Nimmagadda Ramesh: కోర్టులో గెలిచిన నిమ్మగడ్డ గెలవాల్సిన కీలక పరీక్ష ఇంకోటి ఉంది..!?

Published by
Muraliak

Nimmagadda Ramesh  .. కోర్టులో గెలిచిన నిమ్మగడ్డ Nimmagadda గెలవాల్సిన కీలక పరీక్ష ఇంకోటి ఉంది. అది రాజకీయంగా. ఎస్ఈసీ నిమ్మగడ్డకు రాజకీయాలతో సంబంధం లేదు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఇప్పటికే చర్చనీయాంశంగా మారిన ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఉండని ట్విస్టులు, ఎత్తుకు పైఎత్తులు, వాదోపవాదాలు, విమర్శల ప్రస్తుతం ఉన్నాయి. ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుంది. కానీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మాత్రం అధికార పార్టీకి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మధ్య పోటీ నెలకొనడం ఇక్కడ విశేషం. దాదాపు ఏడాదిగా జరుగుతున్న ఈ యుద్ధానికి ఇటివలే తెర పడింది. ఇప్పటికైతే ప్రభుత్వంపై పైచేయి సాధించిన నిమ్మగడ్డ మరింత సాధించాల్సింది ఉంది. కానీ.. అది సాధ్యమవుతుందా.. అనేదే ప్రశ్న.

tough test to sec nimmagadda ramesh kumar

 

Nimmagadda Ramesh : వైసీపీపై కఠినం.. టీడీపీపై సానుభూతి..

ఎస్ఈసీ నిమ్మగడ్డ టీడీపీకి కొమ్ము కాస్తున్నారని, చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారని, సామాజికవర్గంపై ఉన్న అభిమానంతో చంద్రబాబుకు ఫేవర్ చేస్తున్నారని మొదటి నుంచి మండిపడుతోంది అధికార పక్షం. ఈ విషయంలో వైసీపీ మొదటి నుంచీ గట్టి ప్రభావమే చూపింది. ఎన్నికలు వాయిదా వేసింది అందుకేనని ప్రజల్లోకి బలంగానే తీసుకెళ్లింది. అయితే.. తనకు ఆ ఉద్దేశం లేదని నిరూపించే ప్రయత్నాలేవీ నిమ్మగడ్డ చేయలేదు. ఆయనతో సంబంధం లేదని టీడీపీ కూడా గట్టిగా చెప్పలేదు. చట్టాలను ఉపయోగించుకుని నిమ్మగడ్డ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ టీడీపీ ముందుకెళ్లాయి. పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో విడుదల చేసారు.. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు. కానీ.. ఇందుకు టీడీపీకి నోటీసులు మాత్రమే ఇచ్చిన నిమ్మగడ్డ.. వైసీపీ ప్రభుత్వానికి చెందిన ప్రతి విషయంలో కర్ర కాల్చి వాత పెడుతున్నారు. సజ్జల, ప్రవీణ్ ప్రకాశ్, డీజీపీ, ఇద్దరు కలెక్టర్లు, ఐఏఎస్ లు.. వీరందరిని పంచాయతీ ఎన్నికల నిర్వహణ నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ.. టీడీపీపై మాత్రం నోటీసులకు ఎక్కువ.. బుజ్జగింపులకు తక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

వైసీపీకి దొరికిన ఆయుధం ఇదే..

ఇదే ఇప్పుడు వైసీపీకి వరంలా మారింది. ప్రజల్లోకి నిమ్మగడ్డ వ్యవహారాన్ని బలంగా తీసుకెళ్లాలి. ఇదే ప్రభుత్వ వ్యూహం. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం దిగి వచ్చేలా చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసు నెగ్గి నిమ్మగడ్డ చాలా ఆత్మస్థైర్యంతో ఉన్నారు. టీడీపీని, నిమ్మగడ్డను ఇప్పుడు ఒకేసారి దెబ్బ కొట్టాలంటే ప్రభుత్వం నుంచి వీరి చర్యలను విమర్శిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పుడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తోంది ఇదే. నిమ్మగడ్డపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వీరి వ్యాఖ్యలపై గవర్నర్, హైకోర్టుల వరకూ వెళ్లారు ఎస్ఈసీ. నిమ్మగడ్డ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మాత్రమే కాకుండా.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం నిమ్మగడ్డను ఇరుకున్న పెట్టే ప్రయత్నాలే చేస్తోంది. ఒకరో ఇద్దరో కాదు.. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి నిమ్మగడ్డ, టీడీపీపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఇది ప్రజలకు అర్ధమైతే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా టీడీపీకి వ్యతిరేకమే అవుతుందని.. తమకు లాభిస్తుందనేది వైసీపీ ఆలోచన. అయితే..

Nimmagadda Ramesh నిమ్మగడ్డ నిరూపించుకుంటారా..?

అనూహ్యంగా ఇటివలి కడప పర్యటనలో నిమ్మగడ్డ వైఎస్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన వల్ల తాను ఎంత లబ్ది పొందానో చెప్పుకొచ్చారు. ఇవేమీ వైసీపీ నేతలకు సాంత్వన చేకూర్చేవి కావు. యుద్ధం మొదలయ్యాక ఇక వెనక్కు తగ్తేది ఉండదు. ఈ విషయంలో నిమ్మగడ్డ, వైసీపీ ప్రభుత్వం దూకుడుగానే వెళ్తున్నాయి. ఇక్కడ ఎవరూ తగ్గరనేది తెలిసిన విషయమే. అయితే.. జరుగుతున్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడమే ఇక్కడ ఇద్దరి లక్ష్యం కూడా. ఈ క్రమంలో నిమ్మగడ్డ వ్యవహారంలో వైసీపీ ఒక అడుగు ముందుకే వేస్తోంది. 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నిమ్మగడ్డ రమేశ్ ఎస్ఈసీగా ఉన్నారు. అప్పుడు నిర్వహించాల్సిన ఎన్నికలు నిర్వహించకపోవడం, గత ఏడాది సీఎం జగన్ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉంటే నిమ్మగడ్డ వాయిదా వేయడం, ప్రస్తుతం టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయడం, ఎస్ఈసీ సీరియస్ గా ఆ విషయాన్ని తీసుకోకపోవడం.. వైసీపీ ప్రభుత్వానికి కలిసొచ్చేవే. ఈ విషయంలోనే నిమ్మగడ్డ వైసీపీ ప్రభుత్వం పైచేయి సాధించాల్సిన అంశాలు. మరి.. ఈ ఎన్నికలు పూర్తయ్యేలోపు గానీ.. ఆయన పదవీ విరమణ చేసే సమయంలోపు గానీ నిమ్మగడ్డ నిరూపించుకుంటారో లేదో చూడాలి.

This post was last modified on January 31, 2021 5:13 pm

Muraliak

Recent Posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

Vindhya Vishaka: వింధ్య విశాఖ మేడపాటిని కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగులో ఎంతో మంది యాంక‌ర్లు ఉన్నా… Read More

May 7, 2024

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

Alia Bhatt: ఆలియా భట్.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలియని ఇండియన్ సినీ ప్రియులు ఉండరు. దాదాపు దశాబ్దన్నరకాలం నుంచి… Read More

May 7, 2024

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

Mega Star Chiranjeevi: ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే అందరి… Read More

May 7, 2024

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

Arya: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్య. ఈ సినిమా విడుదలై… Read More

May 7, 2024

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

YS Sharmila: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప లోక్ సభ అభ్యర్ధి… Read More

May 7, 2024

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

Sunita Williams: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన స్టార్… Read More

May 7, 2024

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

Vladimir Putin: ఉక్రెయిన్ సమీపంలో ఆణ్యాయుధాల విన్యాసాలు ప్రారంభించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. ఈ… Read More

May 7, 2024

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

BrahmaMudi: రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గర తల్లి అంటున్న మాటలు వింటూ సైలెంట్ గా ఉంటాడు. రుద్రాణి కావ్య నీ… Read More

May 7, 2024

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

Krishna Mukunda Murari:ముకుంద అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటుంది. మురారి బిడ్డకి తల్లి అవ్వాలనుకున్న ముకుంద కోరిక సరోగసి ద్వారా… Read More

May 7, 2024

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

Devara: RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ "దేవర" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ… Read More

May 6, 2024

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు అని, ఈ  వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యే చేశారని ఆంధ్రప్రదేశ్… Read More

May 6, 2024

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Koratala Siva On Devara: చాలామంది ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న సినిమాలలో దేవరా కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్… Read More

May 6, 2024

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Premalu OTT: ప్రేమలో సినిమా మలయాళ ఇండస్ట్రీని ఏ విధంగా సెట్ చేసిందో మనందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో… Read More

May 6, 2024