన ఎలా ఉండాలనే అంశంపై ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక శ్వేతపత్రం ఇచ్చాం.
  • అందులో భాగంగానే ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు శ్రీకారం చుట్టాం.సాం కేతికతను పెద్దఎత్తున వినియోగిస్తున్నాం.
  • సులభతర విధానాలు ఎన్నింటినో అవలంభిస్తున్నాం. వినూత్న సాంకేతికత విధానాలను తీసుకువచ్చాం.
  • పోలవరం ప్రాజెక్టు తొలిగేటు పెట్టాం. ఇకపై మిగిలిన గేట్లు కూడా పూర్తిచేసే పని త్వరితగతిన పూర్తిచేస్తాం. ఇది తరతరాల ఆకాంక్ష.
  • రాయలసీమ వర్షాలు లేక ఎడారిగా మారుతుందని భయపడే పరిస్థితి నుంచి బయటపడ్డాం.
  • నదుల అనుసంధానం, జల సంరక్షణ విధానాలు, సమర్ధ నీటి వినియోగ పద్ధతులు అవలంభించాం. దీనివల్ల ఫలితాలు సాధించాం.
  • *భారతదేశ చరిత్రలో ఇంత త్వరగా పూర్తవుతున్న సాగునీటి ప్రాజెక్టు పోలవరమే*
  • పోలవరం ప్రాజెక్టుకు ఇఫ్పటికే ఉత్తమ ప్రాజెక్టుగా పురస్కారం వచ్చింది.
  • వారంతపు సమావేశాలు నిర్వహించాం, డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకోవడం వంటివి ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తిచేయడంలో దోహదపడ్డాయి.
  • ప్రభుత్వ పాలనలో పారదర్శకంగా వ్యవహరించాం. దార్శనికతతో ముందుకు వెళ్లాం.
  • దార్శనికతకు తగినట్టుగా మన దగ్గర ఉన్న సహజ వనరులు, మానవ వనరుల్ని వినియోగించుకున్నాం.
  • రాజధాని లేకుండా, పరిశ్రమలు కూడా లేకుండా దార్శనిక పత్రాన్ని రూపొందించుకుని అభివృద్ది వైపు అడుగులు వేశాం
  • విజన్ రూపొందించుకోవడమే కాదు, దాన్ని అమలుచేయడం ముఖ్యం.
  • మూడు మాసాలకు ఒకసారి వృద్ధి ఫలితాలను మదింపు చేయడం మరో అడుగు
  • ఏడు మిషన్లు, ఐదు ప్రచార ఉద్యమాలు, ఐదు గ్రిడ్లు ఏర్పాటుచేసుకుని అడుగులు వేశాం.
  • 18 జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించాం. ఆ సమావేశాల్లో నిర్ధిష్ట విధానాలపై చర్చించాం.
  • తలసరి ఆదాయం ఏఏ జిల్లాల్లో ఎలా ఉన్నాయో చర్చించాం.
  • ఆర్థిక అసమానతలను తొలగించే కృషి చేశాం.
  • వ్యవసాయం, విద్య, సాంకేతికత, పర్యావరణం, మౌలిక సదుపాయాలు తదితర అనేక అంశాల్లో జాతీయ స్థాయి పురస్కారాలు దక్కాయి.
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, హ్యాపీనెస్ ఇండెక్స్ తదితర అంశాల్లో నెంబర్‌వన్‌గా నిలిచాం.
  • మనిషి జీవితం ఆనందమయం కావాలి. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆనందంగా జీవించడం అంతే ముఖ్యం.
  • అందుకే హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఒక కొలమానంగా తీసుకున్నాం.
  • హ్యాపీ సండే పేరుతో వారాంతాలు ఆహ్లాదంగా, సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం.
  • మిషన్ అంత్యోదయాలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచిన 37 అభివృద్ధి చెందిన గ్రామాలు ఏపీలోనే ఉన్నాయి.
  • ఇ-ప్రగతి ద్వారా అన్ని ప్రభుత్వశాఖలను కంప్యూటరీకరించాం.
  • పరిష్కార వేదిక పేరుతో ప్రజల సమస్యల్ని తెలుసుకుంటున్నాం.
  • పీపుల్స్ హబ్ పేరుతో ప్రజలు అందుకుంటున్న ప్రయోజనాలు, అందుబాటులో ఉన్న వనరులు ఏమిటో బేరీజు వేసుకుంటూ అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
  • భూధార్ వ్యవస్థను దేశంలోనే తొలిసారి ఏపీలో తీసుకువచ్చాం.
  • ఎక్కడా బినామీ సమస్య లేకుండా, భూ క్రయ విక్రయాల్లో అవకతవకలు లేకుండా చేస్తున్నాం.
  • ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడా తప్పు జరగకుండా చూస్తున్నాం. వారికి ఎప్పటికప్పుడు అవసరమైన పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నాం.
  • ఒకపక్క దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం. మరోపక్క మానవ వనరుల అభివృద్ధికి సులభతర విధానాలను తీసుకొచ్చాం.
  • మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రయత్నిస్తున్నాం.
  • అందరూ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు చేసుకుంటుంటే విభజన సమస్యల్ని అధిగమించేందుకు ఏటా నవ నిర్మాణ దీక్ష నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నాం.
  • వయాడక్ట్ విధానం ద్వారా ప్రభుత్వ పనితీరును మరింత మెరుగు పరచుకుంటున్నాం.
  • వ్యవసాయరంగంలో దీటైన వృద్ధిని సాధించగలిగాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయగలిగాం.
  • చెరువుల అనుసంధానం, పూడిక తొలగింపు, పట్టిసీమ ద్వారా నదుల అనుసందానం, చెక్ డ్యాముల నిర్మాణం వంటి అనేక జల విధానాలను అమలుచేశాం.
  • వ్యవసాయంలో వ్యూహాలు మార్చుకుంటున్నాం. డెయిరీ, పౌల్ట్రీ, హార్టీకల్చర్ వైపు మళ్లాం. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంట మార్పిళ్లకు వెళ్లాం.
  • విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం.
  • తొలిసారి దేశంలో విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని చెప్పిన రాష్ట్రం ఆంద్రప్రదేశ్. ఈరోజు అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఎల్ఈడీ బల్బులు వెలుగుతున్నాయి
  • త్వరలో సోలార్ వ్యవసాయ పంపుసెట్లు తీసుకొస్తున్నాం. 25 శాతం విద్యుత్ ఆదా చేయడానికే స్మార్ట్ పవర్ గ్రిడ్లను అభివృద్ధి చేస్తున్నాం.
  • గ్రీన్ కవర్ వైపు దృష్టి పెట్టాం. గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్ ఎనర్జీకి మారుతున్నాం. త్వరలో కాలుష్యం లేని వాతావరణం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
  • ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాం.
  • ల్యాండ్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, లాజిస్టిక్ మేనేజ్మెంట్ విధానాలను అవలంభిస్తున్నాం. తుఫాన్ కదలికల్ని నిర్దిష్టంగా పసిగట్టగలుగుతున్నాం.ఫెతాయ్ తుఫాన్‌ సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకోగలిగాం.
  • ఇన్నోవేషన్‌లో ఏపీ లీడర్ అని దేశం గుర్తించింది.
  • అత్యుత్తమ సంస్థలు, ప్రభుత్వ విధానాలు, వినూత్న ఆలోచనలతో ఏపీ అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది.
  • ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో జవాబుదారితనం కచ్చితంగా ఉండేలా డిజిటలైజ్ చేశాం.
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాంకేతికతను ఏపీకి తీసుకొచ్చాం.
  • 1,42,054 రూపాయిల తలసరి ఆదాయాన్ని సాధించగలిగాం. నాలుగేళ్లలో 12 వేల రూపాయిల వ్యత్యాసాన్ని తీసుకురాగలిగాం
  • పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాం.
  • మాతాశిశు మరణాలు, ప్రసవ మరణాలు గణనీయంగా తగ్గించుకోగలిగాం. పౌష్టికాహార లోపం లేని దశకు చేరుకున్నాం.
  • నరేగా నిధుల్ని సద్వినియోగం చేసుకున్నాం.
  • నరేగా ద్వారా 24 ప్రభుత్వశాఖల్లోని పనులను అనుసంధానం చేశాం.
  • రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం గణనీయంగా తగ్గించాం. ఇది రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా మార్చగలిగింది.
  • 2022 నాటికి సుస్థిర వృద్ధి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
  • ప్రపంచంలో ఎక్కడాలేనంత యువత ఇండియాలో ఉంది. ఐటీలో మన దేశం అగ్రగామి. ఇంగ్లిషు మాట్లాడే వారు కూడా ఈ దేశంలో ఎక్కువ. ఈ వనరుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.
  • పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా పనులను సత్వరం పూర్తిచేస్తున్నాం. ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా రూ.55 వేల కోట్లు అవసరం.
  • ప్రధాన ప్రతిపక్షం ప్రతి అభివృద్ధి పనిలో అడ్డం పడుతోంది.
  • పోలవరం గేటు పెడితే ఎగతాళీ చేస్తోంది. కచ్చితంగా ఇది గ్రేట్ డే. ఇంత గొప్ప కార్యక్రమాన్ని అవహేళన చేయడం దుర్మార్గం.
  • కడప జిల్లా ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడానికి ముహూర్తం ప్రకటిస్తే దాన్ని కూడా అవహేళన చేస్తూ మాట్లాడుతుండటం ఇంగితం లేకపోవడమే.
  • మేము కాంగ్రెస్‌తో కలిస్తే ఎన్టీఆర్‌కు నమ్మకద్రోహం చేసినట్టుగా ప్రధానమంత్రి మోడీ మాట్లాడటం దారుణం. పోలవరం ప్రాజెక్టుకు పురస్కారం ఇస్తారు, డబ్బులు మాత్రం ఇవ్వరు.
  • కేంద్ర ప్రభుత్వం సహకరించపోయినా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సాంకేతికత సాయంతో వనరుల్ని సమర్ధంగా వినియోగించుకుంటూ సుపరిపాలన విధానాలను అమలుచేయడం వల్లనే మనం అనుకున్నది సాధించగలుగుతున్నాం.
  • అన్నక్యాంటీన్, చంద్రన్నబీమా, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, మైక్రో న్యూట్రియెంట్స్ అందించడం, పండగ కానుకలు, వివిధ వర్గాలకు పెద్దఎత్తున సంక్షేమ పథకాలు, సబ్సిడీ వంటివి దేశంలో ఎక్కడా లేవు.
  • దేశానికి ఏపీ ఇప్పుడు లీడర్‌గా వుండే స్థాయికి ఎదిగింది.
  • ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని అమలు చేయడమే కాకుండా ఆ పథకం వల్ల ప్రజల్లో సంతృప్త స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ప్రపంచం మొత్తం మీద ఈ ప్రభుత్వమే.
  • పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంలో అర్ధమే లేదు.
  • వాళ్లు అక్కడ కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు.
  • *పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంలో అర్ధమే లేదు*
  • వాళ్లు అక్కడ కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు
  • ఇప్పుడున్న వ్యవసాయ పంపుసెట్లను సోలార్ పంపుసెట్లుగా మార్చుతాం.
  • అమరావతిలో పేదవారు అందరికీ ఇళ్లు కడతాం.

 

సుపరిపాలనపై శ్వేతపత్రం పూర్తి పాఠం కొరకు ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి

5_6127292896723861629

This post was last modified on December 25, 2018 10:16 am

sharma somaraju

Recent Posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More

May 9, 2024

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More

May 9, 2024

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More

May 9, 2024

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More

May 9, 2024

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక‌రు. ప్రముఖ వ్యాపార‌వేత్త మ‌రియు… Read More

May 9, 2024

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More

May 9, 2024

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong Backing from Domestic Family Offices and UHNIs

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More

May 9, 2024

Millennials dominate 60% of Investor Base into Fractional Investments: Grip Invest Report

Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More

May 9, 2024

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More

May 9, 2024

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More

May 9, 2024