ఈ పరిణామంపై అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య విమర్శల పర్వం కొనసాగింది. అయితే, ఈ అక్రమాల విషయంలో లోకేష్ తండ్రి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్పందన ఏంటనే ఆసక్తి పలువురిలో వ్యక్తమైంది. ఈ విషయంలో తాజాగా ఆయన స్పందించారు.
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం సందర్బంగా చంద్రబాబు తన తనయుడిపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించారు. “చేయని తప్పుకు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసిన విధానం ఏ విధంగా ఉందో మనం చూశాం. అరెస్ట్ చేసిన తర్వాత కూడా వెంటాడారు. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ అనేక ఇబ్బందులు పెట్టారు. భయపడితే మనం అనుకున్నది సాధించలేం. జగన్ మోహన్ రెడ్డి వైఫల్యాలను, అక్రమాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. లోకేష్‌కు సంబంధం లేకపోయినా ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో సంతకం పెట్టారంటూ దుష్ప్రచారం చేశారు. మైండ్ గేమ్ ఆడుతున్నారు.“ అంటూ చంద్రబాబు స్పందించారు.
ఏపీలోని బీసీలు, ఎస్సీలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. “మాస్కు అడిగిన పాపానికి ఓ దళిత డాక్టర్ సుధాకర్ పై కక్ష గట్టారు. పిచ్చోడని ముద్రవేశారు. కేసులో తీవ్రమైన అనుమానాలున్నాయని, కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజా చైతన్యానికి తెలుగుదేశం పార్టీ నాంది పలకాలి. ప్రజా చైతన్యనానికి తెలుగుదేశం పార్టీ నాంది పలకాలి. వైసీపీ నాయకుల వేధింపులను సమర్థంగా ఎదుర్కోవాలి. బాధిత వర్గాల ప్రజల్లో మనోధైర్యం నింపాలి. పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. ప్రజల పట్ల మన బాధ్యత నిర్వర్తించాలి. ప్రజలు చైతన్యవంతులై వైసీపీ అరాచకాలపై తిరగబడే పరిస్థితి వచ్చింది.“ అని చంద్రబాబు తెలిపారు. టీడీపీని ఇబ్బందిపెట్టిన ప్రతిఒక్కరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం.“ అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తన జీవితాంతం టీడీపీకి రుణపడి ఉంటానని ప్రకటించారు. “జగన్ లాంటి దుర్మార్గ పాలన గతంలో ఎన్నడూ చూడలేదు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమంగా నన్ను ఇబ్బందిపెట్టినప్పుడు చంద్రబాబునాయుడు, పార్టీ యువనేత లోకేష్ చాలా మద్దతుగా నిలిచారు. మిగతా అందరూ అండగా నిలిచారు“ అని పేర్కొన్నారు. జగన్ పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు.
This post was last modified on September 25, 2020 9:43 pm
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్‌ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్‌లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More
90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More
Neethone Dance: బిగ్‌బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More
Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More
Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త మరియు… Read More
Karthika Deepam 2 May 9th 2024 Episode: దీప తీయకపోయినప్పటికీ పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా… Read More
Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More