Credit Card: బ్యాంకు క్రెడిట్ కార్డులు అనేవి రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివి. వీటిని సరిగ్గా ఉపయోగించుకోవడం రాకపోతే లాభాల మాట అటుంచితే.. నష్టాల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డుపై అనేక ఛార్జీలు వడ్డీస్తుంటాయి. ఓవర్ లిమిట్ పీరియడ్, అడ్వాన్సు ట్రాన్సాక్షన్లు, లేట్ పేమెంట్ ఛార్జీలు.. ఇలా రకరకాల ఛార్జీలు ఉంటాయి. అయితే వీటిని ముందస్తుగానే తెలుసుకొని క్రెడిట్ కార్డులను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. తాజాగా ఒక బ్యాంకు ఆలస్య రుసుముతో పాటు క్యాష్ అడ్వాన్స్ ట్రాన్సాక్షన్ ఛార్జీలను సవరించింది. ఆ బ్యాంక్ ఏంటో కొత్త ఛార్జీలు ఏవో తెలుసుకుంటే..
ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ (ICICI) తాజాగా తన క్రెడిట్ కార్డులపై ఛార్జీలను సవరించింది. ఈ కొత్త ఛార్జీలు ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఆలస్య రుసుములో సవరణలు చేయడంతోపాటు క్యాష్ అడ్వాన్స్ ట్రాన్సాక్షన్లపై 2.5 శాతం ఫీజును వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ క్యాష్ అడ్వాన్స్ ఫీజు (Cash Advance Fee) ఇకపై కనీసం రూ.500 ఉండనుంది.
ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులు ఫిబ్రవరి 10 తర్వాత రూ.100 క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ కలిగి ఉన్నట్లయితే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ క్రెడిట్ కార్డుపై రూ.100 – రూ.500 మధ్య అప్పు ఉంటే రూ.100 లేట్ పేమెంట్ ఛార్జ్ చెల్లించాలి. రూ.501 నుంచి రూ.1000 వరకు రూ.500… రూ.10,000 వరకు రూ.750… రూ.25 వేల వరకు రూ.900… రూ.50 వేల వరకు రూ.1000.. ఆపై ఉన్న డెబ్ట్ పై రూ.1200 ఛార్జీ పడుతుంది.
ఇంకో నెల రోజుల్లో సరికొత్త ఛార్జీలు అనేవి అమల్లోకి వస్తాయి కాబట్టి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులందరూ కూడా ఎక్కువ అప్పు లేకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. అలాగే క్యాష్ అడ్వాన్స్ ఫీజును దృష్టిలో పెట్టుకొని నగదు విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.
This post was last modified on January 9, 2022 2:36 pm
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More
90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More
Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More
Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More
Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త మరియు… Read More
Karthika Deepam 2 May 9th 2024 Episode: దీప తీయకపోయినప్పటికీ పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా… Read More
Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More