Categories: సినిమా

special interview : నిడివి కాదు… పాత్ర ప్రాముఖ్య‌తే ముఖ్యం                                                                                                      – నివేదా థామ‌స్‌

Published by
Siva Prasad

`జెంటిల్‌మ్యాన్‌`, `నిన్నుకోరి`, `జై ల‌వ‌కుశ‌` చిత్రాల‌తో తెలుగువారికి బాగా చేరువైన మ‌ల‌యాళ న‌టి నివేదా థామ‌స్‌. క‌ల్యాణ్‌రామ్ స‌ర‌స‌న ఆమె న‌టించిన `118` శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి నివేదా థామ‌స్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూ
* ఏంటి `118` సస్పెన్స్ థ్రిల్ల‌రా?
– అవునండీ. అది స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. మిస్ట‌రీ కూడా ఉంటుంది.
* అస‌లు క‌థ ఏంటి?
– డ్రీమ్‌ని ఫాలో కావ‌డమే అండీ. స‌స్పెన్స్, థ్రిల్లింగ్‌, ఫిక్ష‌న్ త‌ర‌హాలో సాగుతుంది. ట్రైల‌ర్‌లోనూ `ఇట్స్ ఎ మెడిక‌ల్ మిరాకిల్` అని వినే ఉంటారుగా. ఆ మెడిక‌ల్ మిరాకిల్ ఏంట‌నేది సినిమాలో చూసి తెలుసుకోవాలి.
* మీ పాత్ర సినిమా అంతా ఉంటుందా?
– ఆఖ‌రి 20 నిమిషాల పాటు సాగుతుంది. నా పాత్ర పేరుగానీ, నా పాత్ర గురించి కానీ ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. క‌ల్యాణ్‌రామ్, శాలినీ పాండే పాత్ర‌ల గురించి మాత్రం బ‌య‌టికి చెబుతున్నారు.
* అంత త‌క్కువ నిడివి ఉన్న పాత్ర చేయ‌డానికి కార‌ణం?
– సినిమా అంతా ఉంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో, ఈ నిడివిలోనూ అంతే ఇంపాక్ట్ గా చేయ‌వ‌చ్చు. నిజం చెప్పాలంటే వాటిక‌న్నా ఈ సినిమా కోస‌మే చాలా జాగ్ర‌త్త‌గా చేశాను. ఎక్స్ ట్రా కేర్ తీసుకున్నా.
* ఇలాంటి క‌ల‌ల గురించి మీరు న‌మ్ముతారా?
– ఇది నిజంగా గుహ‌న్‌గారికి అనుభ‌వంలోకి వ‌చ్చిన విష‌యం. అయితే ఆయ‌న క‌ల‌ను వెతుక్కుంటూ వెళ్ల‌లేదు. కానీ ఈ సినిమాలో హీరో మాత్రం క‌ల‌ను వెతుక్కుంటూ వెళ్లాడు. తేడా అదే.
* మీకు ఎప్పుడైనా క‌ల నిజ‌మ‌వుతున్న‌ట్టు అనిపించిందా?
– రోజూ తెల్లారుజామున ఒకే క‌ల వ‌చ్చి అది నెర‌వేరుతున్న‌ట్టు అనిపిస్తే ఎవ‌రికైనా ఎంత భ‌య‌మేస్తుందండీ. నాకు అలాంటివేమీ రాలేదు. కాక‌పోతే కొన్నిసార్లు ఎక్క‌డికైనా వెళ్లిన‌ప్పుడు అలా అంత‌కుముందు కూడా ఎప్పుడో వెళ్లిన‌ట్టు కొన్ని సెక‌నుల పాటు ఫీలింగ్ ఉంటుంది అంతే.
* ఎన్టీఆర్ మీ పాత్ర గురించి చాలా మెచ్చుకున్నారు
– నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఒక న‌టుడిగా, స‌హ న‌టుడిగా ఆరాధిస్తాను. అలాంటి వ్య‌క్తి స్టేజీ మీద అలా చెబుతుంటే కాస్త అసౌక‌ర్యంగానే అనిపించింది. కానీ అంత‌కు మించిన అంద‌మైన భావ‌న కూడా క‌లిగింది.
* ఈ సినిమాకు ముందు అన్వేష‌ణ అని టైటిల్ పెడ‌దామ‌నుకున్నారా?
– అంటే చాలా టైటిళ్లు అనుకున్నాం. `భానుప్రియ‌`గారి `అన్వేష‌ణ‌`కు మా సినిమాకూ ఏమీ పోలిక‌లు ఉండ‌వు. కాక‌పోతే టైటిల్ కోస‌మే ఆలోచించాం. ఏం టైటిల్ పెట్టాలా అని ఆలోచించిన వాళ్ల‌లో నేను కూడా ఉన్నా. బుర్ర‌బ‌ద్ధ‌లు కొట్టుకున్నా.
* సినిమాలో మీ భాగ‌స్వామ్యం ఎంత‌వ‌ర‌కు ఉంటుంది?
– క‌ల్యాణ్‌రామ్‌కి ఓ విజ‌న్ ఉంది. ప్ర‌తిదీ ఆయ‌న షేర్ చేసుకుంటారు. ఒక సినిమా చేసేట‌ప్పుడు ఎంత వ‌ర‌కు జోక్యం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ సినిమా విష‌యంలో కొంచెం చ‌నువుంది, పైగా న‌చ్చిన స‌బ్జెక్ట్ కాబ‌ట్టి వెంట‌నే చేస్తున్నా.
* మీ మ‌ల‌యాళీలంతా తెలుగులోకి వ‌స్తున్నారు. త్వ‌ర‌లోనే తెలుగ‌మ్మాయిలు మీకు గ‌ట్టి పోటీ ఇస్తారులెండి…
– ఇవ్వ‌నివ్వండి. అయినా పోటీ అంటూ మొద‌ల‌య్యాక తెలుగు అమ్మాయిల‌తోనే ఎందుకు? అబ్బాయిల‌తోనూ పోటీ ప‌డ‌వ‌చ్చుగా. అయినా నాకు పోటీ ఒక‌రితో ఎప్పుడూ ఉండ‌దు. నాతో నాకే ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఈ మ‌ధ్య `118`కు తెలుగులో డ‌బ్బింగ్ చెప్పుకున్నా. బాగా చెప్పానో లేదోన‌ని ఒక‌టే టెన్ష‌న్‌. అక్క‌డున్న‌వారి బుర్ర తినేశాన‌నుకోండి.
* ఆ మ‌ధ్య బాగానే బ్రేక్ తీసుకున్నారు?
– కావాల‌ని తీసుకున్న‌ది కాదండీ. నేను ఆర్కిటెక్చ‌ర్ చ‌దువుతున్నా. అందులోనూ క‌ష్ట‌మైన ప్రాజెక్ట్ తీసుకున్నా. అందుకే గ్రౌండ్ లెవ‌ల్‌లో వ‌ర్క్ చేయాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో అటు ప్రాజెక్టు, ఇటు సినిమాలు అంటే నా వ‌ల్ల అయ్యేది కాద‌నిపించింది. అందుకే షూటింగుల్లో పాల్గొన‌లేదు. క‌థ‌లు మాత్రం చాలానే విన్నా. అందులో 118 కూడా ఒక‌టి. న‌చ్చ‌గానే చేశా.
* ఎలాంటి పాత్ర‌ల్లో న‌టించాల‌నుకుంటున్నారు?
– నాలుగు పాట‌ల‌కు డ్యాన్సులు వేసి వెళ్ల‌మంటే నాక్కూడా సులువుగానే ఉంటుంది. చేసేస్తాను. కానీ అంత‌కు మించి చేయాలి. స్క్రీన్ మీద న‌న్ను చూసిన‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు వారిలో ఒక‌మ్మాయిగా క‌నిపించాలి. అప్పుడు ఆ పాత్ర చేయ‌డంలో చాలెంజ్ ఉంటుంది.
* ఇప్పుడేం చేస్తున్నారు?
– బ్రోచేవారెవ‌రురాలో కామెడీ చేస్తున్నా. తొలిసారి కామెడీ రోల్ చేస్తున్నా. నిఖిల్‌తో `శ్వాస‌` మార్చి మ‌ధ్య‌లో మొద‌ల‌వుతుంది. దాంతో పాటు కొన్ని త‌మిళ సినిమాలు చ‌ర్చ‌ల్లో ఉన్నాయి.

This post was last modified on February 28, 2019 9:46 am

Siva Prasad

Recent Posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More

May 9, 2024

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More

May 9, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More

May 9, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More

May 9, 2024