న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన దేశానికి హెచ్చరికలు చేస్తూనే భారత్‌పై మరోసారి విషం కక్కారు. పాకిస్థాన్ ఒక వేళ ఓ అణు బాంబుతో భారత్‌పై దాడి చేస్తే.. ఆ దేశం తిరిగి 20 అణుబాంబులు వేసి పాక్‌ను నాశనం చేస్తుందని వ్యాఖ్యానించారు. యూఏఈలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ముషారఫ్ మాట్లాడారు.
‘పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అయితే, ఇరుదేశాల మధ్య అణ్వస్త్రదాడులు జరిగే పరిస్థితి లేదు. ఒక వేళ మనం భారత్‌పై ఒక అణుబాంబుతో దాడి చేస్తే.. ఆ దేశం 20బాంబులతో పాకిస్థాన్‌ను సర్వనాశనం చేస్తుంది. దీనికి ఒకటే పరిష్కారం. పాకిస్థాన్ ఒకేసారి 50 అణుబాంబులతో భారత్‌పై దాడి చేయాలి. అప్పుడే భారత్‌కు 20 అణుబాంబులు వేసే అవకాశం ఉండదు. 50 అణుబాంబులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందా?’ అని పాకిస్థాన్‌ను ఉద్దేశించి ముషారఫ్ వ్యాఖ్యానించారని కరాచీకి చెందిన డాన్ పత్రిక వెల్లడించింది.
ఒక వేళ భారత్ కాశ్మీర్లో ఏదైనా దాడి చేస్తే.. పాకిస్థాన్ ఇందుకు ప్రతిగా సింధ్, పంజాబ్, ఇతర ప్రాంతాలపై దాడులు చేసి గుణపాఠం చెప్పాలని ముషారఫ్ తన దేశానికి సూచించారు. పుల్వామా దాడి జరిగిన వారం రోజుల తర్వాత ముషారఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పాకిస్థాన్‌లో రాజకీయ పరిస్థితులు సానుకూలంగా మారుతున్న క్రమంలో తాను స్వదేశానికి వెళతానని యూఏఈలో ఉంటున్న ఈ ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్(ఏపీఎంఎల్) అధినేత ముషారఫ్ చెప్పారు. ప్రస్తుత పాక్ మంత్రివర్గంలో సగం మంది తనవారే ఉన్నారని.. న్యాయశాఖ మంత్రి, అటార్నీ జనరల్‌గా ఉన్నది తన న్యాయవాదులేనని చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్‌తో ఇజ్రాయెల్ సత్సంబంధాలు కోరుకుంటోందని తెలిపారు. ముషారఫ్ 2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా కొనసాగారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పుల్వామాలో జరిపిన దాడిలో 40మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేళ నామినేషన్ దాఖలు చేసిన… Read More
సీChandrababu: ఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని..… Read More
Pulavarti Nani: ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి పులవర్తి… Read More
Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుండి జూన్… Read More
Lok sabha Elections 2024: ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి లో నామినేషన్ దాఖలు చేశారు. మోడీ… Read More
Dhe: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కంటే కమెడియన్సే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. హీరో మరియు హీరోయిన్స్… Read More
Super Jodi Winner: జీ తెలుగు సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో అయిన సూపర్ జోడి గ్రాండ్ ఫినాలే ముగిసింది.… Read More
Inaya: చూపు తెప్పకుండా మాట దాటకుండా చేసే అందం మైమరిపించే పాటు డేరింగ్ అండ్ డాషింగ్ గట్స్ తో ఆకట్టుకున్న… Read More
Balakrishna: నటి మరియు యాంకర్ అయినటువంటి ఉదయభాను మనందరికీ సుపరిషతమే. ఆరోజుల్లో ఆమె అందానికి ఎంతోమంది ఫిదా అయ్యేవారు. కొన్ని… Read More
Jabardasth Sujatha: ప్రజెంట్ జనరేషన్ లో చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా... తాము సంపాదించిన దాంట్లో కొంతమేర… Read More
Double Ismart teaser: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2006వ సంవత్సరంలో "దేవదాసు"… Read More
Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.… Read More
Ajith Kumar: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా సత్తా చాటుతున్న వారిలో అజిత్ కుమార్ ఒకడు. నిజానికి అజిత్… Read More
Barzan Majid: మానవ అక్రమ రవాణాలో ఆరితేరి, యూరప్ మోస్ట్ వాంటెడ్ గా మారిన బర్జాన్ మాజీద్ అలియాస్ స్కార్పియన్… Read More
Chiranjeevi-Balakrishna: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనదైన ప్రతిభా, స్వయంకృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.… Read More