తను మాటలు ఎప్పుడూ ఓ సెన్సేషనల్.. తన చేతలు ఎప్పుడూ ఓ వింతే.. 7’O క్లాక్ బ్లేడ్ పేరు వింటేనే టక్కున గుర్తొచ్చే వ్యక్తి అతను. మాటలను ఇటు అటు తిప్పడంతో ఆయన తర్వాతే ఎవరైనా.. ఆయనే నటుడిగా, నిర్మాతగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న బండ్ల గణేష్. ఆయన సినిమాలకు వచ్చిన గుర్తింపు కన్నా.. ఆయన రాజకియాల్లోకి పోయిన తర్వాత వచ్చిన గుర్తింపు చాలా ఎక్కువ.
రాజకీయాలకు పోతున్నానని ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయనను రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రెటిని చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఇప్పటికి ట్రెండ్ అవుతాయి అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే తీరా ఆ ఎన్నికల్లో ఘోరంగా విఫలం కావడంతో ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అయితే దీనిపై ఆయన పలు మార్లు స్పందిస్తూ.. ఆ మాటలను గుర్తు చేయోద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు.
దాన్ని పట్టించుకోని సోషల్ మీడియా.. కొన్ని న్యూస్ ఛానెల్స్ ఆయన్ని ఇరుకున పెట్టే పనిలో పడ్డాయి. పొలిటికల్ స్టెప్ వేసి తప్పుచేశానని, ఇప్పుడు రాజకీయాలను దూరంగా ఉంటూ మళ్ళీ సినిమాలతో బిజీగా కావాలని చూస్తున్నారు. అయినా కానీ మళ్లీ రాజకీయాల్లోకి బండ్ల గణేష్ రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. బండ్ల గణేష్ ఇప్పుడు ఏ స్టెప్ తీసుకోబోతున్నారో అని రూమర్స్ సోషల్ మీడియా వేదికగా షికారు చేస్తున్నాయి.
ఆయన రాజకీయాలతో తనకు అసలే సంబంధం లేదు ఎంత మొత్తుకున్న చాలా మంది వినకుండా ఆయనపై దురద చల్లే ప్రయత్నం చేస్తునే ఉన్నాయి. మళ్లీ ఎన్నికల జోరు మొదలవ్వడంతో సోషల్ మీడియాలో ఆయన రాజకీయ ప్రయాణాలపై కామెంట్ల పరంపర కొనసాగుతూ వస్తోంది. ఇలా వచ్చే కామెంట్లపై గతంలో ఆయన చాలా సార్లు స్పందిస్తూ.. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పేశాడు. అయినా కానీ రూమర్లు మాత్రం ఆగడం లేదు.
దాంతో విసిగిపోయాన బండ్ల గణేష్ ఇప్పడు సోషల్ మీడియాలో ఒక కామెంట్ చేశాడు. నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు నేను రాజకీయాలకు దూరం అంటూ.. చేతులు జోడించే ఎమోజీని షేర్ చేశాడు. దీంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. కానీ దీన్ని కూడా నమ్మలేమని సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైంది. ఆయన ఏ మాటమీద నిలబడరంటూ పలువురు విమర్శిస్తున్నారు. చూడాలి ఈ చర్చ ఎక్కడికి దారి తీస్తుందో..
This post was last modified on November 26, 2020 9:49 pm
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More
90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More
Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More
Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More
Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త మరియు… Read More
Karthika Deepam 2 May 9th 2024 Episode: దీప తీయకపోయినప్పటికీ పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా… Read More
Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More